నా పేరు అమీర్ హుస్సేన్... మాది ఒక దిగువ మద్యతరగతి కుటుంబం. మా నాన్న చిన్న పిల్లలు ఆడుకునె క్రికెట్ బ్యాట్ లను తయారుచేస్తుంటాడు. నాకు నా తండ్రి అంటె చాల గౌరవం ఆ గౌరవంతోనె మా నాన్న చేసె పనిలో నేను సహాయం చేస్తుంటాను. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఎప్పటిలాగె Machine తో
బ్యాట్ లను Cut చేస్తుండగా దురదృష్టవశాత్తు నా రెండు చేతులు తెగిపడ్డాయి, రక్తపు మడుగులో ఉన్న నన్ను కనీసం నా దగ్గరికి రావడానికి కూడ ఎవ్వరికి దైర్యం చాలలేదు. కొంతసేపటికి నాన్న వచ్చి హస్పిటల్ కి తీసుకెళ్ళారు. నా తండ్రికి సహాయం చేసె నా రెండు చేతులు పోయాయి అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు, నేను చదువుతున్నది 2వ తరగతి.
ఆ సంఘటన నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడ నాశనం చేసింది. ఈ రెండు సంవత్సరాల Hospital Treatment కోసం నా కుటుంబం ఆస్థి మొత్తం అమ్మేసి వారి జీవితాలనె త్యాగం చేశారు. కష్టాల సుడిగుండంలో రంపపు కోతను అనుభవించినా కూడ ఏనాడు నేను నా ధైర్యాన్ని కోల్పోలేదు... కాని నాకు తెలుసు నేను వాస్తవ పోటి ప్రపంచానికి చాల దూరంగా ఉన్నాను. అందరిలా నేను జీవితంలో యుద్ధం చేయలేను కాని నాకున్న శక్తితో కనీసం పోరాటం అయినా చెయ్యగలను. నాలో ఆ అల్లాః ను చూసుకుంటు నాకు సేవ చేసెది మా నాయనమ్మ. తన మాటలతో నాలో స్పూర్తిని నింపేది...
నా School Authority వారు నన్ను Psychically Handicapped Student కి సంబందించిన School కి వెళ్ళమని చెప్పారు, కాని నా కుటుంబం అందుకు
నిరాకరించారు. నేను అదే స్కూల్ లో నా చదువును కొనసాగించాను. నేను వారిలా తిరిగి కొట్టలేను అని నా తోటి క్లాస్ మేట్స్ వెకిళి చేష్టలతో నన్ను కొట్టెవారు కాని నాకు ఏ ఒక్కరు సహాయం చేసె వారు కాదు...నాకు సాయం చేయమని టీచర్స్ నీ అర్ధించాను కాని వాళ్ళు "నీకు Help చేయడానికి నేను నీ ఇంట్లొ పనిమనిషిని కాను" అని తిట్టెవారు. నేను చాల భాద పడేవాడ్డాను. కాని అలా ఏడుస్తు కూర్చుండె వాడిని కాదు... Notebooks కొనడానికి డబ్బులు లేకుంటె పాత Cloths తెచ్చుకుని ఒక గోడకు కట్టి కాలి వేళ్ళతో వ్రాయడం నేర్చుకున్నాను... నేర్చుకున్నా... వ్రాయడంలో రాటుదేలే వరకు. నా Intermediate వరకు నేనే Exams రాసి మంచి Marks తో Pass అయ్యాను...
అప్పటి వరకు Elastic Track Pants వేసుకునె నాకు, మాములు Pants వేసుకుంటేనే డిగ్రీ చదువుకు అనుమతి ఇస్తామని మా ఊరులోని కాలేజిలన్ని షరతుపెట్టాయి... నాకు మాములు Pants వేసుకోడాని సంవత్సరం పట్టింది. 2013 లో నాకు Govt Degree College లో జాయిన్ అయ్యాను. ఒకరోజు Class Room లో నా Pant జారిపోయింది... నా తోటి విద్యార్ధులందరు నవ్వుతున్నారే తప్ప నాకు ఏ ఒక్కరు సాయం చెయ్యలేదు , ఒకపక్క నేను ఏడుస్తున్నా నా ఏడుపులో వాళ్ళు నవ్వు వెతుక్కుంటున్నారు... ఏం చెయ్యాలో తెలియక బయటకు వచ్చి కొంతమందిని ప్రాదేయపడ్డ ఏ ఒక్కరు ఆదుకోలేదు.... ఒక చీకటి గదికి వేళ్ళి చీకటి పడేంతవరకు అక్కడ ఉండి చీకట్లో జనాలు కనపడరు అని ఇంటికి అలాగే వేళ్ళాను. నా పరిస్థితిని చూసి నా కుటుంబం గుండె పగిలేల రోదించింది... ఆ పరిస్థితిలో కూడ నేను ఎవ్వరిని తిట్టుకోలేదు... ఆ పరిస్థితి నుండే నేను ఎవరి సాయం లేకుండా Swimming, Drinking, Eating, Running, బట్టలు వేసుకోవడం, Computer Operating చేయడం నేర్చుకున్నా...
