This Powerful Poem On How Women Are Being Treated In This Society Is An Eye Opener!

 

ఆవేదన ఆక్రోశన
తొమ్మిది నెలలు మోసిన కన్నతల్లిది
అలాంటి తల్లుల కడుపులో నుండి పుట్టిన ఆ తొమ్మిది మంది చెరలో బందింపబడిన ఆ అమాయకురాలిది

నలుగురితో కలిస్తే ఒక మాట
ఒంటరిగా పయనిస్తే మరో మాట
తిరుగుబోతు అని ఒకరు, తల పొగరు అని ఒకరు
ఆ మాటలు వింటూ ఆ బాధను కన్నీటి లోనే దాచుకుంటున్న ఓ వనిత

ఇది నీ దినం
ప్రపంచ మహిళ దినోత్సవం
కారు కూతలు కూసిన ప్రతి ఒక్కడు నీ కొమ్ముకాసే నీ పర్వదినం

స్నేహం అంటూ నమ్మించి
ప్రేమ అంటూ వంచించి
కోరిక తీరగానే గాలికి విడిచి
మోసపోయాను అని బాధపడాలా?
మోసగాడి చెర నుండి దూరమయ్యాను అని ఆనందపడాలా?
ఆ ఆలోచనలో మరలా స్నేహం అంటూ వచ్చిన మరో మూర్కుని మాటలకు మళ్ళీ లొంగిపోతున్నాను అని కుమిలిపోవాలా?

రోడ్డు పైన నడుస్తుంటే నలుగురి కళ్ళు మీద పడి రక్కుతుంటే
కన్న కలలు నిజం చేసుకుంటాం అంటే ఎన్నో మాటలు అడ్డు చెబుతుంటే
పలకరిస్తే ప్రేమ, వయసొస్తే పెళ్లి
మాట మాట్లాడాలంటే వందసార్లు ఆలోచించే ఓ మహిళా
కలలు కనాలంటే వేల మంది కి సమాధానం చెప్పాల్సిన ఓ మహిళా

ఇది నీ దినం,
ప్రపంచ మహిళా దినోత్సవం
పత్రికలు మొదలు, ఆఫీస్ రూమ్ ల దాకా ప్రతి ఒకడు మీకు అండగా ఉంటా అని మాటిచ్చే రోజు
అలా మాట మాట కలిపి మన దారికి తెచ్చుకోవచ్చు అని ఆలోచించే రోజు

బస్సులో సీట్ మొదలు
పార్లమెంట్ లో సీట్ వరకు
మహిళా రిజర్వేషన్లు ఇస్తూ వారి విలువను వెలకట్టిన ఓ భారత ప్రజానీకం
మీకు ఈ బాటసారి చేస్తున్నాడు ఒక అభివందనం

తెలుగు చదవటం రాని తెలుగోళ్లకు ,
గౌరవం అంటే 3 WhatsApp స్టోరీలు , 2 FB పోస్ట్ లు , 1 tv ఇంటర్వ్యూ లో నాలుగు మాటలు చెప్పటం అనుకునే నా ఈ దేశ పౌరులకు,
ఇంకా అర్ధరాత్రి 12 గంటలకు ఆడవారు రోడ్డు మీద తిరిగితే అదే స్వతంత్రం అనుకునే మిత్రులకి
అలా చేస్తే వేలెత్తి చూపే పెద్దలకు
చేస్తున్నాను ఈ కవిత అంకితం

ఓ అక్షరమే నీకు నమస్కారం
చూస్తుంటే నవ్వొస్తోంది ఈ వెర్రి ప్రజల ఆలోచన విధానం!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,