అల.. వైకుంఠపురములో : A Deeper Meaning Into Title Song Of ‘Ala Vaikuntapuramu Lo’

 

త్రివిక్రమ్, అల్లుఅర్జున్ ముచ్చట గా మూడోసారి కలిసి చేస్తున్న సినిమా “అల.. వైకుంఠపురము లో” ఈ సినిమా పేరు rumour గా ఉన్నప్పటి నుండే మంచి attention ని తీసుకుంది. ఈ పేరు వెనుక ఒక మంచి కథే ఉంది.

 

తెలుగు కవులలో మహనీయులు అయినటువంటి బమ్మెర పోతన గారు “శ్రీమద్భాగవతం” ని రచించారు. అచ్చ తెలుగు పదాలతో ఈ పుస్తకం లో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని చదువుతుంటే..,ఎంతో అందమైన భావన కలుగుతుంది..

 

ఈ పుస్తకం లో “గజేంద్ర మోక్షం” అనే ఘట్టం ఉంది, స్వచ్ఛమైన మనస్సుతో నిజమైన ఆపద కలిగినప్పుడు పిలిస్తే దేవుడైన ఉన్నపలంగా అన్ని వదిలేసి వస్తాడు, అని చెప్పే సంఘటన ఇది.

 

పూర్వము మహాభక్తుడైన ఒక గంధర్వుడు శాపం వల్ల గజము గా జీవిస్తుంటాడు. ఒక కొలను దాహం తీర్చుకుంటూ ఉండగా ఒక మొసలి ఆ ఏనుగు కాలి ని పట్టుకుంటుంది. ఆ ఏనుగు, మొసలి చేరనుండి విడిపోవడానికి తన శక్తి మేరా చాలా ప్రయత్నిస్తుంది. ఇక చివరికి తనని రక్షించమని, శ్రీమహా విష్ణువుని ప్రార్ధిస్తుంది. ఇలా ఈ గజం ప్రార్ధిస్తుంటే, మరి ఆ మహా విష్ణువు ఎక్కడున్నాడయ్య? అంటే…

 

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.

 

పోతన గారి ప్రతి పద్యం లో చాలా మంచి వర్ణన ఉంటుంది. ఆయన screenplay చాలా బాగుంటుంది. దేవుడు వైకుంఠం లో ఉన్నాడు అని చెప్పకుండా, ఆయన ఉండే చోటుని ఎలా ఉందొ, ఆయన ఎలా ఉన్నారో అని వర్ణించే తీరు అద్భుతం.. ఈ పద్యం అందుకు చక్కని ఉదాహరణ.

 

భావం:
తన నివాసమైన “వైకుంఠ పురం” లో తన భార్య అగు శ్రీ దేవి తో ఉన్నాడు మాహా విష్ణువు. ఎందరో ఋషులు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు లాంటి వారు తన కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతిని గమనించాడు.
ఆ గజముని రక్షించడానికి బయలు దేరాడు.

 

ప్రతి పదార్ధం:
అల = అక్కడ
వైకుంఠ = వైకుంఠ మనెడి
పురంబు = పట్టణము
లోన్ = అందు
నగరి = రాజ భవన సముదాయము
లోన్ = అందు
ఆ = ఆ
మూల = ప్రధాన
సౌధంబు = మేడ {సౌధము – సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}
దాపల = దగ్గర
మందార = మందార పూల
వన = తోట
అంతర = లోపల
అమృత = అమృత జలపు
సరస్ = సరోవరము
ప్రాంత = సమీపమున గల
ఇందుకాంత = చంద్రకాంత శిల
ఉప = పైన
ఉత్పల = కలువల
పర్యంక = పాన్పుపై నున్న
రమా = లక్ష్మీదేవితో
వినోది = వినోదించు చున్న వాడు
అగున్ = అయిన
ఆపన్న = కష్టాలలో నున్న వారిని
ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు
విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము – భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}
నాగేంద్రము = గజేంద్రుడు
పాహి పాహి = కాపాడు కాపాడు
అనన్ = అను
కుయ్యాలించి = మొర ఆలించి
సంరంభి = వేగిరపడు తున్న వాడు
ఐ = అయ్యి.

 

గజముని రక్షించటానికి విష్ణువు బయలుదేరాడు బానే ఉంది, కానీ ఎలా బయలు దేరాడు.

 

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!

 

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా ఆమె కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న ఋషులు సైన్యం తో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. అతనిని తప్పుకుని ముందుకి వెళ్ళిపోతున్నాడు. జుట్టు కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. గజముని రక్షించి శాపవిమోచమ్ కలిగించి, మొసలికి కూడా మోక్షం కలిగిస్తాడు

 

Interesting Story behind, origin of this sloka:
“అల వైకుంఠ పురంబు లో” పద్యానికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది.ఇప్పుడు నేను చెప్పబోయే కథ కింద వీడియో లో 58minutes:43 seconds దగ్గర మొదలవుతుంది. పోతన గారు ఆ పద్యాన్ని దేవుడు ఉండే నివాసాన్ని వర్ణించాలని, మొదలు పెట్టారు. “అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల” వరకు వచ్చి తరువాత ఏం వర్ణించాలో తేలిక .. విశ్రాంతి కోసం బయటకి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఆ పద్యం పూర్తయ్యి ఉంది. ఎవరు రాసారని తన కూతురిని అడిగితే, “మీరే రాసారు కద నాన్న” అని చెప్పింది, అప్పుడర్ధమయ్యింది పోతన కి ఆ పద్యాన్ని రాసింది తను నమ్మే రాముడే అని.., ఆ తరువాత “సిరికిన్” పద్యాన్ని పోతన గారు కొనసాగించారు.


