This Company Will Deliver Your Favourite ‘Godavari Foods’ To Any District In Telugu States

 

2012వ సంవత్సరం రాత్రి 9గంటలకు..
స్లవ్, లండన్, యునైటెడ్ కింగ్ డమ్..
ఇంట్లో లోవరాజ్ గారు ఒక్కరే ఉన్నారు..
విలేజ్ దుకాణ్.. విలేజ్ దుకాణ్.. అని గట్టిగా పలుకుతున్నాడు..
ఈ పేరు ఎలా ఉంటుంది.? ప్రజలు దీన్ని విన్న వెంటనే ఎలా రియాక్ట్ అవుతారు.? కష్టమర్స్ నన్ను తిట్టయైన కంపనీలో చెంజెస్ చెయ్యమని చెప్పాలి కానీ ఏ ఒక్కరూ విడిచివెళ్ళకూడదు.. ఇవ్వే ఆలోచనలు..

ఇలా ఒక్కరోజు కాదు.. కేవలం “పేరు” ఏది పెడితే బాగుంటుందని రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేశారు.. తల్లి తన బిడ్డను 9నెలలు మొస్తే, లోవరాజ్ గారు విలేజ్ దుకాణ్ లాంచ్ కు ముందు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు.. ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలని తల్లి ఎలా కోరుకుందో, ఈ కంపెనీ పది మందికి ఉపయోగపడాలని లోవరాజ్ గారు శ్రమించారు. ఇది కొత్త కాన్సెప్ట్ కూడా కాదు పాతదే “రైతుల దగ్గర, ఉత్పత్తిదారుల దగ్గర కొన్న పంటను నేరుగా కస్టమర్ కు అమ్మడం” అంతే!! ఊళ్ళో చాలా బుక్ స్టాల్స్ ఉంటాయి, మనం మాత్రం ఒక్క బుక్ షాప్ లోనే పుస్తకాలను కొనడానికి ఇష్టపడుతుంటాము ఎందుకంటే అది వ్యాపారంలా కాదు ఇల్లులా, మనింటి మనుషులులా ఉంటారని. లోవరాజు గారి విలేజ్ దుకాణ్ కూడా అంతే ప్రజల మనసుల్లో ఉండాలని తపించారు.. 2017లో 40 ప్రోడక్ట్స్ అమ్మడం ద్వారా మొదలైన వారి జర్నీ ఇప్పుడు దాదాపు 1,400 వందల ప్రోడోక్ట్స్ అమ్మేంతలా ఎదిగారు..


 

ఒక్క కుటుంబం ఆత్మహత్య కదిలించింది:

లోవరాజ్ గారిది రాజమండ్రి. తను పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. కారణం పై చదువులు చదవలేకపోతున్నామని పిల్లలు, చదివించలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన ఇప్పటి లోవరాజ్ గారి ఎదుగుదలకు కారణం. అప్పుడే అనుకున్నారు “పెద్దయ్యాక ఒక కంపెనీ పెట్టాలి, అందులో చాలామందికి ఉద్యోగమివ్వాలి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి సహాయం చెయ్యాలని తనతో తాను మాట్లాడుకునేవారు. జీవితం సాగిపోతూ ఉంది.. 2007-08లో మరో సంఘటన “అప్పుల బాధలు తాళలేక రైతుల ఆత్మహత్యలు”.. ఇది కూడా లోవరాజు గారి మీద తీవ్ర ప్రభావం చూపించాయి.. డబ్బులు ఇస్తే మరొకరి మీద డిపెండ్ అవుతారు, డబ్బులు సంపాదించుకొనే అవకాశం ఇవ్వాలని ఈ రెండు సంఘటనలే ప్రేరణగా అటు ఉద్యోగమిచ్చి, ఇటు రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంగా విలేజ్ దుకాణ్ అవతరించింది.


 

మన ఊరు, మన వంటలు:

