"ప్రపంచ దేశాల లక్ష్యాలేవైనా సమస్యలు మన ఊళ్ళల్లోవే.. సమస్యలు మన ఇంటి నుండే పరిష్కారమవ్వాలి" - అఖిలేష్. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి నిరూపయోగం కాదు. ప్రతి ఒక్క మనిషి ఒక లక్ష్యంతో పుట్టినవాడు, ప్రతి మనిషి అవసరం ఈ ప్రపంచానికి ఉంది. నా లక్ష్యం ఏ విధంగా ఉండాలి, నా అవసరం ఈ విశ్వమానవాలికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నవాడే తన జీవితాన్ని వ్యర్ధం కానివ్వడు. సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి.. జన్మతహా వచ్చిన లక్షణాలను చాలా చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. తనలోని ప్రేమ విస్తృతమైనది.. అది తనకో, తన కుటుంబానికో మాత్రమే ఉపయోగించడం లేదు.. ఈ విశ్వం నాది, ఈ ప్రజలందరూ నా వాళ్ళు అని వారి కోసమే ఎదుగుతూ, ఎదగనిస్తూ పాత మనుషులతోనే కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు.. తన సంకల్పానికి మెచ్చి ఈ ప్రపంచమిచ్చిన అవకాశం ద్వారా ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగం ద్వారా భావాలను విశ్వవ్యాప్తం చేశాడు.
"మనకు ప్రపంచాన్నే మార్చే శక్తి ఉంది, అది మనం మారడం ద్వారానే సులభమవుతుంది" లక్షల జీవితాన్ని లక్ష్యం కోసం వదులుకుని: మొదటి నుండి అఖిలేష్ సాటి మనుషుల జీవితాన్ని వేరుగా చూస్తాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వాలను నిందించి ఊరుకోకుండా Infrastructure ను అందించాడు. ప్రభుత్వ పథకాలు తన చుట్టూ ఉన్న సామాన్యులకు అందేలా ఒక సామాన్యుడిగా బాధ్యతను నెరవేర్చాడు, ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో కనీసం 100 మొక్కలైనా నాటాలని, నాటుతూ, నాటుతూ ప్రత్యక్ష ఉదాహారణగా నిలుస్తున్నాడు. చాలామంది వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ సమాజానికి సేవచేస్తుంటారు, అఖిలేష్ మాత్రం అమెరికాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని, మేధస్సును అభివృద్ధి వివక్షతకు గురైన వారి పక్షాన ఉంటూ వారికి అండగా నిలుస్తున్నాడు.
"స్త్రీని తల్లిలా, చెల్లిలా గౌరవించడం చాల గొప్ప విషయం. కాని ఎక్కడో స్త్రీ ని, స్త్రీ గా గౌరవించలేకపొతున్నాము అని బాధ. వ్యక్తిని వ్యక్తిలా గౌరవిస్తే, స్త్రీ పురుషుల సమానత్వం సాదించినట్టే!" Outstanding Youth Delegate Award: అమెరికాలో డేటా అనలిస్ట్ గా పనిచేయడం వల్ల ఎంత వివిధ దేశాల స్థితిగతులు, స్థానిక సమస్యలు, వారి వ్యక్తిత్వాలు, పేదరికం మొదలైన విషయాలకు సంబందించిన Statistics పూర్తిగా తెలిశాయి. అమెరికా అంటే ప్రపంచ వివిధ దేశాలకు చెందిన మనుషులు ఎంతో మంది వస్తుంటారు. అఖిలేష్ సంకల్పానికి కు ఇవన్నీ అదనపు బలాన్ని చేకూర్చాయి. దాదాపు 100 కు పైగా దేశాలకు చెందినవారిని నేరుగా కలుసుకోవడం ద్వారా మన దేశానికి వారి దేశానికి స్పష్టమైన తేడా తెలిసింది. ఆ విలువైన అనుభవంతో మన దేశానికి వచ్చి 100 రోజుల్లో 100 పాఠశాలలోని విద్యార్థులను కలిసి వేలాది విద్యార్థులను, ఉపాధ్యాయులను మోటివేట్ చేశారు. 100 మందిని కలిస్తే 100 మందిని మార్చాడు అని చెప్పలేం కాని 100 మందిని ప్రభావితం చెయ్యగలిగాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ తర్వాత చేసిన గోల్స్ ఆన్ వీల్స్(పూర్తి వివరాలకు కింది ఆర్టికల్ లో చూడవచ్చు) ప్రోగ్రామ్ ద్వారా చేసిన మార్పు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చింది. 80 సంవత్సరాల Simona-Mirela Miculescu అనే Representative of the UN Secretary-General and Head of the UN Office in Belgrade నుండి "outstanding youth delegate" అవార్డ్ అందుకున్నాడు.
త్వరలో అమెరికా, న్యూజిలాండ్, మలేషియా, నైజీరియా తదితర దేశాల యువతతో కలిసి ఒక టీమ్ ను ప్రారంభించబోతున్నాడు. దాదాపు 7.8 బిలియన్ ప్రపంచ జనాబా ఉన్న ప్రస్తుత తరుణంలో 1.8బిలియన్ యువత మన దేశంలో ఉన్నారు. మానవమనుగడ మొదలైన దగ్గరి నుండి ఈ స్థాయిలో ఎపుడు లేదు. యువతే మన ఆస్థి, మన దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చే అద్భుతమైన శక్తి మనకే ఎక్కువ. యువత శక్తి నిర్వీర్యం కాకుండా 26 సంవత్సరాల అఖిలేష్ సాగిస్తున్న ప్రయాణం మార్గదర్శకమైనది.