Amaravathi Kathalu: A Nostalgic Telugu Book With 100 Stories To Fall In Love With

Updated on
Amaravathi Kathalu: A Nostalgic Telugu Book With 100 Stories To Fall In Love With

Contributed by Divya Vattikuti

సత్యం శంకరమంచి రచించిన ఈ కథలు మొదట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం అయ్యేవి. ఆ తర్వాత పుస్తక రూపం లో వచ్చిన ఈ పుస్తకాన్ని 1979 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఏక కాలంలో ఒక్క 37 సంవత్సరాల తండ్రిని, 7 ఏళ్ళ కూతురిని కూడా ఆకట్టుకున్న అద్భుతమైన కథలు అమరావతి కథలు. నా చిన్నప్పుడు నేను చుసిన జ్ఞాపకాలని నా కళ్ళ ముందు ఉంచడమే కాకుండా, నేను కూడా చూడని పెద్ద వాళ్ళ ద్వారా విన్న ఎన్నో విషయాలని, ఆచార వ్యవహారాల్ని కూడా నాకు అవగతం చేసాయి. పల్లెటూరి మనుషుల జీవన విధానం గురించి ఎన్నో కథలు ఉన్న ఈ పుస్తకంలో బుద్దుడి కథలు, జమీందారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారి కథలు ద్వారా సంఘర్షణ,భావోద్వేగాలు, ఫిలాసఫీ లాంటివి కూడా చెప్పారు. సత్యం శంకరమంచి గారి అద్భు త కల్ప నలో ఒకటైన అమరావతి కథలు అమ్మ చేతి ఆవకాయంత కమ్మ గా ఉంటాయి.

STORY BACKDROP

పుస్తకం లో దొంగలు, దొరలూ, భక్తులు, నాస్తికులు, దేవుళ్ళు, దెయ్యాలు, దాతలు, లోభులై, ఆచారాలు, చేయదాస్థాలి, మతాలు, కులాలు వంటి పెద్ద విషయాల నుంచి, ఒక చిన్న కార్తీక దీపం, వాన చినుకులు, ఇసుక రేణువు వరకు అన్నిటి గురించి చెప్తారు రచయత. తినడం, పడుకోవడం, గుడికి వెళ్లడం ఇలా ప్రతి విషయం కథ వస్తువే సత్యం శంకరమంచి గారికి.

చాలా కథలలో అమరేశ్వరుడి ఆలయ ప్రస్తావన ఉంటది. ఒక్క వూరు నుంచి ఇంకో వూరికి వెళ్ళడానికి కేవలం బస్సు కానీ, ఎడ్ల బండి గానీ వాడే నేపథ్యం ఉన్న కథలు. ఇంటిలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే కృష్ణ నదికి వెళ్లి కావిళ్ళలో తెచ్చుకొనే రోజులలో జరిగిన కథలు. ప్రతి కథ గురించి ఇప్పుడు రాయాలి అంటే అయ్యే పని కాదు కానీ, చాలా అద్భుతం అని మాత్రం చెప్పవచ్చు.

LANGUAGE

వంద కథల సంపుటి అయిన అమరావతి కథలు అర్ధం చేసుకోవడానికి సులువుగాను, మధురంగాను ఉంటాయి. ప్రతి కథలో ఇప్పుడు పెద్దగా వాడటం మానేసిన రెండు మూడు పదాలు అయిన తగులుతాయి.

BAPU GAARI ILLUSTRATIONS

బాపు గారి బొమ్మలతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరిని ఆకట్టుకుంటాయి అమరావతి కథలు. సాధారణంగా కథ చదివేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఒహ ఉంటుంది. పుస్తకం లో ఉండే చిత్రాలు ఒక్కోసారి మన వ్యిహాకి కలుస్తాయి. కొన్ని ఎదురొస్తాయి. కొన్ని ఊహని, కథని తలదన్నేలా ఉంటాయి. ఈ కథలకి బాపు వేసిన చిత్రాలు మాత్రం కేవలం బొమ్మలు కావు. రూపానువాదాలు. రేఖా శిల్పాలు. అద్భుత వ్యాఖ్యానాలు. కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను, నందీశ్వరుడు, గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని ఆది దేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.

ఈ ఒక్క బొమ్మను సుమారు ఒక 12 కథల కోసం ఉపయోగిస్తారు పుస్తకం లో. కానీ ప్రతి కథకు చిత్రం లో కొత్త అర్ధం కనిపిస్తుంది చదివే వారికీ. అదే బాపు గారు చేసే మాయ. అదే బాపు గారు గొప్పతనం.

Popular stories from the book

TRUPTHI

అమరావతి ఊరి ప్రజలు ఎంతటి కమ్మని వంటలు తినేవారో అనిపిస్తుంది ఈ "తృప్తి" కథ చదివితే.

VARADHA

ప్రళయం వచ్చినప్పుడు మన్ను మిన్ను ఏకం ఐనప్పుడు అన్ని కులాల వాళ్ళు ఆపద కాసుకోవడం, అందరు కలిసి ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్ని కులాల వారు కలిసి ఎలా బ్రతుకు కోసం ప్రయాంతిస్తారు అనేదే ఈ కథ. కానీ వరద వచ్చి ఆ పూటకి బురద కడిగేసిన, అంత మామూలు అయ్యాక మనిషి మనసు మళ్ళి మామూలే. ఎన్ని వరదలొచ్చినా మనసులోని మాలిన్యం కడిగేయకపోతున్నాం అని చెప్తారు రచయత.

భోజన చక్రవర్తి అప్పంభొట్లు భోజనం చేస్తుంటే ఆ భోజన వైభవం గురించి చదివి మనకి నోరు ఊరాల్సిందే. భోజన చక్రవర్తి తృప్తిగా తినే ఒక వ్యక్తి కథ అయితే,

తులసి తాంబూలం కథ తృప్తిగా పస్తుందే దంపతుల కథ.

కొత్తగా వచ్చిన బస్సు వాళ్ళ జట్కాగుర్రం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పే కథ "అదిగదిగో బస్సు".

అమరావతి ప్రేమ కథలు వాటికి అవే సాటి అని చెప్పే కథలు ఎన్నో. కొత్తగా పెళ్లి అయ్యిన జువ్వి, చిన్తాలు మావా పని కొరకై దూరంగా ఉండాల్స్ వస్తది ఆ సమయం లో కాకులు ఉడతలు ద్వారా జువ్వి తన మొరకి సందేశం ఎలా చేర్చిందో అన్నదే " కాకితో కబురు చెప్పడం" కథ.

నావ నడిపే రంగయ్య ఈ దరి నుంచి ఆ దారికి చేరే లోపల అందరూ ప్రయాణికుల్ని పలకరిస్తారు. ఒక్కొక్క పలకరింపు ఒక్కో కథ. ఒక్కో జీవిత కథ.

ఇలా ఎన్నో కథలు. ఎన్నో జీవిత పాఠాలు. పుస్తకం లోని ప్రతి కథను ఏదొక తీపి అనుభూతిని మిగులుస్తుంది. ఒకవేళ మీరు పుస్తకం చదివి ఉంటె మీకు నచ్చిన కథ ఏమిటో మాకు కామెంట్స్ రూపం లో తెలియచేయండి.