Meet ‘Veena Srivani’ – The Lady Who Mesmerised Us With Her Music At Agnyaathavaasi Audio Launch!

 

ఏడవ ఏట నుండే తను వీణ నేర్చుకోవటం ప్రారంభించింది, ఇప్పుడు తనదైన తరహా లో సినిమా బాణీలకు, క్లాసికల్ టచ్ ఇస్తూ వీణ తోనే వినసొంపయినా సంగీతాన్ని మనకి అందిస్తుంది. చీప్ థ్రిల్స్ అయినా, గేమ్ అఫ్ థ్రోన్స్ అయినా, మన పవన్ కళ్యాణ్ మాస్ బీట్ అయినా మనసుకి హత్తుకునేలా తన వీణా నైపుణ్యం తో మనల్ని మంత్రం ముగ్ధుల్ని చేస్తుంది. ఆమె అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లో మనకి ఒక కొత్త రకం అయినా ఫ్యూషన్ ని పరిచయం చేసిన “వీణా శ్రీవాణి“.


చిన్నతనం నుండే సంగీతం
తూర్పు గోదావరి జిల్లా నందుంపూడి లో శ్రీవాణి గారు జన్మించారు. చిన్నప్పటి నుండే ఆమె కు సంగీతం అంటే చాలా ఇష్టం. పి.సీతా మహాలక్ష్మి గారి దగ్గర ఆమె వీణ నేర్చుకున్నారు. రెండవ తరగతి చదువుతున్నప్పుడే స్టేజి షోలు చేసేవారు. సంగీతం లో ఆమె ప్రావిణ్యం చూసి అప్పుడే అందరు ఆశ్చర్యపోయేవారు. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా ఆమె తు చ తప్పకుండ నేర్చేసుకునే వారు. అలా ప్రారంభమయిన ఆమె వీణా మాధుర్య సెకం అంచెలంచెలుగా ఎదిగి ఇపుడు ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందే దాకా వెళ్ళింది.


వీణా పరిణయం
శ్రీవాణి గారు తను ఎంతగానో ప్రేమించే వీణ వల్లనే తన భర్త ను కలిశారు. ఆ పరిచయం పరిణయం దాకా వెళ్ళింది. ఒక విధంగా ఆ పరిణయం వల్లనే ఆమె గమనం మారింది. షోలకే పరిమితమయిన తన సంగీతాన్ని సోషల్ మీడియా కి తీసుకు వచ్చేలా చేసింది. తను చేసిన ఫ్యూషన్ వీడియోస్ అన్నిటిని ఫేస్ బుక్ లో పెట్టింది. మెల్లగా యూట్యూబ్ లోకి కూడా తన అడుగు వేసింది. ఆమె చేసిన చీప్ థ్రిల్ల వీణ వెర్షన్ ఎందరో శ్రోతలను ఆకట్టుకుంది. ఒకవైపు విమర్శలు వస్తున్న, తనదైన పాసిటివిటీ తో ముందుకి దూసుకుపోతుంది. ఇలా మరెన్నో గొప్ప ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నాం.


Check out here beautiful fusion of classical touch to Pawan Kalyan’s songs:


 

Click here to watch her OTHER CLASSIC FUSION COMPOSITIONS

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,