ఎప్పుడో డిలీట్ చేసిన కాంటాక్ట్ ఇప్పటికీ గుర్తున్న నెంబర్ ఎప్పటికీ మర్చిపోలేని మనిషి
నిధి - హలో ……. గౌతమ్ - హా,హలో………….. నిధి - ఎలా ఉన్నావ్?? గౌతమ్ - ఎదో ఉన్నాను, నువ్వెలా ఉన్నావ్ ?? నిధి - పర్లేదు ,బానే ఉన్నాను . గౌతమ్ - అయినా ఏంటి ఈ sudden shock ?? నిధి - షాక్ ఆహ్,నేను suprise అనుకున్నాను గౌతమ్ - ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని తెలిసి ఎప్పుడు జరుగుతుందో తెలీని దాన్ని సప్రైజ్ అంటాం.అసలు ఊహించనిది జరిగితే దాన్ని షాక్ అనే కదా అనాలి నిధి - అబ్బో ,మాటలు బానే నేర్చావ్ గౌతమ్ - అచ్చుతప్పు,మాటలు బానే నేర్పావ్ అనాలి గౌతమ్ - అయినా , ఇన్నాళ్లూ గుర్తున్నానా,ఇన్నేళ్లకి గుర్తొచ్చానా. మర్చిపోయుంటావ్ అనుకున్నా నిధి - మర్చిపోయాను అని నువ్ అనుకుంటున్నావు,కానీ ఎదురుచూస్తూ ఉన్నాను అని నేనంటున్నాను గౌతమ్ - నాకు తెలుసు ,నేను కనపడకపోతే గుర్తుండను,కనిపించినా గుర్తుపట్టవు నిధి - మన అనుకున్నవాళ్ళని ఎంత మందిలో ఉన్నా గుర్తుపడతాం,మనసులో ఉన్న వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం గౌతమ్ - generalise చేసే చెప్తున్నావా ? నిధి - లేదు particular గా నీ గురించే చెప్తున్నా గౌతమ్ - ఔనా,నా దగ్గర మాత్రం నీ గుర్తులు,జ్ఞాపకాలు ఇవే ఉన్నాయి, నిధి - మనుషులే ఉన్నపుడు జ్ఞాపకాలు ఎందుకో ? గౌతమ్ - మనుషులు వస్తుంటారు పోతుంటారు, జ్ఞాపకాలు ఎప్పటికి పదిలంగా ఉంటాయి . ….ఎదో చెప్పాలి అన్నావ్ ఏంటది ??? నిధి - నేనేమి అనలేదే........ …నేను ఎం చెప్పాలి అనుకున్నావ్ గౌతమ్ - నువ్వు ఎం చెప్పాలి అనుకున్నావో అదే చెప్తావ్ అనుకున్నా నిధి - అదేదో నువ్వే చెప్పేయొచ్చుగా గౌతమ్ - నేను ఎప్పుడో చెప్పాను ,ఎన్నో సార్లు చెప్పాను నిధి - మరి అప్పుడు నేనేమన్నాను??? గౌతమ్ - నీనుండి సమాధానం కోసం ఎదురుచూడడానికి నేనేమి ప్రశ్న వేయలేదు.. నిధి – సరే విను …..అప్పుడు ఏమని చెప్పాలో అర్ధం అవలేదు ,ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ కచ్చితంగా చెపుతాను గౌతమ్ - సరే చెప్పు నిధి - మన మధ్య ఇన్నేళ్ల దూరం,నువ్వు నాకు ఏంటో తెలిసేలా చేసింది నీ గురించి ఊహలతో ప్రతిరోజు ముగుస్తుంది, నీ ఊసులతో నా రోజు మొదలవుతుంది నా మౌనం లో నీ మాటలే,నా నిశ్శబ్దం అంతా నీ శబ్దమే నా ఆలోచనలన్నీ నీ గురించే,మూడేళ్ళ దూరం రా…..నువ్వు లేకపోయేసరికి ప్రతీ రోజు ఒకేలా ఉంది,ఒక్కోరోజు నరకం లా మారింది. నిన్ను భాద పెట్టినందుకు నాకు నేను వేసుకున్న శిక్ష కావొచ్చు,నిన్ను చేరడానికి దేవుడు పెట్టిన పరీక్ష కావొచ్చు ఈ మూడేళ్లు .. నా ఊపిరి నువ్వే నా ఉరి నువ్వే నిన్నోసారి కలవాలి.నువ్వు నాకు కావాలి అని చెప్పాలి నన్ను ఏడిపించడానికి,నవ్వించడానికి,గొడవపడడానికి ….నన్ను మళ్ళీ నాలా మార్చడానికి నువ్వు కావాలి నిన్ను గెలవాలి,నీ ప్రేమలో ఓడిపోవాలి నువ్వు నేను మనం అవ్వాలి గౌతమ్ - ఇప్పటికైనా అర్ధం అయ్యింది నీకు నిధి - అర్ధం అయ్యేసరికి ఇంత అయ్యింది గౌతమ్ - ఇంకా చెప్పు,ఇలా వింటుంటే చాలా బాగుంది,చెప్పు….. నిధి - అమ్మాయిని రా అన్నీ చెప్పలేను .....ఆరోజు నేనలా నీమీద కోపంగా మాట్లాడి ఉండకూడదు,ఎక్కడ నీ మీద ఇష్టం పెరిగిపోతుందో అన్న భయంతో అలా అరిచేసా గౌతమ్ - నన్ను అనగలిగే హక్కు నీకు మాత్రమే ఉంది,నువ్వేమన్నా భరించే ప్రేమ నాకుంది నిధి - ఈ ప్రేమే మళ్ళీ నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది ...... మళ్ళీ నీతో ప్రేమలో పడేసింది
Call Disconnected – They both Re-connected – And they lived Together Forever