This Telugu NRI Visits 1 School A Day & Teaches Kids What The Teachers Couldn't

Updated on
This Telugu NRI Visits 1 School A Day & Teaches Kids What The Teachers Couldn't

సాధారణంగా అమెరికాకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వెళ్ళిన ఓ 25కూడా నిండని యువకుడు సెలవుల కోసం ఇండియాకు వస్తే ఏం చేస్తారండి.? ఇదే మంచి టైం రా మన తెలుగింటి భోజనం మిస్ ఐయ్యిందని చెప్పి రెస్టారెంట్లకు వెళ్ళడమో, బంధువులు స్నేహితులను కలుసుకుని గిఫ్ట్స్ ఇవ్వడమో చేస్తుంటారు, లేదంటే టూర్ వేస్తుంటారు.. ఇదే కదా మనం దాదాపుగా చూసేది. ఇలా అందరిలా అఖిలేష్ కూడా చేసేదుంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళమా..

"నిజానికి నేను అమెరికాకు వెళ్ళింది కూడా అక్కడి పరిస్థితులను పరిశీలించి మన దేశానికి ఉపయోగపడేలా ఏవిధంగా ప్రణాళికలు చేయచ్చు అనే దానికోసమే"

100రోజులు 100 పాఠశాలలు: అఖిలేష్ అమెరికాలో ఎం.స్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల కోసం ఇండియాకు వచ్చే నెలరోజుల ముందునుండే ఓ అద్భుతమైన ప్రణాళిలను రచించాడు అదే 100రోజులలో 100 పాఠశాలలకు వెళ్ళి విద్యార్ధులలో మరింత స్పూర్తి నింపాలని.. "దేవుడిని నవ్వించాలంటే మనం వేసుకున్న ప్రణాళికలను చెప్పుచాలు అని ఓ మహాకవి అన్నారు." అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. "విద్యార్ధులలో స్పూర్తి నింపడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి అంటే చాలా పాఠశాలల యాజమాన్యం వారు ఇవ్వము అని సున్నితంగా తిరస్కరించేవారు.. కాని అఖిలేష్ లోని ధృడ సంకల్పం ఈ ఆటంకాలకు అస్సలు బెదరలేదు 100రోజులు 100పాఠశాలలు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి దగ్విజయంగా 32పాఠశాలలను కలిశారు ఇందుకోసం అతను ఎన్ని స్కూల్స్ ను కలిశారో తెలుసా 60 స్కూల్స్..

"నా దారిలో నాకు నేను తప్ప ఇంకేవ్వరు అడ్డురారు."

ఎలా స్పూర్తి నింపుతాడు.? ప్రపంచంలో ఎవ్వరికి లేని గొప్ప ఆస్థి మన దగ్గర ఉంది అది కోహినూర్ కన్నా విలువైనది, లక్షల టన్నుల బంగారం కన్నా గొప్పది అదే మన యువశక్తి. ఏ దేశంలోలేని ఇంతటి గొప్ప సంపద కేవలం మన దేశంలోనే ఉంది. ప్రతి ఒక్క యువకుడు తలుచుకుంటే కేవలం కొన్ని సంవత్సరాలలోనే మన దేశం అన్ని దేశాల కన్నా గొప్ప స్థితిలో ఉంటుంది మీ శక్తిని మీరు గుర్తించండి దానిని మీకోసం, మనదేశం కోసం ఉపయోగించండి అనే మాటలతో పాటు సమజానికి మనవంతుగా ఎలాంటి హాని కలుగకూడదని స్టాటిస్టిక్స్ తో సహా వారిలో అవగాహన నింపుతారు.

"మొదట్లో కేవలం నా ఆశయం గెలవాలని మొదలుపెట్టిన నేను అందరూ చూపించే ప్రేమ, ఇచ్చే ధైర్యంతో నాపై ఉన్న వారి ఆశలను కూడా గెలిపించాలాని మొండిగా ముందుకు వెళ్ళిపోతున్నా."

ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరగడానికి 700సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ ను పూర్తిగా మానివేయాలి, ప్రతి వ్యక్తి జీవితంలో కనీసం 100 చెట్లైనా నాటి వాటిని రక్షించాలి అని వారికి ప్రకృతిని కాపాడడంలో బాధ్యతను గుర్తుచేస్తారు. స్వతంత్ర పోరాటంలో సమరయోధులు ఏవిధంగా స్వతంత్రం కోసం పోరాడారో ఇప్పుడు మన దేశం కోసం అదే విధంగా పోరాటం చేయాలని ఒక్కో విద్యార్ధికి గుండెలోతులలోకి చేరేలా ప్రసంగిస్తారు ఇవ్వి మాత్రమే కాదు లీడర్ షిప్ క్వాలిటీస్ మొదలైన పర్సనాలటీ డెవలెప్మెంట్ గురించి వివరిస్తుంటారు..

"మార్పు మనలో మొదలవుతుంది అని నమ్మే నేను, ఆ మార్పు నేనే ఎందుకు కాకూడదు అని బయలుదేరాను."

ఐక్యరాజ్య సమితిలో కూడా: అఖిలేష్ కు చిన్నతనం నుండి సమాజ సేవ తన బాధ్యత కాదు కర్తవ్యంగా భావించాడు దేశాన్ని ఉన్నతంగా చూడడమే తన జీవిత లక్ష్యంగా భావించాడు.. ఇప్పుడు మనం 100రోజులు 100పాఠశాలలు అని చెబుతున్నాం కాని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి తన సేవా ఉద్యమం మొదలుపెట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో సౌకర్యాలు కల్పించడం, విద్యార్ధులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించడం, ఆర్ధిక సహాయం చేయడం లాంటివి చేస్తుండేవాడు. ఇంతటి చిన్న వయసులో ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను ఐక్యరాజ్య సమితి వారు వివిధ దేశాల తరుపున గొప్ప వ్యక్తులను ఆహ్వానించి సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ సంవత్సరంలో భారతదేశం తరుపున అఖిలేష్ స్వామివివేకందుని వేశంలో అద్భుతంగా ప్రసంగించి తన విలువైన సూచనలు అందించారు..

'నేను' అఖిలేష్ తో మాట్లాడుతుండగా నాకో అనుమానం తలెత్తి ఓ ప్రశ్న అడిగాను. మీరే ఎందుకు స్కూల్స్ కు వెళ్ళి చెప్పాలనుకున్నారు అక్కడ ఎలాగూ టీచర్స్ ఉన్నారు కదా.? అంటే "మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకుంటారు, నా ఇంటిని నేను శుభ్రంగా ఉంచుకుంటాను మనకెవ్వరూ శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పాల్సిన అవసరం లేదు కాని ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎందుకు చేస్తున్నట్టు.? ఇలాంటి సమస్యే మన పాఠశాలలోను ఉంది అందుకే నా ఈ ఉద్యమం" అని అఖిలేష్ నాకు బదులిచ్చాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అఖిలేష్ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి..

అఖిలేష్ గారి ప్రయాణం గురించి ఆయన మాటల్లో...