"ఎదుటా నీవే.. ఎదలోనా నీవే …. ఎటు చూస్తే అటు నీవే మరుగైన కావే.. ఎదుటా నీవే.. ఎదలోనా నీవే…”
"బాబు.. బాబు... ఫోన్ మోగుతుంది .... "
"షిట్.. ఏ స్టేషన్ అండి ఇది.."
"ఏలూరు వస్తుంది బాబు ఇపుడు"
ఇదంతా కల??? తనను కలవటం.. తనతో మాట్లాడటం.. తనకు నా ప్రేమను చె.. ఛ.... కలలో కూడా నా ప్రేమను చెప్పలేకపోయా కదా.. నా ప్రేమ కాగితాలకే పరిమతమేమో.. చూడగానే పడిపోయిన ప్రేమ కాదు.. పది సంవత్సరాలు తన కోసం తపిస్తూ... తానే నా జీవితం అనుకుంటూ ఇన్నాళ్లు బ్రతికాను. ఇక నుండి తనతోనే బ్రతకాలి అని నిర్ణయించుకుని తనదగ్గరకి చేరాను. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరికి తిరిగొచ్చాను.
*******
మాటలు రాని మౌనం క్షణం ఒక యుగంలా గడుస్తున్న కాలం తనని ఎప్పుడు చూస్తానా అని ఒకటే కుతూహలం గుండెనిండా నింపుకున్నా దైర్యం పయనమయిన నీ దగ్గరకు ఈ క్షణం ప్రేమే చూపేనా నా గమ్యం నిన్ను చేరాలనే తపనే పెంచెను నా గమనం వస్తున్నాను ప్రేమ ఈ క్షణం నీ కోసం
"ఐ లవ్ యు" ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా. నేను చెప్పలేక, తను ఎప్పుడు చెప్తాడో అనే ఆలోచనని లోపల దాచుకోలేక... ఆ ఆలోచనల్ని, అంతులేని ఎదురు చూపుల్ని కన్నీటి ధారలా బయట పడ్తున్నాయి...
"ఈ మాట చెప్పటానికి ఇన్నేళ్లు పట్టిందా అభి?"
"లోపల ఎన్ని అనుమానాలు ఆలోచనలు ఉన్నా వాటిని దాటుకుంటూ నీకు ఈ మాట చెప్పటానికి ఇన్నేళ్లు పట్టింది.. అంత ప్రేమ ఉన్నదానివి నువ్వెందుకు చెప్పాలి."
"నాకు ప్రేమించటం తెలుసు కానీ, ప్రేమను ఎలా చెప్పాలో తెలీదు"
ఆ క్షణం అలా ఆగిపోతే బాగుండు అనిపించింది. ఒకరి కౌగిలి లో ఒకరం అలాగే ఉండిపోతే బాగుండు అనిపించింది.
"అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను"
"బేటీ... బేటీ... ఇందాక నుండి ఆ ఫోన్ మోగుతుంది.. కొంచెం దాన్ని ఆపు... "
ఇదంతా కలా?? తనని కలవటం.. మాట్లాడటం.. ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోవటం... ఇదంతా కలా?? చాల బాగుంది.. ఇదే నిజం అయితే ఎంతో బాగుంటుంది.. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? ఇప్పటి వరకు నా కలలో, నా కౌగిలిలో ఉన్నా అభి ఇపుడు ఆ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు..
"హలో... అయేషా"
"అభి?? ఏంటి ఈ టైం లో?"
"మాట్లాడాలనిపించింది"
"ఇంత పొద్దున్నేనా?"
"మనసుకి ఉదయం సాయంత్రం తెలియదు కదా"
"ఎక్కడున్నావ్"
"ఒక్కసారి బయటకొస్తే నీ ఎదురుగ ఉంటా.. నువ్వు ఔనంటే జీవితాంతం నీతో ఉంటా"
"అభి ???"
"ఐ లవ్ యు"
THE END