భాషని నిలబెట్టే రచయితలు: A Short Poem On How Writers Can Bring Back Lost Glory To A Language
Contributed by Sai Ram Nedunuri
భాష విస్మరించబడింది
తనకింక విలువ లేదని విమర్శించబడింది
ఘాఢాంధకారంలో కృంగిపోయింది
అజ్ఞాతం వైపు నడిచింది
కవితా లోకం యావత్తూ కన్నీరు కార్చింది
కొండంత భాధని దిగమింగుకుని
నైరాశ్యపు సంకెళ్ళు తెంచుకుని
చమర్చిన చక్షువులు తుడుచుకుని
ఖడ్గ సమానమైన కలం చేతబూనుకుని
రచయితల సమూహం పూనుకుంది
వారికి అక్షరం ఆసరానిచ్చింది
పదం పాదం కలిపింది
వాక్యం వంత పాడింది
భావం బాసటగా నిలిచింది
రచన రక్తి కట్టింది
అటువంటి రచనలతో భాష ఉనికి తిరిగి చిగురించింది
తేనెలొలికే తన మాధుర్యం అందరికీ తెలిసొచ్చింది
తన మొఖంపై చిరునవ్వు వెల్లివిరిసింది
భాష అజ్ఞాతం వీడింది
మళ్ళీ అందలం ఎక్కింది
If you wish to contribute, mail us at admin@chaibisket.com