ఎందుకంటే… నువ్వు After all ఆడదానివి – Confessions of a Man on Women’s Day!

నువ్వు నా చెల్లివి , నాతో పాటే నా తల్లితండ్రులు కన్న అపురూపానివి కానీ ఆడపిల్లకి చదువెందుకు అని చులకన చేస్తాం , కట్నం కోసం కష్టపడాలని బాధపడతాం
నువ్వు నా స్నేహితురాలివి స్నేహపు ముసుగులోంచి నిన్ను కామంగా చూస్తాం , ఒక చిన్న ‘అవకశ’ మైనా దొరకక పోతుందా అని ఆలోచిస్తాం
నువ్వు నా క్లాస్ టీచర్ వి నీ మీద కంమెంట్లు వేస్తాం , నీ షేపుల గురించి లంచ్ బ్రేక్ లో వా దులాడుకుంటాం
నువ్వు నా తోటి విధ్యర్ధివి ఎవడితో నీకు ఎన్ని ఎఫ్ఫైర్లు ఉన్నాయో కనుక్కుని నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాం మాకు కావలసింది తీస్కుంటాం
నువ్వు నాలాగే కాలేజీ కి వెళ్ళే స్టూడెంట్ వి , నీకు ప్రపోజ్ చేస్తాం , ఒప్పుకోక పోతే పచారి కొట్టు లో క్వాలిటీ ఎక్కువ ఉన్న యాసిడ్ బాటిల్ కోసం రెండొందలు ఖర్చు పెట్టైనా సరే నీ జీవితాన్ని నాశనం చేస్తాం
నువ్వు నా సహుద్యోగివి నలుగురితో చనువుగా ఉంటే ‘చెడింది’ అని ముద్ర వేస్తాం , ఆ ‘చెడ’కొట్టే చాన్స్ కోసం ఎదురుచూస్తాం
నువ్వు నా ప్రేయసివి నీకంటే అందగత్తె కనపడగానే ఇన్నాళ్ళు నీకు చెప్పిన కబుర్లు పక్కకి నెట్టేసి దాని వెంట పడతాం
నువ్వు నా భార్యవి ‘పెళ్లి’ అన్నే రెండక్షరాల నెపంతో చిన్నప్పటి నుంచీ ప్రాణంగా పెంచుతున్న తల్లిదండ్రులను వదిలేసి రాత్రికి రాత్రి వచ్చి మా పక్కలో ‘పడుకో’ మంటాం
నువ్వు మూడు ఏళ్ళ వయసులో స్కూలుకు వెళుతున్న చంటి పిల్లవి చైల్డ్ పోర్న్ వెబ్సైటు లో వీడియోలు డౌన్లోడ్ చేసి నీ మీద ‘కసి’ తీర్చుకుంటాం
నువ్వు 12 ఏళ్ళు నిండి రజస్వల అయిన ఆడ పిల్లవి కామం తో దగ్గరకి తీసుకుని మీ అమ్మ , నాన్న ల కి చెప్పద్దంటాం
నువ్వు సినిమా ల మీద ఆసక్తి తో సినీ రంగానికి ఒచ్చిన నటివి , ఎంతమంది తో ‘పడుకుంటే’ ఈ స్థాయి కి చేరుకుందో అని తీర్పు చెప్పేస్తాం
నువ్వు షాపింగ్ కి ఒచ్చిన ఆడదానివి , ట్రయిల్ రూముల్లో కెమెరాలు పెడతాం అవి తీసుకెళ్ళి ఇంటర్నెట్ లో పెట్టి పండగ చేస్కుంటాం
నువ్వు మా పక్కింటి అమ్మాయివి నీ డబ్బు తో, నీ మొఖానికి ,నువ్వు మేకప్ వేసుకుని బయటికెళ్తే ‘బజారుది’ అని గంట కొడతాం
నువ్వు రోడ్డు మీద వెళుతున్న ఒక సగటు ఆడపిల్లవి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో మేమే డిసైడ్ చేసేస్తాం
నువ్వు ట్రైనులో 60 మంది మగాళ్ళ మధ్యన కూర్చున్న ఒంటరి ఆడపిల్లవి , అంత ధైర్యం నీకెక్కడినుంచి ఒచ్చింది అనుకుంటూ కుళ్ళిపోతాం
నువ్వు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద అత్యవసర పరిస్తితుల్లో తిరుగుతున్న అమ్మాయి వి , అవన్నీ మాకు అనవసరం కదా ‘వస్తవా’ అని అడుగుతాం
నువ్వు రోడ్డు మీద నాకు దొరికిన వేశ్యవి , నీ మొఖాన డబ్బులు కొట్టి మా ‘సుఖం’ తీర్చుకుంటాం , ‘పని’ అయ్యాక .. దేశం నాశనం ఐపోతోంది అని కబుర్లు చెప్తాం
నువ్వు నా అర్ధాంగి వి , నాకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నావన్న అక్కసు , ఇగో తో ప్రతి రోజు నిన్ను మాటలతో హింసిస్తూ ఉంటాం , కానీ మంచం మీద మాత్రం ‘ఇగో’ ప్రదర్సించం