 

మనకు ఒక కష్టమొస్తుంది. ఆ కష్టాన్ని ఎదురుకోవడానికి మనం మన శక్తి మేర ప్రయత్నిస్తాం. కొన్ని సార్లు గెలుస్తాముకూడా. కానీ కొన్ని సార్లు ఒక తోడు, నీ బలంగా నిలిచే చేయూత కావలి. అప్పుడు మన తోడుగా ఒకడు ఉంటారు. అమ్మ, కావచ్చు, నాన్న కావచ్చు స్నేహితుడు కావచ్చు ఎవరైనా, అలా మన కష్టాన్ని గమనించి తాను ఎలాంటి వైభోగం లో ఉన్న అవ్వన్నీ వదిలేసి వచ్చే ఎవరైనా మనకు దేవుడే.. అలాంటి మనిషి ఉండే ఇల్లు పూరి గుడిసే అయినా “వైకుంఠపురమే”

 

చిన్నప్పుడు మా నానమ్మ ఈ పద్యం చదివి వివరించే ప్రతి సారి సినిమా లో ఒక elevation scene ని చూసే feeling కలిగేది. ఇప్పుడు ఆ పద్యం reference తో ఒక సినిమా రాబోతోంది అంటే అందులో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అంటే, yes ఆ ఊహ చాలా బాగుంది. ఈ పద్యం లానే సినిమా కూడా బాగుండాలి… మొత్తం “గజేంద్ర మోక్షాన్ని” చాలా సులువుగా అర్ధమయ్యేటట్టు “చాగంటి” గారు చెప్పారు. here is the video.Mana Epics lo unna screenplay and narration ela undedo ani oka reference ki “Gajendra Moksham” oka perfect book. Read it in telugu its worth your time.


 

అంత మంచి పద్యాన్ని, ప్రియా సిస్టర్స్ లాంటి అద్భుతమైన గాయనిమణుల చేత పాడించి మరింత మధురంగా మార్చారు థమన్.


 

ఈ పద్యానికి కొనసాగింపుగా, “అల వైకుంఠపురం” సినిమా కి theme song ని compose చేశారు. ఆ పాత సాహిత్యం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వినడానికి..

 

సాహిత్యం:
అల వైకుంఠపురములో, అడుగుమోపింది పాశమే,
విలాపం ఉన్న విడిదికే, కలాపం కదిలి వచ్చేనే 

అల వైకుంఠపురములో, బంటు గా చేరే బంధమే 
అలై పొంగేటి కళ్ళలో  కులాసా తీసుకొచ్చెనే 

గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే 
దిష్టి తీసింది దీవనై ఘన కూష్మాండమే

భుజము మార్చింది భువనమే బరువు మోయంగా బంధమే
స్వాగతించింది చిత్రమై రవి సింధురమే…

వైకుంఠపురములో ఆమూల నగరిలో 
వైకుంఠపురములో  సౌధంబు దాపల..
వైకుంఠపురములో   తారంగం చేరెనే 
వైకుంఠపురములో  తాండవమే ఆడెనే
  

 

భావం:
రెండు చేతులు వాటంతట అవి కలవవు అన్నప్పుడు, ఒక తాడు ని తెచ్చి ఆ రెండు చేతులని కట్టేయాలి. అలా మనుషులని వాళ్లలో ఉన్న బంధాలని కట్టి ఒక చోట చేర్చే పాశంగా (తాడుగా) ఒక పాదం అడుగుమోపింది.
విలాపం (బాధలు, కష్టాలు) ఉన్న ఆ ఇంటికి కలాపం(చంద్రుడు, ఆనందం) లా అతను వస్తున్నాడు.

ఆ వైకుంఠపురం లో ఒక బంధం ఆ బంధాల విలువ తెలిసిన వ్యక్తి బంటు గా చేరుతున్నాడు.
కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళలో కులాసా(ఆనందం, ప్రశాంతత) ని నింపడానికి వస్తున్నాడు.

ఒక పెద్ద ఆకాశం అతను ఒక మేఘమే కావచ్చు, కానీ అతనికి ఆ ఆకాశం గొడుగుపెట్టి (support chesthu) స్వాగతిస్తోంది..
కూష్మాండం (గుమ్మడికాయ) తో , గుమ్మడికాయతో దిష్టి తీశారు అతనికి..

పల్లకి మోస్తున్నప్పుడు బోయీలు భుజాన్ని మారుస్తుంటారు.. అలా భూమి భుజాన్ని మారుస్తోంది. కొన్ని బంధాలు, బరువుని మోస్తుంటే..
రవి కాంతి నుండి వస్తున్న సింధూర వర్ణం కూడా అతనికి స్వాగతం పలుకుతోంది…

ఇన్ని మంచి శకునాలా (signs) మధ్య ఆ వైకుంఠపురంలో, అక్కడెక్కడో ఉన్న ఆ భవనం లోకి
తారంగం చేసే కృష్ణుడిలా, తాండవం ఆడే శివుడిలా అతను వచ్చాడు…

 

అత్తారింటికి దారేది లో “దేవ దేవం భజే” పాట ని కూడా ఇలాంటి సందర్భం లో ఒక మంచి శకునం (Sign) అనిపించేలా ఉపయోగించారు. సినిమాలో ఇలా పద్యాలని, కీర్తనలని పెట్టడం వల్ల వాటి గురించి మరింత మంది తెలుసుకునే అవకాశం, సందర్భం ఏర్పడుతుంది. ‘అల వైకుంఠంపురం’ అనే టైటిల్ నుండే ఆ అవకాశం చేకూరింది.. ఆ పద్యానికి కొనసాగింపు అద్భుతమైన వర్ణన తో ఈ పాట ని రాసారు కళ్యాణ చక్రవర్తి గారు..


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , ,