Contributed By Divya Vattikuti
స్నేహితుడు సినిమా లో విజయ్ స్టార్ట్ చేసే స్కూల్ లాంటి దాన్లో మనం కూడా చదివి ఉంటె బాగుండేది అని తప్పకుండా ఒక్కసారైనా అనుకునే ఉంటాం .. అలాంటిదే తెలంగాణ లో ఉన్న అక్షర వనం.
రెగ్యులర్ టీచర్ స్టూడెంట్ కాన్సెప్ట్ లో నడిచే స్కూల్స్లా కాకుండా , పీర్ లెర్నింగ్ కాన్సెప్ట్ లో రన్ అవుతది ఈ స్కూల్ . అంటే హోంవర్క్ చెయ్యకపోతే కొట్టే టీచర్ ఉండరు. , బట్టి పట్టి చదివే అవసరం ఉండదు .
How did this school start:
కల్వకుర్తి , నగర్ కర్నూల్ జిల్లా లో ఉన్న ఈ స్కూల్ 2015 లో స్టార్ట్ అయ్యింది . ఈ పాఠశాల ఉన్న క్యాంపస్ ల్యాండ్ ని మాధవ్ రెడ్డి అనే వ్యక్తి డొనేట్ చేశారు . అక్షర వనం రీసెర్చ్ హెడ్ మరియు వందేమాతరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీపతిరెడ్డి గారు తన జీవితాన్ని వందేమాతరం ఫౌండేషన్ కోసం అంకితం చేశారు. గవర్నమెంట్ పాఠశాలలను బలోపేతం చేసే పనిలో ఉన్నప్పటికీ, వందేమాతరం ఫౌండేషన్, విద్యార్థి స్నేహపూర్వక పీర్ లెర్నింగ్ పాఠ్యాంశాలతో అక్షర వనంను ప్రత్యామ్నాయ పాఠశాలగా రూపొందించాలని నిర్ణయించింది.
అక్షర వనం నిర్మాణం లో శ్రీమతి పులిమామిది రేఖ మరియు రఘునాథ్ రెడ్డి & కుచికుల్లా జనార్థన్ రెడ్డి గారు (మాజీ ఎంపి, మహాబుబ్‌నగర్) మరియు శ్రీమతి. ఉషా రెడ్డి దాతలు గా నిలిచారు.
Why peer learning:
మనలో చాలా మందికి డౌట్ అడగాలంటే భయం . టీచర్ తిడతారేమో అని భయం , స్నేహితులు ఎక్కిరిస్తారేమో అని భయం . అలంటి వాటి గురించి భయం అక్కర్లేదు ఈ అక్షర వనం లో . ఇక్కడ టీచర్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ మాత్రమే ప్లే చేస్తారు . .మినిమం లెర్నింగ్ అబిలిటీస్ అనేది మాత్రమే ఇక్కడ పిల్లలు చదివే సబ్జెక్టు . ఇందులో జీవితానికి ఉపయోగ పడే విధంగా ఆక్టివిటీస్ , జీవితానికి ఉపయోగ పడే వాస్తవ సమస్యల తో ఉంటాయి ఈ మోడ్యూల్స్ . చదువు అంటే బలవంతం తో కాదు పిల్లలు ఇష్టం తో నేర్చుకోవాలి అన్నదే ఈ అక్షర వనం ముఖ్య ఉద్దేశం .
పూర్తిగా రెసిడెంటిల్ క్యాంపస్ లో నడిచే ఈ అక్షర వనం లో పిల్ల్లలు ఫోన్ వాడటానికి ఉండదు . ప్రతి రోజు కంప్యూటర్ ల్యాబ్ లో గంట సేపు తప్పనిసరి గా ఇంగ్లీష్ మూవీస్ చూడాల్సి ఉంటది . ఆలా చుసిన సినిమా గురించి తర్వాత మాట్లాడాల్సి వుంటది. దీనితో పాటు టైపింగ్ కూడా ప్రతి రోజు ప్రాక్టీస్ చెయ్యాల్సి ఉంటది. వినడం ద్వార మాట్లాడటం వస్తుంది.... చదవడం ద్వారా వ్రాయడo వస్తుంది.... అన్నది ఇక్కడ నమ్మే సిద్ధాంతం.
పిల్లలు అందరు కలిసి తామే వంట చేస్తారు , వడ్డించుకుంటారు, పాత్రలను తోమి యధాస్థానం లో పెడతారు. . చెత్తని వేరు చెయ్యడం నుంచి , ఆ చెత్తను వెర్మికంపోస్టు గా తయారు చేస్తారు ఇక్కడి పిల్లలు . వెల్డింగ్ , కార్పెంటరీ , వ్యవసాయం, నాట్యం , శింగింగ్ , షూటింగ్ తో పాటు వివిధ రకాల ప్రొఫెషనల్ స్కిల్స్ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది .
Admissions into Aksharavanam
స్లో లెర్నింగ్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు, ఆర్ఫాన్స్, సెమి ఆర్ఫాన్స్, ఈ పీర్ లెర్నింగ్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులకు అడ్మిషన్ లో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ కోసం బేస్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అక్షరవనం లో చదివే విద్యార్థులకు ఫీజు ఏమి ఉండదు. మినిమం లెర్నింగ్ అబిలితిఎస్ అన్ని మోడ్యూల్స్ పూర్తి ఐన తరువాతా విద్యార్ధి ఓపెన్ లో 10th పరీక్షలు రాసే విధంగా తయారు చేస్తారు. ఇందులో చదివే విద్యార్థులు IIT లాంటి పోటీ పరీక్షలను సులువుగా ఛేదించగాలరని ఇక్కడి యాజమాన్యం చెప్తున్నారు.
National Education Policy 2020:
ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ లో ఉన్నవి మేము ఎప్పటి నుంచో ఆచరించగలుగుతున్నాం అని చెప్తారు అక్షరవనం యాజమాన్యం. లాంగ్వేజ్ , లాజిక్ , లైఫ్ స్కిల్స్ ఈ మూడు ఉంటె ఏ విద్యార్ధి ఐన గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. సమాజ అవసరాలకు అనుగుణంగా నేటి విద్యావిధానమే మార్పు చెందాలని అంటోంది నివేదికలు. దాని కోసమై అక్షర వనం లో వివిధ పాఠశాల నిర్వాహకులకు, టీచర్లకు, తల్లి దండ్రులకు క్యాంపు రూపం లో అవగాహన కలిగిస్తుంది.
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అక్షరవనం. చదువంటే భయం, ఒత్తిడి లేకుండా ఆట పాటలతో అత్యంత సులువుగా నేర్చుకునే విద్యావిధానం తక్షణ అవసరమని గుర్తు చేస్తోంది. సులువైన... ఆమోదయోగ్యమైన బోధన విధానాలపై ప్రయోగాత్మక పరిశోధన కొనసాగిస్తూ... సత్ఫలితాలు అందుకుంటోంది.