Quotes From One Of The Best Telugu Books For Beginners To Read - Amrutham Kurisina Rathri

Updated on
Quotes From One Of The Best Telugu Books For Beginners To Read - Amrutham Kurisina Rathri

Contributed By Divya Vattikuti

దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారు రాసిన అద్భుతం “ అమృతం కురిసిన రాత్రి ”. పుస్తకం లోని ప్రతి పదము పేరుకి తగ్గట్టే ఉంటుంది . అమృతం నిజంగా కురిస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంతే హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకాల్లో తప్పక ఉండేది అమృతం కురిసిన రాత్రి.

పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఈ పుస్తకం వారి జీవితం లో చాలా ప్రభావితం చేసిందని చెప్పారు. తన అన్ని పుస్తకాల లోకి " అమృతం కురిసిన రాత్రి" ద్వారా తిలక్ గారికి చాలా కీర్తి వచ్చింది. ఈ పుస్తకానికి కి గాను తిలక్ గారిని 1970 లో ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పురస్కరించారు. ఈ కవిత సంపుటి తెలుగు బాషా సాహిత్యం లో ఒక మైలురాయి అని ఎందరో రచయతలు కీర్తించారు .

అలాంటి అద్భుతమైన పుస్తకం లో నుంచి రచయత చెప్పిన అమృతమైన పలుకులు మీ కోసం ఇలా .. .

1.When the author says being brave is the only armor that can protect you all the time.

ధైర్యంగా ఉండటమే ఒక పెద్ద ఆయుధం అని చెప్పడానికి కవి చీకటిలో దీపం లేకపోయినా ధైర్యమే నిన్ను కాపాడుతుంది అంటూ చెప్తారు ఈ పుస్తకం లో..

2.When he explains how mundane our lives are turning into..

అమృతం కురిసిన రాత్రి అందరు నిద్రపోతున్నారు. ఇలా చెప్పడం లో కవి ఆంతర్యం గమనిస్తే మన నిత్యజీవితపు దినచర్యను వర్ణిస్తున్నారు అనేలా ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితం లో ఆగి ప్రకృతిని ఆస్వాదించడమే ఆపేశాం మనమంతా. అలవాటుని అస్వతంత్రతను కావిలించుకొని అధైర్యం తో ముడుచుకొని పడుకున్నాం అని చెప్తూ మనం చేసే రోజువారీ పనులు ఎందుకోసం అని ప్రశ్నించేలా ఉంటుంది ఈ కవిత..

మన 9 - 5 ఉద్యోగాల గురించి చమత్కరిస్తూ చెప్పిన కవిత ఇది. భూకంపం వచ్చిన, మరో ప్రపంచ యుద్ధం జరిగిన, తన భార్య కి కావాలా పిల్లలు పుట్టిన, కోటేశ్వర రావు ఆఫీసు వెళ్లడం మాత్రం మానదు అని అంటారు హాస్యంగా.

3.When he asks to not remain silent against oppression

విప్లవ భావాలు కలిగిన బాల గంగాధర్ తిలక్ గారు తన కవితల ద్వారా పాఠకుల్లో ఒక ఆదర్శ భావాలు రేపెట్టగలిగారు. ఫలితాలు ఇవ్వని చోట ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. అసమర్ధులైన రాజకీయ నేతలకు పట్టం కట్టి కష్టాలు తీరతాయని ఎదురు చూడటం నిష్ఫలితం, కనుక ఆలోచన తో అడుగులు ముందుకు వెయ్యమని చెప్తారు కవి ఈ పద్యం లో.

4.When he compares life of a butterfly with human dreams and aspirations

గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారక మారే ప్రక్రియ లాంటిది మానవ జీవితం అంటూ వర్ణిస్తార్రు కవి ఇక్కడ .

5.When he explains how precious time is…

కాలానికి రూపం లేదు, పాపం లేదు, అడ్డం లాంటిది కాలం. మన కోసం ఎదురుచూడదు కాలం. కాలం తో సాగే ఈ జీవిత ప్రయాణం లో మనకు మనమే స్వీయ ప్రేరణ తో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

6.When he tells life is a war

అజ్ఞానమే మన శత్రువు. అన్ని తెలుసు అని అనుకోవడం మనం మూర్కత్వం అని ఎంతో చక్కగా వనిస్తారు కవి ఇక్కడ.

7.When he explains why he writes….

తాను ఇదంతా ఎందుకు రాస్తున్నదంటే , తాను చెప్తుంటే బల్లి వెళ్లిపోయింది, చెట్టు నిద్రపోయింది కనుక ఇలా పేపర్ మీద రాస్తున్న అంటూ హాస్య రూపం లో చెప్తారు కవి ఇక్కడ.

8.Ee 2021 gurinche rasinattu ga undhi ee kavitha aithe…

లైట్లు వెలిగిన రైల్వే స్టేషన్ లోకి రైలు వచ్చినట్టుగా కొత్త సంవత్సరం రావాలి అనుకొనేలోపలే ప్లాట్ఫారం చీకటిమయం అయ్యింది. రేపటి ఉదయానికి వేసిన రైలు పట్టాలు ఎవరో తొలగించారు. నిరాశ నిస్పృహలను అద్భుతమైన మాటలతో వర్ణించారు.

9.When the author explains about life, good and bad deeds all in just a couple of sentences

ప్రాణం, పాపం, పుణ్యం అన్నిటిని మధ్య సంబంధాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తారు ఈ కవితలో. సమాధి మీద ఉన్న దీపం చావుకు ప్రతిరూపం అయితే, దేవాలయం ముందు ఉన్న దీపం దేవుని బంధిచిన కారాగారానికి చిహ్నం అంటారు కవి ఇక్కడ.

10.When the author says not to loose hope at any time

మనిషి జీవితం ఎప్పుడు ఏదోకటి అన్వేషించడం లోనే, చిన్నపుడు బొమ్మలకు అన్వేషణ, పెద్దయ్యాక ఉద్యోగం కోసం అన్వేషణ, ఇంకొన్నాళ్ళకి డబ్బు కోసం అన్వేషణ, ముసలి తనం వచ్చాక చావు కోసం అన్వేషణ. ఈ అన్వేషణ లో ఆశే మనిషిని బ్రతికిస్తుందని ఎంతో చక్కగా చెప్తారు కవి.

ఈ పుస్తకం లోని కవితలు ఒక్కో వయసులో ఒక్కోలా, ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధం అవుతూ ఉంటాయి. ఆలా రాయగలడమే కవి బాల గంగాధర్ తిలక్ గారి గొప్పతనం.