ప్రతి కళాకారుడు ఒక వానచినుకే – A Short Poem About Writer’s Intension

 

అంతులేని ఆకాశం లో ఒక చిన్ని మేఘం లో వేల నీటి చుక్కలం మేము..
చల్లని గాలి వీచింది.. చిన్న చిన్న వాన చినుకులుగా ఈ నేలపై కి వచ్చాం.
కొందరు ఎడారి లో పడి ఆవిరైపోతే..
కొందరు చెరువు గా మారి దాహం తీర్చారు.
కొందరు ఆణి లో పడి ముత్యాలైతే..
కొందరు తామరాకు పై నీటి బొట్టు గానే మిగిలిపోయారు.
కొందరు విత్తనాలపై పడి పంటను పండిస్తే..
కొందరు మహాసముద్రాన కలిసి పోయారు.
నేను మాత్రం నా లాంటి వానచినుకు తో
దాహం తీర్చుకునే చకోర పక్షి దాహం తీర్చాను తనని బతికించాను..
చకోర పక్షి లాంటి కళ కు ప్రతి కళాకారుడు వానచినుకే…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,