This Organisation’s Campaign Against ‘Vote For Note’ Includes 15,000 Families & Here’s Their Story

గుడ్లగూబ పగటిని చూడలేదు, కాకి రాత్రిని చూడలేదు.. ఓటు అమ్ముకుంటే ప్రజలు ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని చూసే భాగ్యానికి ఎన్నటికీ నోచుకోలేరు. విజ్ఞతతో ఆలోచించి ప్రలోభాలకు గురికాకుండా మీ ఓటుని వినియోగించండి. –అబ్దుల్ కలాం గారు.
మీరు నమ్మిన వారికే ఓటు వెయ్యండి కానీ డబ్బు తీసుకోకూడదు. రేప్పొద్దున్న చెప్పినవి చేయకుంటే అతడ్ని నడిరోడ్డు మీదైనా నిలదీయ్యొచ్చు. అసలు నిజంగా ప్రజలకు మంచి చెయ్యాలని ఎలక్షన్ లో అభ్యర్థిగా నిలబడుతున్నాదంటే డబ్బులు పంచాల్సిన అవసరం ఏంటి.? జనజాగరణ సమితి.. జనాలను జాగృతం చెయ్యడమే వీరి నిరంతర ప్రయాణం.
నాయకుడు కాదు నయవంచకుడు:
ప్రతిరోజు రాజకీయ నాయకుల ప్రచారం ఎలా జరుగుతుందో వీరి ప్రయాణం అలాగే సాగుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం లేదా రాత్రి వరకు కొనసాగుతుంది. ఇందులో వాలంటీర్లుగా ఉద్యోగస్తులు, చదువుకున్నవారు, స్టూడెంట్స్ ఉండడం వల్ల వంతుల వారిగా, ప్రాంతాల వారిగా ఒక గ్రూపుగా విభజన చేసుకుని ఇంటింటికి తిరుగుతుంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. అరే కష్టపడి రోజుకు 8, 10 గంటలు ఉద్యోగం చేస్తేనే కరెక్ట్ గా జీతం డబ్బులివ్వరు.. రక్తసంబంధికులు, ప్రాణ స్నేహితులు సైతం డబ్బు విషయంలో నిక్ఖచ్చిగా ఉంటున్నారు. ఒకడు వచ్చి నాకు ఓటు వెయ్యండి అందుకు ప్రతిగా ఈ డబ్బు తీసుకోండి అంటే ఎందుకు వేస్తున్నారు..? డబ్బు ఇచ్చేవాడు మీ మీద పెట్టుబడి పెట్టి రేపు వందలు, వేల కోట్లు దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని అర్ధం.


15,000 కుటుంబాలు:
2016 ఆగస్టులో కొంతమంది ఒకేరకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఈ ఆర్గనైజేషన్ ను మొదలుపెట్టారు. వాసు, సంజీవరెడ్డి, శైలజ, సాయి కిరణ్, శ్రీనివాస రావు, మాధవ్, సునీల్ టీం సభ్యులలోని ముఖ్యలు వీరు.. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ ఈ మూడు జిల్లాలలో ఇప్పటివరకు కొన్ని నెలల సమయంలోనే 15,000 ఇండ్లు, వందలాది స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లి లక్షలాదిమందికి ఓటు ప్రాముఖ్యత గురుంచి వివరిస్తున్నారు. అలాగే జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తము చెప్పాల్సిన మాటలను ప్లకార్డు ద్వారా ప్రదర్శిస్తుంటారు.


చదువుకున్నవాళ్ళు కూడా తీసుకుంటున్నారు:
చదువుకోలేని అజ్ఞానంలో ఉన్న పేదవారు డబ్బులు తీసుకుంటుంటే అవగాహన రాహిత్యం, లేదంటే కనీసం ఇవ్వైనా నాలుగు రోజులు బ్రతకడానికి ఉపయోగపడతాయని ఒక అవగాహనకు రావచ్చు. వీళ్ళ టీం రీసెర్చ్ లోనూ కొన్ని భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. “డబ్బు ఇచ్చే నాయకుడు మోసం చేస్తాడని తెలిసినా సమాజం పట్ల బాధ్యత మరిచి చదువుకున్నవారు, ముఖ్యంగా యువత కూడా తీసుకుంటున్నారని తేలింది”. ఇది ఇలానే ఉంటే మరిన్ని దారుణాలు జరుగుతాయి.. ఎన్నికలంటే ప్రజల జీవితాలను మార్చేవిధంగా జరగాలి కానీ ఇలా విలువలను చిన్నాభిన్నం చేసే విధంగా కాదు. అందుకే ఎలక్షన్లలో పోటీ చేసే నాయకులలానే వీరు కూడా ఓటుకు నోటు తీసుకోకూడదు అని కరపత్రాలు పంచిపెడుతున్నారు, ఉత్సాహ పరిచే పాటలతో మనసులను తడుతున్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కూడా డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే వీరు గెలిచినట్టు లెక్క. పూర్తి మెజారిటీతో గెలిపిద్దామా.? లేదంటే చిత్తు చిత్తుగా ఓడిద్దామా..?


For More Updates Follow Them: CLICK HERE

If you wish to contribute, mail us at admin@chaibisket.com