Here Are Some Interesting Points From Interview Of Trivikram & Thaman With All Lyricists Of "Ala Vaikuntapuramulo"

Updated on
Here Are Some Interesting Points From Interview Of Trivikram & Thaman With All Lyricists Of "Ala Vaikuntapuramulo"

Ala vaikuntapuram lo prati okka song super hit ayyayi. అవి హిట్ అవ్వడం వెనక తమన్ సంగీతానికి ఎంత ప్రాధ్యానత ఉందొ, సాహిత్యం రాసిన రచయితల ప్రతిభ అంతే ఉంది. 6 పాటలు, 6 రచయితలు, ఒక్కొక్కరు ఆ పాట తాలూకు భావాన్ని విన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, అర్ధమయ్యి అనుభవించేలా, సులభంగా పాడుకునేలా రాశారు. ఆ రచయితలందరు ఒక చోట చేరి వాళ్ళు ఆ పాట రాయడం వెనుకున్న జరిగిన కథని, పడిన మాధానాన్ని, ఆ పాట పుట్టిన వైనాన్ని త్రివిక్రమ్ గారు, థమన్ గారితో కలిసి పంచుకున్నారు. ఇది ఒక ఇంటర్వ్యూ లాగ కన్నా, ఒక సాహితి గోష్టి లాగ సాగింది. ఒకరి పాట ని ఒకరు విశ్లేషిస్తూ, ఆ పాట లో సాహిత్యాన్ని వివరిస్తూ.., తెలుగు సాహిత్యం లోని అందాన్ని వారి మాటల్లో చెప్పారు..

ఈ ఇంటర్వ్యూ లో ని కొన్ని విషయాలు: "అల వైకుంఠపురములో" టైటిల్ పాట ని రాసిన కళ్యాణ చక్రవర్తి గారు. ప్రముఖ తెలుగు రచయిత కొసరాజు గారి మనవడు. "బుట్టబొమ్మ" పాట కన్నా ముందు ఒక tune అనుకుని మొత్తం పూర్తయ్యాక మార్చేశారు. "రాములో రాముల" పాట మొదటి నాలుగు లైన్స్ రాసాక compose చేశారు. "OMG డాడీ" పాట లో "మేరా నామ్ బంటు కానీ పేరుకి కొట్టానే into" అనే వాక్యం మొదటిగా రాసారు. "అల వైకుంఠపురములో" తోడి రాగం లో compose చేశారు థమన్.

ఈ ఇంటర్వ్యూ లో గుర్తుంచుకోవాల్సిన కొన్ని వాక్యాలు: పాటని జనం లోకి తీస్కుని వెళ్లే వెహికల్ సాహిత్యం. ఒక జ్ఞాపకం మనలో బలంగా ఉండాలి అంటే, మనం జీవితాంతం దాంతో ప్రయాణించకర్లేదు, ఒక జీవితాంతం గుర్తున్న చాలు "ఆసక్తి అందరికి ఉంటుంది, ఆ శక్తి కొందరికే ఉంటుంది" Society ఇప్పుడేదైతే మర్చిపోతోందో దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత కవిది ఎలా ఆలోచించాలో తెలిస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. అస్పష్టంగా చెప్పటమే కవి తాలూకు అందం. అర్ధం అయ్యేలానే కాదు, అర్ధం చేసుకునేలా అర్థం వెతుకునేలా కూడా రాయచ్చు. ప్రతి కవి కి సమస్య ఏంటంటే, అవతలి వాళ్ళ కళ్ళలోనే ప్రశంస వెతుకుతాం. ఈ process లో మనల్ని మనం కోల్పోతాం. అలా కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిది కూడా. పాతది అయినంత మాత్రాన గొప్పది కాదు. నెలని ఆ నేల నేర్పిన పదాలని నమ్ముకున్నవాడు. అక్కడినుండే ప్రపంచాన్ని ఏలుతాడు. కవి రాయగలడు. కానీ రాయమని అడిగే కృష్ణ దేవరాయలు కూడా ఉండాలి. రెండో క్లాస్ పాస్ అవ్వడమంటే, మూడో క్లాస్ వెళ్ళడానికి, అక్కడే ఆగిపొమ్మని కాదు. ఆడపిల్లని అందంగా ఉందని ప్రశంసించేలా చూడటం ఎంత అవసరమో, ఆ కోరిక కనపడకుండా ఆపడం అంతే అవసరం. ఆ రెండిటికి మధ్య ఉన్నది చిన్న గీతే Teasing song ఎలా రాయాలంటే, tease చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి మన వైపు కొర కొర చూస్తూ, వెనక్కి తిరిగి కిల కిల నవ్వుకోవాలి.

ఇది కేవలం, 2 గంటల ఇంటర్వ్యూ కాదు, ఒక మంచి feel ఇచ్చే discussion. Future writers చూసి note చేసుకోవాల్సిన seminar.