Meet The Visionary Student Entrepreneur From Kakinada Who Proved That Hardwork Surely Pays!

 

Suggested By: Harshini Narisetti

 

హాయ్.. నా పేరు జానకి రాజేష్, ఏజ్ 21, ఫ్రమ్ కాకినాడ. మనకు ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో ఇక అప్పటినుండే మన జీవితం ప్రయాణమవుతుందని నేను బలంగా నమ్ముతా.. చిన్నతనం నుండి నేను ఏ పని చేసినా, ఏ గేమ్ ఆడినా అది నా కెరీర్ కు ఉపయోగపడాలని నా టీచర్స్, పేరెంట్స్ ద్వారా తెలిసింది. అందుకే నాకు ఎంతో ఇష్టమైన చెస్ ఆటలో ది బెస్ట్ అనిపించుకోవాలని బాగా ప్రాక్టీస్ చేశా.. ప్రాక్టీస్ మాత్రమే కాదు చాలా కాంపిటీషన్స్ లో కూడా పాల్గొన్నా. అలా District Level లో జరిగిన ఒక చెస్ కాంపిటీషన్ లో First Prize కింద నాకో కంప్యూటర్ వచ్చేసింది అప్పుడు నేను 7th class చదువుతున్నా..

unnamed (2)

 

నా జీవితంలోకి ఈ ప్రపంచాన్ని చూపించడానికి వచ్చిన కంప్యూటర్ యే నా లోకం అయ్యింది. ఆ లోకంలో ఉన్న నాకు ఒక అన్నయ్య ఒక మంచి మాటతో ఆ లోకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నా. “ఒరేయ్ సిస్టమ్ ఎవడైనా ఆపరేట్ చేస్తాడు దానికే నువ్వు పోటుగాడివని ఫీల్ ఐపోకు, నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకో అందులోనే అన్ని చేయోచ్చు, క్యాలెండర్స్, టేబుల్స్, గ్రాఫిక్స్ వర్క్, ఇంకా చాలా చెప్పాడు.. ఇక దానిపై పడింది నా కన్ను. C Language ప్రోగ్రామ్ నీ నెట్ లో సెర్చ్ చేసి నేర్చుకున్నా, నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరిగాయ్ ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి 5 Programming Languages నేర్చుకున్నా.

unnamed (1)

 

అందరూ ఇంటర్ లో చదవడానికే అవస్థలు పడుతుంటే నేను చిన్న చిన్న వెబ్ అప్లికేషన్స్ చేసేవాడిని అలా స్టార్ట్ అయ్యింది Huzza.in అనే Web App. దీనిని నా ఇంటర్ సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ చేశా. అప్పట్లో way2sms వెబ్ సైట్లో 25 మెసేజెస్ వెళ్ళేవి కాని నేను మాత్రం 100మెసేజెస్ ఇచ్చేవాడిని, అది చాలామందికి చాలా చాలా నచ్చేసింది. మంచి బిజినెస్ నుండి వచ్చిన డబ్బుతో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉండగానే R-Technologies అనే సాఫ్ట్ వేర్ సంస్థను స్టార్ట్ చేశా. స్టార్టింగ్ అందరూ నన్ను బచ్చాగాడిని చూసినట్టు చూశారు కాని ఇప్పటివరకు 3000+కస్టమర్స్ కు నమ్మకం కలిగించాను.

unnamed

 

నా వ్యక్తిత్వం నచ్చి నా మాటలు వినడానికి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ లు పిలిచి వారి స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ ఎలా చేయాలో గైడెన్స్ ఇవ్వమనే వారు. R-Coaching అనే సంస్థను స్టార్ట్ చేసి 7ఇంజనీరింగ్ కాలేజెస్ ని గైడ్ చేస్తున్నా. ఇంకా వారికి సరైన మెటీరియల్ లేకపోవడంతో html5, css3, php5, java script, mysqldatabase లాంటి Programming Languages తో పాటు వారిని Complete Guide చేస్తూ “We Are In Project” అనే బుక్ రాశా అది చాలా పాపులర్ అయ్యింది లేండి.

unnamed (3)

 

సమయం చాలా విలువైనది దానిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తే అది రేపు మన సుఖానికి కారణం అవుతుంది.. అందుకే ఒక పక్క సాఫ్ట్ వేర్ కంపెనీని రన్ చేస్తూనే ఇంకో పక్క In30mins అనే ఫుడ్ డెలవరి కంపెనీని కూడా స్టార్ట్ చేశా. ఇది ఇప్పుడు ఏలూరుకు మాత్రమే పరిమితం అయ్యింది కాని ఇంకా 30రోజుల్లో హైదరాబాద్ తో సహా ఇంకొన్ని సిటీలకు విస్తరించాలనే ప్లాన్ లో ఉన్నా. చివరిగా నాదొక చిన్న మాట నేను ఒక రైతు కొడుకుని, మాది ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలి, నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ఈ మాట చెబుతున్నాను “నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి నా దగ్గర డబ్బులు లేవు.. ఒకవేళ ఉంటేనా అది చేసే వాడిని ఇది చేసే వాడిని అని మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి, ఒక్క రూపాయి పెట్టినా కాని మీలో దమ్ము, టాలెంట్ ఉంటే సక్సెస్ అవ్వగలరు.. ఒక్కసారి ఆలోచించండి.

13882160_1345520265462198_7410244012949912888_n

 

14470491_1394514063896151_2684748914807439482_n

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,