What If You Look More Beautiful In The Mirror? – A Short Story

 

Contributed By Nimmagadda Saroja

 

రమ్య ఎంతో అలసిపోయినా ఎదో తెలియని ఉత్సాహం గా ఉంది తనకు. ఎప్పటి నుంచో తనకు హైదరాబాద్ వచ్చేయ్యాలని కోరిక , ఇప్పటికి తన కల తీరింది. ఇప్పుడిక మనీష్ తో పెళ్ళి గురించి సీరియస్ గా ఆలోచించొచ్చు . కారు లో వెళ్తుంటే తన ఆలోచనలు రక రకాలుగా విహరిస్తున్నాయి. ఇంట్లో ఒప్పుకుంటారంటావా ? ఆహ్ ఒప్పించవచ్చు లే అనుకుంది. అస్సలు తను హైదరాబాద్ వస్తున్నది కూడా మనీష్ కి సర్ప్రైజ్ , ఎలా రియాక్ట్ అవ్వుతాడో .. అనుకుంటూ చిన్నగా తనలో తానే నవ్వుకుంది. ఇంతలో కార్ ఆగింది. డ్రైవర్ కి డబ్బులిచ్చేసి , తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. ప్యాకెర్స్ వాన్ రేపు వస్తుంది, అంత వరకు ఖాళీ గా ఉన్న అపార్ట్మెంట్ ని తను ఎంజాయ్ చెయ్యాల్సిందే.

 

హాల్, బెడఁరూంస్ , బాల్కనీ అన్ని చాలా బాగున్నాయి. ఈ ఏడాది ఎలా ఐన లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఉంది, ఇదే తీసుకుంటే పోలా అనుకుంది తను ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ.. మనీష్ కి మెసేజ్ పెట్టింది, “అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను ఒక రెండు గంటల్లో కలుద్దామా ?” అని. అతను ఫోన్ వెంటనే చూసుకోడు అని తెలుసు , ఈ లోపల స్నానానికి వెళ్దాం అని, బాగ్స్ తెరచి, తన బట్టలు తీసుకొని, స్నానం చేసి వచ్చింది. బాత్రూమ్ బయట డ్రెస్సింగ్ రూమ్ లో లైటు వేసి, తల తుడుచుకుంటూ అద్దం లోకి చూసింది. ఒక్క సారి తనను తాను చూసి నమ్మలేకపోయింది, తను ఏంటి ఇంత అందంగా కనిపిస్తున్నాను అనుకుంది. అంటే తాను అందంగా ఉండనని కాదు, కానీ ఎదో తెలియని కొత్త కళ. బహుశా తన మనసులోని సంతోషం ఇలా కనిపిస్తోంది ఏమో అనుకుంది. ఈ లోపల మెసేజ్ వచ్చింది. “అరే! చెప్పనే లేదు! ఎక్కడ కలుద్దాం? బరిస్టా ? ఎన్నాళ్ళు క్యాంపు ? వీకెండ్ వరకు ఉంటావా?కాల్ చేసే స్థితి లో లేను, మీటింగ్ అయ్యాక చేస్తా!” నవ్వుకొని మళ్ళీ అద్దం లో చూసింది, తననే తాను చూసుకుంటోందా అనిపించే అంత ముద్దుగా ఉంది తన ప్రతిబింబం. అలా తదేకంగా చూస్తూనే , తయారు అవ్వుతూ కూని రాగాలు తీసే ప్రయత్నం చేసింది , ఎందుకో తెలియదు ఎక్కడ నుంచో తనకు ఈ పాట వినిపించింది.

 

” తన కన్నులు చురకత్తుల్లా గుండెను కోస్తుంటాయి,
తన నవ్వులు ఆ గాయానికి మందులు పూస్తుంటాయి..
తానెవ్వరు అంటే అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి”

 

ఎక్కడ నుంచా అని ఆరాగా తల పైకి ఎత్తి అద్దం లో చూసింది. ఒక్క సారి గుండె ఝల్లు మంది, అద్దం లో తను నవ్వుతున్నట్టు, తననే చూస్తున్నట్టు అనిపించింది, ఒక్క క్షణమే , తరువాత మామూలుగానే ఉంది కానీ .. గుండె దడ తగ్గటానికి 5 నిముషాలు పట్టింది. ఖాళీ గా సామాను లేని ఇంట్లో ఇలాంటివి అనిపించటం మామూలే ముందు కంజూరింగ్ మూవీస్ చూడటం ఆపితే మంచిది అనుకుంది.

 

తయారు అయ్యాక అక్కడే అద్దం ముందే ఒక సెల్ఫీ దిగుదాం అనుకుంది, ఫోన్ తీసి ఫోటో దిగబోతుంటే, అద్దం లో ఉన్నంత అందం గా ఫోన్ లో అనిపించకపోటం తో వెనక్కి తిరిగి అద్దం లో చూడబోతుండగా ఫోన్ మోగింది, చేస్తున్నది మనీష్ అని చూసి, నవ్వుకుంటూ ఫోన్ ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టింది. తన పర్సు, ఇంకా చెప్పులు తీసుకొని బయటకు వచ్చి , తలుపు తాళం వేసింది. కానీ తన డ్రెస్సింగ్ రూమ్ లోని అద్దం లో అమ్మాయి అలానే నిలుచొని ఉంది అని గమనించనే లేదు!

