This Man & His Friends Are Helping The Underprivileged Kids Through A Foundation & Here's Their Story

Updated on
This Man & His Friends Are Helping The Underprivileged Kids Through A Foundation & Here's Their Story

అన్నదానం చేస్తే ఒక్కపూట కడుపునిండుతుంది అదే విద్యాదానం చేస్తే కనుక ఒక్కరు బ్రతకడమే కాక ఒక కుటుంబం, గొప్ప వ్యక్తి ఐతే యావత్ దేశాన్నే మర్చివేయగలరు. తల్లిదండ్రులకు ఏ విధమైన ఆస్తులు లేకపోయినా ఎన్నో త్యాగాలు చేసి వారి పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. పేరెంట్స్ ఉన్న పిల్లలు ఐతే ఎలాగోలా చదివిస్తున్నారు. అదే పేరెంట్స్ లేని పిల్లల పరిస్థితి ఏంటి.? ఇవ్వాల్టి లక్షల విలువ చేసే ఫీజులు కట్టాలంటే సామాన్యులు తట్టుకోగలరా.? ఇవన్నీ బాధలు చూసే ఆకాంక్ష పుట్టింది. 2011 నుండి నేటి వరకు ఆకాంక్ష ద్వారా ఎల్.కే.జీ దగ్గరి నుండి పీజీ ఎంబీబీఎస్, బిడిఎస్ డాక్టర్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, అది కూడా private స్కూల్స్, కాలేజీలలో మాత్రమే..

అందరూ కలిసి చేయి చేసుకున్నారు: వంశీ గారిది కర్నూలు జిల్లా తిమ్మనాయన పేట ప్రాంతం. కొన్ని సంవత్సరాల క్రితం RTA కింద తమ ఊరికి రోడ్ల నిర్మాణం, స్కూల్ బాగోగుల కోసం మరియు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెడుతుంది లాంటి లెక్కల కోసం అర్జీ పెట్టుకునేవారు. ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ కు ఊరిలో జరిగే అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేకపోవడం మెల్లిమెల్లిగా జనాలకు వంశీ ద్వారా తెలుస్తుందని కొందరు లోకల్ నాయకులు వంశీ గారిపై చేయి చేసుకోవడం జరిగింది. నిజంగా ప్రజలు చదువుకుంటే RTA పై అవగాహన, వారు కోల్పోతున్న జీవితం తెలుసుకునే అవకాశం ఉండేది కదా అనే ఆలోచన వంశీగారిలో కలిగింది. కొంతకాలం తర్వాత ఉద్యోగం చేస్తున్న కాలంలో మిత్రులు రాజేష్, అనిత, మాధవి, పార్వతి, నూర్ అహ్మద్, వినయ్, సౌజన్య లతో కలిసి ఇదే విషయం మాట్లాడేవారు. వారందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండడం వల్ల 2011 నుండి ఆకాంక్ష చదివించడం మొదలుపెట్టింది.

ఆకాంక్ష ఎలా పనిచేస్తుంది.? మీకు చదువుకోవాలని ఉంది కాని ఫీజు చెల్లించేంతటి తాహత లేదు, ఆకాంక్షకు ఈ విషయం చెబితే కనుక మీ చదువు బాధ్యతను వారు చూసుకుంటారు. చాలా సందర్భాలలో ఐతే కేవలం న్యూస్ పేపర్, టీవీ ఛానెల్ లో చదువు కోసం ఇబ్బందులు పడే వార్తలు చూసి విద్యార్థులకు అండగానిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామందికి హామీ ఇస్తే కనుక మిగిలిన వారికి పరిపూర్ణంగా సహాయం చేయలేము, చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి 100% సహాయం చెయ్యాలి అనే పద్దతితో ప్రస్తుతం సెలెక్టెడ్ స్టూడెంట్స్ కు మాత్రమే చేస్తున్నారు. స్టూడెంట్ నిజంగానే నిరుపేద వారా.? పేరెంట్స్ కు చదివించడం ఇష్టంగానే ఉందా..? మొదలైన విషయాలు తెలుసుకున్న తర్వాత దగ్గరిలోని స్కూల్ లేదా కాలేజీలో చేర్పిస్తారు. మెరుగైన విద్యకోసం ఆకాంక్ష తన పిల్లలను ప్రయివేట్ విద్యాసంస్థలలో మాత్రమే చదివిస్తుంది.

నర్సరీ నుండి ఎంబీబీఎస్ డాక్టర్ వరకు: ప్రొద్దుటూరు కు చెందిన సీత గారికి ఇద్దరు పిల్లలు, భర్త చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్లిపోయారు, అక్కడ కొంతకాలం గడుపుతూ ఉండగా ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉన్న సీత అమ్మ గారు చనిపోయారు, ఇద్దరి పిల్లల చదువు, పోషణ చాలా ఇబ్బందిగా ఉందనే కథనాన్ని మీడియాలో తెలుసుకుని ఆకాంక్ష ఆ ఇద్దరి పిల్లల బాధ్యత తీసుకుంది. ఇది మరొక సంఘటన.. శారద చిన్నతనం నుండి చదువులో ముందు వరుసలో ఉండేవారు. ఎంబీబీఎస్ లో సీట్ కూడా తెచ్చుకున్నారు, కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు కూడా. చదువు కొనసాగుతున్న కొద్దీ ఆ ఫీజులను భరించడం వారి కుటుంబానికి కష్టంగా మారింది. శారద గారి పరిస్థితి న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకుని అక్కడికి చేరుకుని వారికి సహాయం చేశారు, శారద గారు ప్రస్తుతం డాక్టర్. ప్రతినెల తనలా సహాయం కోసం ఎదురుచూసే పిల్లలను ఆకాంక్ష ద్వారా చదివిస్తున్నారు. ఇలానే అవిషేక్ గారు కూడా BDS పూర్తిచేసి ప్రతినెల కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు, ఎన్నో జీవితాలను మర్చివేయగలిగింది.

For Further details: Facebook: Click here