చంద్రవరంలో స్వచ్ఛమైన బెల్లం పానకం దొరుకుతుంది, గోకవరంలో చింతపండు సగ్గుబియ్యం, తాటి బెల్లం కోసం ఉనగట్ల, పూతరేకుల కోసం ఆత్రేయపురం ఇలా బియ్యం కోసం ఒకఊరు, మామిడి తాండ్ర, పాలకోవ, వడియాలు, అప్పడాలు, పప్పులు, మిల్లెట్స్, పట్టుతేనే.. ఇలా చెప్పుకుంటూ పొతే 1,400 వందల ఆహారపదార్ధాలు.. ఏ ఊరులో ఎలాంటి పదార్ధాలు దొరుకుతాయి.? వాటిని వాళ్ళు ఎలా తయారుచేస్తారు.? పెట్టుబడి ఖర్చు ఎంతపెడుతున్నారు.? లాభం ఎంత వస్తుంది.? మార్కెట్ విస్తరించి వారి ఆదాయం ఎలా పెంచవచ్చు.? తదితర అంశాలన్నింటిని లోవరాజ్ గారు క్షుణ్ణంగా రీసెర్చ్ చేశారు.. బిజినెస్ చేస్తున్నాను అని కాదు, ఈ బిజినెస్ వల్ల రైతుల ఆదాయాన్ని ఎలా పెంచవచ్చనే ఆయన తపన.. 

జాబ్ లండన్ లో, సంస్థ ఇండియాలో:

లండన్ లో ఉద్యోగం చేసుకుంటూ విలేజ్ దుకాణ్ కాన్సెప్ట్ గురుంచి భార్య దగ్గరి నుండి మిత్రుల వరకు అందరితో డిస్కస్ చేశారు కానీ కొందరు ప్రేమతో మరికొందరు చులకనతో ఇది వర్కౌట్ కాదనే చెప్పేవారు. అందుకే ఇప్పుడు ఎవరైనా లోవరాజ్ గారు విలేజ్ దుకాణ్ జర్నీ గురుంచి చెప్పండనంటే నోటిలో నుండి మాటలతో పాటు, గుండెలో నుండి కన్నీరు కూడా ఉబికి వస్తూ ఉంటుంది. ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు జాబ్, మిగిలిన టైమ్ అంతా విలేజ్ దుకాణ్ కోసమే. లండన్ లో ఉదయం 4గంటలకే లేస్తారు, అప్పుడు ఇండియాలో ఉదయం 10 అవుతుంది. నిన్న వెబ్ సైట్ లో ఆర్డర్ పెట్టిన వారికి ఆయనే స్వయంగా కాల్ చేసి ప్రోడక్ట్స్ గురుంచి వివరించి, ఇంకేమైనా చెంజెస్ చెయ్యాలా.? ప్రోడక్ట్స్ ఫీడ్ బ్యాక్ గురుంచిన వివరాలు కనుక్కుంటారు.. మళ్ళీ సాయంత్రం రాగానే రైతులతో, తన ఉద్యోగస్థులతో మాట్లాడి బెటర్మెంట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. 

ఒకరోజు రెగ్యులర్ గా వస్తున్నట్టుగానే ఇండియాకు వచ్చి ఆత్రేయపురం వెళ్లారు.. పూతరేకులు తయారుచేస్తున్న మహిళ దగ్గరకు వెళ్లి విలేజ్ దుకాణ్ గురుంచి, ఇంకా అందులో అమ్మడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని వివరించారు దానికి ఆమె ఒక్క క్షణం సంతోషం, మరో క్షణం భయంలోకి వెళ్లిపోయారు.. “బాబు మేము తయారుచేసిన పూతరేకులన్నీ ఒక్క వ్యక్తి(దళారి) కే అమ్ముతుంటాం, ఇప్పుడు మీకు ఇస్తే ఆ దళారి మా మీద పగ పెంచుకుంటారు బాబు..” “అమ్మా.. అతని అవసరం మీకు లేదు, అతనికే మీరు అవసరం” తయారుచేస్తున్నది మీరు ధర నిర్ణయం, ఎవరికి అమ్మాలో మీ ఇష్టం.. ఇలా ఒక్క చోట అని కాదు ఒక చీర నేసే నేత కార్మికుడి దగ్గర రూ.500కు కొని షాపింగ్ మాల్స్ లో రూ.2000కు అమ్ముకుంటున్నారు.. అదేమంటే ఇది మా తెలివితేటలు, మార్కెటింగ్ స్ట్రాటజీ, ఉద్యోగస్తులకు శాలరీ రకరకాలుగా వర్ణించి మేము చేసిందే కరెక్ట్ అని నమ్మబలుకుతున్నారు. ఇవన్నీ తన రీసెర్చ్ లో తెలుసుకున్న లోవరాజ్ గారు 1400 వందల ప్రోడక్ట్స్ ను తయారుచేసే వ్యక్తులకు ఒక వేదికను ఏర్పాటుచేసుకుని అటు కస్టమర్ కు ఇటు ఉత్పత్తి దారుల అభ్యున్నతికి, తన దగ్గర పనిచేస్తున్న వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు.

Phone number: 0883-2431098
Local Website: VillageDukaan.com 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,