నేను పుట్టకతోనె గొప్ప క్రికేటర్ ని కాదు, కాని చూడటం ఇష్టం. మా పక్కింటికి వెళ్ళి చూసెవాడిని . ఒకరోజు నువ్వు మా ఇంటికి రావద్దని నువ్వు వస్తే మా పరువు పోతుందని నన్ను గెంటేశారు , క్రికెట్ మీదున్న ప్రేమతో కిటికి దగ్గర నిలబడి చూస్తుంటే "ఈ టి.వి నీకొసం కాదు ఇక్కడ నుండి దొబ్బేయ్ అని నా మీదకి చెక్కబొమ్మ విసిరేశారు...." దానిని ఆపడానికి నాకు చేతులులేవు అది నా కంటికి తగిలింది... అప్పుడే నిశ్చయించుకున్నా నేను క్రికెట్ ఆడాలని...నాతో ఆడటానికి ఎవ్వరు లేకుంటే మా నాయనమ్మనే నాతో ఆడేది. నాకు సచిన్ టెండుల్కర్ అంటే ప్రాణం, ఆయనలా గొప్ప క్రికెటర్ అవ్వాలని కష్టపడ్డాను... ఎన్నో నిద్రలేని రాత్రులు , ఎన్నో ఓటములు , నా కన్నీల్లను నా కాలి వేళ్ళతో తుడుచుకుంటు కష్టపడ్డా ... ఆ కష్టంలోనె బౌలింగ్, బ్యాటింగ్ లో రాటుదేలి క్రికెట్ లో మెలకువలు నేర్చుకున్నా...
ఒక్కో మెట్టు ఎదిగి ఈరోజు Kashmir Para-Cricket Team కు Captain అయ్యాను ఎవరయితే నన్ను చూసి నవ్వుకున్నారో వాల్లే ఇప్పుడు "అమీర్ నా స్నేహితుడు" అంటు గర్వంగా చెప్పుకుంటున్నారు.... ఎవరైతె మా ఇంటికి రాకు మా TV చూడద్దు అని అన్నారో వాల్లే TV లో నన్ను చూడటానికి ఎదురుచూస్తున్నారు...
ఈరోజు భారతదేశం అంతా నన్ను చూస్తుంది, గర్వంతో ఆనందపడుతుంది, కాని ఇవన్ని చూడటానికి మా నాయనమ్మ లేదని చిన్న వెలితి. నాకు ఇప్పటికి నిజమైన
సంతోషం లేదు నాలాంటి వాళ్ళు ఇంకా మా ఊరిలో ఉన్నారు... నేను పుట్టి పెరిగిన నా ఊరుని బాగు చేసినప్పుడే నాకు నిజమైన సంతోషం...
"ఏంటoడి మన కష్టాలు అసలు.... " అమీర్ కష్టాల ముందు మన కష్టం ఎంత???
"ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నట్టుగానే ఒక లోపమనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ లోపాన్నె పట్టుకుని టాలెంట్ ని ఒదిలేసి నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఇంట్లో అమ్మ నాన్నలను, జనాలను, ఎక్కడో ఉండే పొలిటిషియన్ లను తిడుతు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం..."
"లోపమనేది ఒక అదృష్టం లాంటిది ఆ లోపంలో ఉన్న వివక్షత తోనే తెగింపుతో ఉన్నతంగా ఎదగొచ్చు... అన్ని ఉండి గెలిచిన వాడి కంటే ఏమి లేకున్నా కష్టపడి
పైకొచ్చిన వాడే విజేత...."
*వాడినే ఈ ప్రపంచం కీర్తిస్తుంది.... వాడే ఈ ప్రపంచానికి స్పూర్తి*