న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అందులో వ్యవసాయానికి సంబంధించిన వార్తలలో 80% బాధాకరమైన వార్తలు.. "రైతు ఆత్మహత్య చేసుకున్నాడనో, గిట్టుబాటు ధర లేక ధర్నాలు అనో, కరువు, అకాల వర్షాలు మొదలైన వార్తలే ఉంటాయి. నిజానికి రైతుల జీవితాలలో కొంత వరకు బాధలున్నాయి కానీ రైతు జీవితమంత కష్టాలు ఉండవు. చాలామంది పైకి అలా కనిపించరు కానీ రైతు తన పనిని అత్యంత ప్రేమిస్తాడు.. "మేము రైతులం, ఇది మా పొలం, మేము రైతుగా జన్మనెత్తినందుకు గర్వపడుతున్నాం" అని తమని, తమ పొలాన్ని ప్రపంచానికి చూపించడానికి క్రియేట్ చేసిన కార్యక్రమమే ఈ "Agriculture Photography Challenge". ఈ ఛాలెంజ్ ని మొదలుపెట్టింది నరసింహా రెడ్డి. నరసింహాది కరీంనగర్ జిల్లాలోని ధర్మారం అనే చిన్న గ్రామం. అమ్మ నాన్నలు వ్యవసాయం చేసేవారు. ఒక్కోసారి నరసింహా కు విపరీతమైన భయం కలిగేది.. "తన చుట్టూ ఉన్న రైతుల పిల్లలందరూ వ్యవసాయానికి దూరంగా వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా వారిలా వ్యవసాయం చేయకూడదని కోరుకుంటుంటే ఇక భవిషత్ లో వ్యవసాయం ఎవరు చేస్తారు.? రైతు అనేవాడే లేకుంటే మానవ మనుగడ ఎలా సాధ్యం.?" ఇలాంటి ఆలోచనాలతోనే నరసింహా B.S.C Computer Science చదివి మన హైదరాబాద్ లో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు. ప్రశాంతత లేదు అంతా గందరగోళం!! వెంటనే జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి, అన్నం పెడుతున్న నేల తల్లి ఒడిలోకి చేరుకున్నాడు. ఉన్న పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఇక అంత తెలిసిన కథే.
సాఫ్ట్ వేర్, క్రియేటివ్ ఫీల్డ్, మొదలైన ఫీల్డ్ లో ఉన్నవారు సోషల్ మీడియాలో ఫోటోలు అప్ లోడ్ చేస్తుంటారు. అన్ని బంధాలలోకి జన్మనిచ్చిన కన్నతల్లి బంధం గొప్పదైనట్టుగా అన్ని పనులలోకి వ్యవసాయం గొప్పదని నరసింహా తన పొలం ఫోటోలను అప్ లోడ్ చెయ్యడం మొదలుపెట్టారు. కేవలం రెండు నెలల ముందు ప్రారంభమైన #AgriculturePhotographyChallenge లో మన తెలుగు రైతులతో పాటు, వివిధ రాష్ట్రాల వారు, ఫారెన్ కంట్రీ వాళ్ళు కూడా తమ పొలాన్ని చూపిస్తూ రైతుగా గర్వపడుతున్నారు. రైతు జీవితం అందమైనది. వీరికి డబ్బులు ఎక్కువ రాకపోవచ్చు, బ్రతకడానికి మాత్రం వస్తాయి. తాజా కూరగాయలు, పాలు పాకెట్ లో కాకుండా చెంబులో నుండి వస్తాయి. మాట ప్రారంభమయ్యేది సార్ మేడమ్ తో కాదు బంధుత్వాలతో.. రైతు పంట పండించడం వల్ల రైతుల కన్నా మిగిలిన వారికే ఎక్కువ ఉపయోగం. టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్తున్నామన్నా భవిషత్ అంతా రైతులదే. Agriculture Photography Challenge లోని కొన్ని అద్భుతమైన అద్భుతాలు.
You can contact him on mail, here: abcreative@yahoo.com