నువ్వు భారత స్త్రీ వి , నువ్వు ఎంతమంది పిల్లల్ని కనాలో కూడా మేమే డిసైడ్ చేసేస్తాం
నువ్వు ‘నిర్భయ’ వి , ప్రపంచలోనే అతిపెద్ద ‘ప్రజాస్వామ్య’ దేశానికి రాజధాని ఐన ఊర్లో రాత్రి పూట ఒక బస్సు ఎక్కిన ఒక సగటు మహిళ వి , ఆ బస్సు లోపలో లైట్లు ఆర్పెస్తాం , మా క్రూర సంకెళ్ళతో కట్టేస్తాం , మా పురుష అహంకారం తో నిన్ను బంధిస్తాం , ఎవరికీ నీ మాటలు వినపడకుండా నోరు నోక్కేస్తాం , చిన్నప్పటి నుంచీ తీర్చుకోవాలని చూస్తున్న కామ వాంఛలన్నిటినీ నీ మీద ప్రయోగిస్తాం , ఎదిరిస్తే నీ చెంప పగల గోడతాం , పారిపోవాలని చూస్తే తల ఆ బస్సు నేలకేసి గుద్దుతాం , సృష్టి కర్త సృష్టించిన జీవులలో ‘జ్ఞానం’ అనేది ఉన్న ఏకైక జీవులం మేము ఏమాత్రం కాదు అన్న రీతి లో మా ‘ఆయుధాలు’ బయటకి తీసి నీ సర్వనాడులతో మమ్మల్ని ఎదురిస్తున్న నీ మీద అత్యంత క్రూరంగా దాడి చేస్తాం , పాశవికంగా నిన్ను పంచుకుంటాం , పనయ్యాక సృహ కోల్పోయిన నిన్ను మల విసర్జనకంటే హీనంగా రోడ్డు మీద పడేస్తాం , పోలీసులకి దొరుకుతాం , ‘Juvenile’ చట్టం తో తప్పించుకుంటాం , ఉరిశిక్ష మీద పడ్డా ధీమాగా బతికేస్తాం , ఎవరన్నా ఎందుకిలా చేసారు అని అడిగితే “ఆమె మమ్మల్ని ఎదిరించా కుండా ఉండి ఉంటె ‘పని’ కానిచ్చుకుని పంపించేసేవాళ్ళం కదా” అని ఎదురు ప్రశ్నిస్తాం , ” మన భారతీయ సంస్కృతి ఏంటి అసలు ? ఆ అమ్మాయి ఎనిమిది తరవాత ఒంటరిగా బయటకి వెళ్ళడం ఏంటి “(Defence Lawyer) అని భారతీయ సంస్కృతి వాగ్యేయకారుల లాగా లెక్చర్ ఇస్తాం , అంత పాశవికంగా ఒక ఆడపిల్లని చంపేసిన దుర్మార్గులని కాపాడడానికి కూడా ఎలాంటి చట్టాలు ఉన్నాయా అని ఆరా తీస్తాం , ఆ జరిగిన విషయాన్ని టీవీ లో వస్తుంటే మా పిల్లలు చూడకూడదని , ఇలాంటివి చూస్తే ‘చెడి’ పోతారని టీవీ కట్టేస్తాం , అందరిలో కొందరు ఈ విషయం మీద రోడ్డు కేక్కితే వీరికి అసలు పనేమీ లేదు అని తీసి పారేస్తాం , దీని మీద డాక్యుమెంటరీ తీసి అసలు నిజం , అసలు అభిప్రాయాలు ప్రపంచానికి తెలియజేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ వీడియో ని నిర్దాక్షణ్యంగా ‘బ్యాన్’ చేస్తాం , వారి మీద కేసులు పెడతాం , ఈ విషయం ఎక్కడా ఎవ్వరూ మాట్లాడుకోవడానికే వీలు లేదు అన్నంత జాగ్రత్త తీసుకుంటాం , ఆ జరిగిన విషయం ఒక బూతు సంఘటన గా ఫీల్ ఐపోతూ ఆ విషయాo దానంతట అది మరుగున పడిపోయే దాకా ఆగి ….
ఈ లోగా ఎక్కడో అక్కడ ఒక ఆడపిల్ల బస్సు ఎక్కకపోతుందా , రైలు ఎక్కక పోతుందా , ఒంటరిగా ఇంటికి వెళ్ళక పోతుందా అనుకుంటూ లేడి పిల్ల కోసం సింహం కాపు కాచినట్టుగా కాపు కాస్తూ ‘కామాకలి’ తీర్చుకోడానికి దొరకబోయే ‘కామాహారం’ కోసం వెతుకుతుంటాం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి వాగుళ్ళు ఏవో వాగేసి మా చేతులు దులిపెసుకుంటాం , మా పని ఐపోయింది అనిపించుకుంటాం ..
ఎందుకంటే….
కోజ్జావాళ్ళకి , కుక్కలకీ ఉన్న భద్రత కూడా మీకు లేని ఈ సమాజాన్ని నడుపుతున్న మేము మగాళ్ళం కాదు – మృగాళ్ళం
– Siddhu Manchikanti
If you wish to contribute, mail us at admin@chaibisket.com