Meet The Telangana Guy Who Is An Expert In 6 Different Martial Art Forms!

 

మామూలుగా ఐతే ఏ Sports Person ఐనా తమ జీవితాంతం ఒకే గేమ్ లో రాణిస్తారు.. లేదంటే ఇంకొందరు రెండు గేమ్ లలో కూడా అతి కష్టం మీద రాణిస్తారు. కాని ఇప్పుడు మనం Discuss చేసుకుంటున్న వివేక్ తేజ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ఆరు విభాగాల్లో నిష్ణాతుడు. ఇండియన్ కరాటే, థాయ్ లాండ్ మాయ్ థాయ్, కేరళ కలరీ ఫైట్, తమిళనాడు తిలంబం, బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్, జపాన్ కిక్ బాక్సింగ్ లలో మేటి. వివేక్ ఏ సినిమా హీరోను చూసి Inspire అయ్యి ఈ రంగంలోకి రాలేదు. అమ్మ నాన్నల ప్రోత్సాహంతో కేవలం మూడు సంవత్సరాల వయసు నుండే మొదట కరాటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు.

13876634_1023649204357177_6537697529299561009_n

 

గురువులు ఏది చెప్పినా గాని వినమ్రతతో నేర్చుకుని, శ్రమనే ప్రాణ స్నేహితునిగా అంచలంచెలుగా ఎదిగిన వివేక్ ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీలలో పాల్గొని, పాల్గొన్న ప్రతి పోటిలో ఖచ్చితంగా ఏదైనా ఒక పతకాన్ని దాదాపు గెలుచుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే శ్రమతో మాత్రమే కాదు ఖర్చుతో కూడుకున్నది కూడా. అది ఏ రంగమైన కానివ్వడి ఇంటి నుండి ప్రోత్సాహం ఉంటే ఊహించినదాని కన్నా ఎక్కువ సాధించవచ్చు. ఒకానొక సంధర్భంలో డబ్బుకు ఇబ్బందిగా ఉంటే కన్నతల్లి తన నగలను తాకట్టు పెట్టి మరి కొడుకు లక్ష్యానికి ఏ ఆటంకం కలుగకుండా చూసుకున్నారు.

14572296_1076381989083898_6095930045184415007_n

 

వివేక్ తేజ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ లెవల్ లో దాదాపు 16 మెడళ్ళు సాధించారు.. మన రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా గాని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు థాయిలాండ్ వెళ్ళి అత్యంత కఠినమైన “మాయ్ థాయ్” ని దాదాపు నాలుగు సంవత్సరాలలో నేర్చుకుని అందులో కూడా రాటుదేలాడు. ఇంత చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన వివేక్ ను చూసి హీరోలు తమ పర్సనల్ ట్రైనర్ గా నియమించుకున్నారు(విక్టరీ వెంకటేష్, రానా, రవితేజ, రకుల్ మొదలైనవారు).

13901325_1023649184357179_84982770220448731_n
271137_132220510193949_2239466_n

 

పైకి అలా కనపడుతున్న కాని వివేక్ మనసు సున్నితమైనది.. డిల్లీ నిర్భయ ఘటన జరిగినపుడు వివేక్ తీవ్రంగా కలతచెందాడు. మహిళల కోసం తనవంతు సహాయంగా ఏదైనా చేయాలని బలంగా నిశ్ఛయించుకున్నాడు. కేవలం తనకోసమే అనుకోకుండా వివేక్ నేర్చుకున్న ఈ అపురూప విద్యను సమయం ఉన్నప్పుడల్లా ఎంతోమంది మహిళలకు ఆత్మరక్షణగా ఉండడం కోసం వారికి నేర్పిస్తున్నారు. ఇప్పటికి వివిధ కాలేజీలకు వెళ్ళి 12వేలమందికి పైగా శిక్షణ ఇచ్చాడు. ఆరు మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడైన వివేక్ తేజ ప్రస్తుత లక్ష్యం ఒక్కటేనండి అదే “2020 టోక్యోలో జరగబోతున్న ఒలపింక్స్”. ఒలంపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో పాల్గొనబోతున్న వివేక్ అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.. ఆల్ ది వెరీ బెస్ట్ వివేక్.

15337544_1144087292313367_4821152299543057451_n
15317787_1144087295646700_2832304764399475147_n

 

Training Venkatesh For the movie "Guru"

Training Venkatesh For the movie “Guru”


 

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,