One App That Books Cabs, Food, & Movie Tix For People Who Can’t Use Smartphone!

 

Woobloo app మీద ఒక్క క్లిక్ చేస్తే చాలు క్యాబ్ సర్వీస్, మెడికల్, గ్రాసరీ, ఫుడ్, ట్రైన్ బస్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఇలా రకరకాల ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. వీటిలో మనకు అవసరమైన వాటి మీద క్లిక్ చేస్తే నేరుగా Woobloo వారికి కాల్ వెళ్లిపోతుంది. కాల్ సెంటర్ లో మనం మాట్లాడే భాషలో(తెలుగు, హిందీ, ఇంగ్లీష్) కావాలిసినవి వారికి చెబితే ఇక మిగిలిన పని వారు చూసుకుంటారు. అమెజాన్ లో ఆర్డర్ పెట్టడం దగ్గరి నుండి ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేర్ వరకు ఇలా 50 రకాల సేవలను పూర్తిగా మనకు ఓ అసిస్టెంట్ లా శిరీష గారు స్థాపించిన ఈ Woobloo సంస్థ చేసిపెడుతుంది.


 

మీకో విషయం తెలుసా మన దేశంలోని దాదాపు 20% అర్బన్ ప్రాంతంలో నివసించే ప్రజలకు సరిగ్గా ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదు. ఇక పెద్దవారి పరిస్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు. మన పేరెంట్స్ మనకు చదువు చెప్పించడం, టెక్నాలజీ లో విప్లవాత్మక మార్పులు రావడం వల్ల మనం టెక్నాలజీని ఉపయోగించగలుగుతున్నాము కానీ మన పెద్దవారి కాలంలో ఈ పరిస్థితులు లేకపోవడంతో ప్రస్తుతం వారు టెక్నాలజీ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ దాదాపు ప్రతీ ఇంట్లోనూ క్యాబ్ బుక్ చేసుకోవడానికి సైతం తల్లిదండ్రులు, పెద్దవారు పిల్లలపై ఆధారపడతారు. ఇకనుండి వారికి ఈ పరిస్థితి రాకపోవచ్చు.ఈ యాప్‌ ద్వారా మందులూ, అంబులెన్స్‌, క్యాబ్‌, సినిమా, రైలు, బస్‌, విమానం టికెట్లు, సరకులూ, ఆహారం, డ్రైవర్లూ, రెంటల్‌కార్లు, హోటళ్లూ, బిల్లు కట్టడం, ప్లంబర్‌, హౌస్‌కీపింగ్‌, పవర్ బిల్, ఈ సేవ, మీ సేవ, గిఫ్టింగ్‌, ఫొటోగ్రఫీ మొదలైన సర్వీస్ లన్నీ నెలకు రూ.299తో పొందవచ్చు. బిగ్ బాస్కెట్, అమెజాన్, ఉబర్, ఓలా, మెడ్ ప్లస్, పీవీఆర్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తుండడం వల్ల అందులో ఇవ్వబడే అన్ని ఆఫర్లు, డిస్కౌంట్ ల గురుంచి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది. మనం కాల్ చేసినప్పుడే డిస్కౌంట్ ల గురుంచి, గిఫ్ట్ కార్డ్ ల గురుంచి ప్రత్యేకంగా వివరిస్తారు కూడా. ఒకవేళ డెలివరీ తప్పు జరిగిన, వస్తువులు పగిలిపోయినా Amazon, Bigbasket లాంటి కంపెనీలతో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేరుగా Wooblooవారికి కాల్ చేస్తే Damage ఐన వస్తువులను తీసుకుని తిరిగి అదే డబ్బుతో కొత్త వస్తువులను తీసుకువస్తారు. ఇలాంటి రకరకాల బాధ్యతలన్నీ ఒక కేర్ టేకర్ గా, ఒక అసిస్టెంట్ గా పూర్తిచేస్తారు.


మిగిలిన సర్వీస్ లలో కేవలం information మాత్రమే ఇస్తుంటారు కాని సర్వీస్ ఉండదు, ఇక్కడ మాత్రం అలా కాదు. Appలో చూపించే అన్ని సర్వీస్ లను నమ్మకంగా అందిస్తారు. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, టీవీ, ఏసీ రిపేర్ మొదలైన వారితో అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు స్వయంగా వారి ఇంటికి, లేదంటే తెలిసిన వారింటికి ఒక మామూలు కస్టమర్లలా పిలిచి పనితనం ఎలా ఉంటుందని అంచనా వేస్తారు. అన్ని విధాలా బాగున్నప్పుడే Woobloo అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ తర్వాతనే వారు Woobloo తరుపున పనిచేస్తారు. నెలకు ఒక్కసారి ఇందులో మెంబర్ షిప్ తీసుకుంటే Additionalగా ప్రతి ఒక్క సర్వీస్ కు ఏ విధమైన చార్జ్ కూడా చేయరు.


మన ఫోన్ లో ఓలా, ఉబర్ యాప్ ఉంటుంది. అందులో ఒకే రూట్ కు ఒక్కోసారి ఒక్కో Price చూపిస్తుంది. Woobloo నుండి మాత్రం ఎప్పుడూ “కస్టమర్ రిజనబుల్” అనిపించే Priceని మాత్రమే చూపిస్తుంది(ఓలా, ఉబర్ తో కలిసి పనిచేస్తుండడం మూలంగా). Wooblooలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది సెక్యూరిటీ సర్వీస్ గురుంచి. App లోనే వీటి ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితులలో పోలీస్, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ కు ఒక్క క్లిక్ తో మనం ఉన్న లొకేషన్ తో సహా కాల్ వెళ్లిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే Woobloo కస్టమర్ల కోసం ఇస్తున్న సర్వీస్ లు ఎన్నో.. ఎన్నెన్నో.. (Police, fire, emergency)


 

టెక్నాలజీ తో ప్రపంచం చాలా మారిపోయింది. మారిపోయిన ప్రపంచంలో ఇంకా మన పెద్దవారు ఇమడ లేకపోతున్నారు. టెక్నాలజీ ద్వారా వచ్చిన ఆ సౌలభ్యాలను మన తల్లిదండ్రులకు ఉపయోగపడకుంటే ఎలా అనే మాధనంలోనే Woobloo ఉదయయించింది. ఎంతకాలం ప్రతి చిన్ని విషయానికి మన మీద ఆధారపడనిద్దాం చెప్పండి..

Visit their Website here

Or contact them here: 85018 50130

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,