కైకాల సత్యనారాయణ, నటనలో ఆయనది విలక్షణ శైలి . 70,80 వ దశకాలలో ప్రతినాయక పాత్రలని కథానాయకుడి పాత్ర తో సమంగా పండించేవారు కైకాల గారు. కేవలం విలన్ పాత్ర లకే పరిమితం కాలేదు , తన నటనతో దిగ్దర్శకులని మెప్పించి తన కోసమే పాత్రలని సృష్టించే స్థాయికి ఎదిగారు. పౌరాణిక , జానపద, సాంఘిక ఇలా ఆయన పోషించని పాత్ర లేదు. కళ్ళలో రౌద్రం ,గొంతులో గాంభీర్యం , ఆహార్యంలో ఠీవి ,తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించి నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కైకాల సత్యనారాయణ గారు. వారు పోషించిన అనేకానేక పాత్రాల్లోంచో చిరకాలం మనకి గుర్తుండిపోయే కొన్ని పాత్రలని ఓసారి చూద్దాం .
1. తాత మనవడు - ఆనంద్
2. లక్ష్మీ కటాక్షం - ప్రచండుడు
3. తాయారమ్మ బంగారయ్య – బంగారయ్య
4. అడవిరాముడు - నాగరాజు
5. మొరటోడు - రాజు
6. శ్రీరంగనీతులు - నారాయణ మూర్తి
7. బొబ్బిలి పులి - సన్యాసి
8. యుగంధర్ - రాంసింగ్
9. యమగోల - యముడు
10. గోల నాగమ్మ - మాయల ఫకీర్
11. చాణక్య చంద్రగుప్త - రాక్షస మంత్రి
12. చిరంజీవి - Inspector
13. అన్వేషణ - రావు
14. యముడికి మొగుడు - యముడు
15. సూత్రదారులు - నీలకంఠయ్య
16. జయమ్ము నిశ్చయమ్మురా - సుబ్బయ్య
17. అమ్మ రాజీనామా - రామచందర్రావు
18. రాంబంటు - రాజా రామచంద్ర ప్రసాద్
19. యమలీల - యముడు
20. ఘటోత్కచుడు - ఘటోత్కచుడు
21. మురారి - సత్తిపండు