విజయవాడకు చెందిన అబ్దుల్ రహీమ్ గారి ఇంట్లో పది కాదు, ఇరవై కాదు ఏకంగా 150 రకాల పావురాల జాతులున్నాయి. వాటిని తమ ఇంటి సభ్యులుగా ఆత్మీయంగా పెంచుతున్నారు రహీమ్. ఇన్ని రకాల పక్షులు పెంచుతున్నాడు కాబట్టి ఒక అనుమానం రావచ్చు.. కాని ఇతనేం సంపన్నుడు కాదు ఆటోనగర్ లో ఓ సాధారణ టైర్ పంక్చర్ షాప్ నడిపే వ్యక్తి. రహీమ్ ఇన్ని రకాల పావురాలను సాకుతున్నాడు అంటే అతనికి పక్షులంటే ఎంత ప్రేమనో అనే విషయాన్ని సులభంగా అర్ధం చేసుకోవచ్చు
150 రకాల పక్షులు: కేవలం ఆంధ్రప్రదేశ్, భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడ తనకి నచ్చిన పక్షులున్నా అవి విజయవాడ వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలవా లేదా అవి ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటాయి అని పరిశీలించి తన ఇంటికి తీసుకువస్తారు. ప్రస్తుతానికి తన ఇంట్లో హై ప్లైయర్స్, ఇండియన్ ఫౌంటేల్, ప్రిల్ బ్యాక్, హానా పోటర్స్, జర్మన్ బ్యూటీ హోమర్స్, లిల్లీ పోటర్ మొదలైన 150 రకాల పావురాల జాతులు ఉన్నాయి.
పక్షులతో అనుబంధం: కొంతమందికి సినిమాలంటే పిచ్చి, మరికొంతమందికి బైక్స్ అంటే పిచ్చి... అబ్దుల్ గారికైతే పావురాలంటే పిచ్చి. అలా చిన్నతనం నుండే పావురాలను పెంచడం మొదలు పెట్టారు. ప్రస్తుతం రహీమ్ గారింట్లో 150 రకాల పక్షలతో 200కు పైగా పావురాలున్నాయి. వీరి ఇంటికి వచ్చిన ఆత్మీయులలో చాలామంది ఆ పావురాలలో కొన్ని ముద్దొచ్చే పావురాలని అమ్మాలని అడిగినా అబ్ధుల్ గారు ససేమిరా అంటారు. మరిన్ని విషయాలు తన మాటలోనే..