This Guy's Anguish About How Mankind Is Destroying Mother Earth Is Worth Reading!

Updated on
This Guy's Anguish About How Mankind Is Destroying Mother Earth Is Worth Reading!

వచ్చే జన్మంటూ ఉంటె, Bill gates మనవాడిగానో, Ambani అల్లుడిగానో పుట్టాలని ఎన్నిసార్లు అనుకుని చస్తానో నేనైతే. అదొక ఎర్రి. అంటే పునర్జన్మ గురించి మన మతాలన్నీ చెప్తున్నాయిగా. చచ్చి మళ్ళీ పుడతామని. కానీ నాకది practical అన్పిస్తలేదు. "హా..ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మవు కాబట్టి" అనండి ఇంకెందుకు లేటు. ఇక్కడ అది కాదు point. నా నమ్మకం తో దీనికి ఏ సంబంధం లేదు.

పునర్జన్మ ఎందుకు practical అన్పించట్లేదంటే, మనం భూమిని పీల్చి పిప్పి చేస్తున్నాం. అందుకని. “దానికి దీనికి ఏం సంబంధం రా బాబురావు?” అని కూడా అనేసేయండి. అనేసేయండి...టపామని. అనేశారా? ఓకే ఓకే. ఇప్పుడు చెప్తా. నా point ఏంటంటే . మనం చచ్చి మళ్ళీ పుట్టేలోపే, భూమి పూర్తిగా చచ్చిపోతోందని. భూమి చచ్చిపోవటమంటే, మనం చచ్చిపోవటమే, మళ్ళీ పుట్టలేకపోవటమే. సముద్రాలు ఆమ్ల భరితమవుతున్నాయి (acidification of oceans). మంచు కొండలు కరిగిపోతున్నాయి (Melting polar ice caps). వైవిద్యభరితమైన జీవజాలమంతా అంతరించిపోతోంది ( Extinction of Species). వేసవులు ప్రతి సంవత్సరం మరింత వేడిగా తయారవుతున్నాయి.వర్షాలు పడితే అతి, లేకపోతె అసలే లేదు. కాళ్ళకింద భూమిని చూడటం మానేసి నెత్తి మీది సీలింగ్ ఫ్యాన్లను దీనంగా చూస్తున్నారు.

ఇదంతా మనవాళ్లే జరుగుతుంది భయ్యా. ఏడ పడితే ఆడ ఒకటే పెట్రోల్ డీజిల్ బండ్లు తిప్పింది తిప్పింది నీయంకమ్మ. అవి గాలిని పెంట పెంట చేస్తున్నాయ్. ఇంక ఫ్యాక్టరీల సంగతి ఒద్దులే. చెప్పుకోవటం కూడా బేకార్..ఇంకోటి, మనం ముక్క తినటం వల్ల..అదే, శికెను, మాటను,..ఇంక చాలా మరీ ఎక్కువగా తినటం వల్ల కూడా. నన్ను కొట్టేంత కోపమొస్తుంది కదా ముక్క గురించి చెప్పేసరికి. కోపమొచ్చినా సరే, అదే నిజం భయ్యా. ఎందుకు చెప్పాల్నా?... నువ్వు తినే చికెన్ ముక్క, మటన్ ముక్క కోసం పెంచే జంతువులున్నాయి చూడు... అవి బైటికి వదిలే మీథేన్ (Methane) అనే గాలి, భూమిని గలీజ్ గ వేడెక్కిస్తుంది కాబట్టి.అదీకాక .నువ్వు ప్రతి రోజు తింటున్నావ్ కాబట్టి, నిన్ను కుష్ చేయనీకి జనాలు ఎక్కువెక్కువ ఈ జంతువుల్ని పెంచేస్తున్నారు. మళ్ళా వాటిని మేపాల కదా? అందుకోసం అడవుల్ని నరికేసి భూమి చదును చేస్తున్నారు. అట్లా అన్నమాట connection. ఇట్లా చాలా పెద్ద list ఉంది. ఇంతకంటే చెప్తే నువ్వు సదవవు. నాకు తెల్సు. ఒకవేళ నిజంగా interest ఉంటె నీకు ఇంటర్నెట్ ఉండనే ఉందిగా. గూగుల్ తల్లి కి దండం పెట్టి అడుగు. చెప్తది. జ్ఞానదేవత.

భూమి చచ్చిపోతోంది బ్రదరూ. By mistake పునర్జన్మ నిజమనుకో. కానీ అది ఎప్పుడు workout అవుతదో తెల్సా? భూమి బతికున్నప్పుడు. ఎందుకంటే, మనిషి ఎన్ని లోకాలను జల్లెడేసి వెతుకుతున్నా సరే, ఎక్కడా ఆక్సీజను, నీళ్లు దొర్కటంలేదు. అంటే అస్సలు దొరకదా అని కాదు. దొరకచ్చు. కానీ అంతవరకూ భూమి బతికుండాలిగా. మనం ఈ క్షణం బతికుండగలిగితేనే గా వచ్చే నిముషం గురించి ఆలోచించగలిగేది. తల్లి కడుపు సల్లగుంటేనే గా.. నువ్వు పుట్టేది. భూమి కూడా తల్లి కడుపు లెక్కనేగా. కాబట్టి, just దేవుని పటానికి హారతి ఇచ్చి ఊరుకోకు. car బైటికి తీయటం తగ్గించు. bus ఎక్కు(లేకపోతె కనీసం share cab, car pool). Room లో నుండి బైటికొచ్చే ముందు లైట్, ఫ్యాన్ బంద్ చేయి. Laptop shut down చెయ్. కరెంటు ఆదా అవుతది, కాబట్టి బొగ్గు తక్కువ కాల్తది, so పొగ తక్కువ ఒస్తది. ప్రతీ రోజు ‘ముక్క లేనిదే ముద్ద దిగదు’ లాంటి సొల్లు మాటలు మాని, శాకాహారం అలవాటు చేసుకో. పన్నీర్ తిను మామ మస్త్ ఉంటది. ( సరే పోనీ సవదొబ్బకు.) నిన్ను పూర్తిగా ఎవడూ మానమనట్లే, అది నీతో కాదని అందరికి

తెల్సు.త్యాగమేం చేయమనట్లే నిన్నెవడు. జస్ట్ కొంచెం compromise కమ్మంటున్న అంతే. ఆ సైంటిస్టులకు ఇంకొంచెం టైం ఇద్దాం. ఆ time ఇస్తే వాళ్ళు మనల్ని ఏ గ్రహమో ఉపగ్రహమో తీసుకెళ్తారు పాపం.. “అరేయ్ నువ్వు వేదాంతం ఆపరా.. నేనొక్కడ్ని చేయకపోతే ఫరక్ పడ్తదా?” అని కూడా అను ఒకసారి తమాషాగా. ఫరక్ పడ్తది భయ్యా. తప్పకుండా పడ్తది. అది నీకు కూడా లోపల తెల్సు. అన్పించలేదనుకో.. Business man సినిమా లో సూర్యభాయ్ చెప్పినట్టు నీవల్ల ఎవడికి ఉపయోగం లేదు వెళ్లి చావు. నీకు పునర్జన్మ లేదు,తొక్క లేదు. శపిస్తున్నానంతే.