 

తనను చూసి ఆశ్చర్యపోయిన మనీష్ తో ” నేను ఇలా వచ్చాను అంటేనే ఇంత సర్ప్రైస్ అవ్వుతున్నావ్ , ఇంకా మొత్తానికి వచ్చేస్తే ఏం చేస్తావోయ్ ?” అని అంది , అతనేమో అనుమానంగా చూస్తూ ” Don’t tell me !” అని ఆశ్చర్యపోయాడు , “అస్సలు ఒక్క మాట కూడా చెప్పలేదు, గూగుల్ ఆఫర్ లెటర్ వచ్చిందా? నీతో మాట్లాడటం కూడా దండగే , ఇప్పటి వరకు చెప్పాలి అనిపించలేదా ? నీ డ్రీం జాబ్ , హైదరాబాద్ కి రావటం, ఇన్ని జరుగుతున్నా ఒక్క మాట చెప్పలేదు! అస్సలు నేను నీతో మాట్లాడనే కూడదు “ అంటూ బుంగమూతి పెట్టే ప్రయత్నం చేశాడు. “ నేను చెప్పే అప్పుడు నీ మొహం చూడాలి అనుకున్నా. ఇలా చెప్పటం కంటే బెటర్ ఏం ఉంటుంది చెప్పు ?” అని అంది ” నేను నీతో మూవ్ ఇన్ అవ్వొచ్చా?” అని కొంటెగా నవ్వుతూ అడిగాడు ” తంతారు , అంత లేదు! మహా అయితే రేపు నువ్వు, మన బ్యాచ్ తో కలిసి వచ్చి నాకు సామాను సర్దడానికి సాయం చెయ్యి “ అంది. “నువ్వు ఈ రోజు వచ్చి రేపు అందరూ వచ్చెయ్యండి అంటే సెలవలు పెట్టాలి గా అందరూ ?”
” ఇంతోటి దానికేనా హైదరాబాద్ వచ్చేయ్ అని ఊదరగొట్టింది? నా కోసం ఒక్క రోజు సెలవు దొరకదా?” అంటూ సణిగింది.
“సరే, అసల నీ ఫ్లాట్ చూద్దాం పద, అందరినీ సాయంత్రం అక్కడికే రమ్మంటే సరిపోతుంది” అని బయలుదేరారు.

 

రమ్య ఇంటికి చేరుకునే సరికి, ఎవరో పాడుతున్నట్టు అనిపించింది, కానీ తాళం తీసే సరికి ఆ పాట ఆగిపోయింది. పక్క ఫ్లాట్ లో వాళ్ళు ఎవరన్నా ఏమో అనుకున్నారు ఇద్దరూ. లోపలికి వచ్చి , ఫ్లాట్ మనీష్ కి చూపించ సాగింది రమ్య. బెడఁరూం లోని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వచ్చాక తన చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి, “why didn’t you tell me before you came here.. “అని అడిగాడు. “ఏమో, ఇలానే నిన్ను చూస్తూనే చెప్పాలి అనిపించింది అందుకే చెప్పలేదు.. పెద్ద కారణం ఏమీ లేదు ” అంది ఆమె. ఆమె మాటకాడుతున్నా కూడా మనీష్ తనను గమనించకుండా అద్దం లోకి తీక్షణంగా చూస్తున్నాడు

 

” రమ్య? నువ్వు ఇందులో ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నావు?” ఆమె కి వెంటనే చిర్రెత్తుకొచ్చింది
” అంటే నేను బయట అందంగా లేను అనే గా ? ” అంది ముక్కు మీద కోపం తెచ్చుకుంటూ..
” అరె ! బాబా ! లుక్ , you look two shades ligther in the mirror, ఇంకా నీ జుట్టు కూడా చూడు అస్సలు చేరగలేదు ?” — అని అంటూనే , అద్దం లోని ప్రతిబింబాన్ని తాకడానికి ప్రయత్నించాడు — ఎక్కడో సన్నగా

 

” అర చేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది
తాకాలనిపించే తలుపును రగిలిస్తుంటుంది
తానెవ్వరు అంటే ..
అద్దం లో చూస్తే తను ఓ అమ్మాయి..
నిద్దురకే తెలిసే రంగుల నడి రేయి ”

 

అంటూ వినిపిస్తుంది. రమ్య, మనీష్ ఇద్దరూ ఆ అద్దం వైపు, ఆ అద్దం లోని అందమైన అమ్మాయి వైపు తదేకంగా చూస్తున్నారు.. ఆ ఆలాపన వెనకాల సాగుతూనే ఉంది.. ఎక్కడిది ?ఎందుకు వినిపిస్తోంది అని వీరిద్దరూ ప్రశ్నించుకునే స్పృహ లో కూడా లేరు.. మనీష్ చెయ్యి అద్దాన్ని తాకే వరకు వచ్చాక, ఇంక తాకేస్తుంది అనగా , బెల్ మోగింది.. వెంటనే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు .. ముందు తలుపు వైపు. అద్దం లోని రమ్య మాత్రం నిరాశగా మళ్ళా తనని ఎప్పుడు పట్టించుకుంటారా అన్నట్టు దీన వదనం పెట్టింది.

 

సశేషం..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,