This Love Story Tells Us What The Real Worth Of Waiting Is

Contributed By Praveen Reddy Gaddam

సమయం : 9:00am, 22-03-2013

స్థలం. : 10th పరీక్ష సెంటర్

మొదటిసారి నేను ఆ అమ్మాయిని సెంటర్ లో చూసాను.. అక్కడే పరిచయం అయ్యింది

ఒకటే క్లాస్ లో ఇద్దరి సీటింగ్..

పేపర్స్ పాస్ చేసుకునేంత దగ్గర, పెన్ అని అడిగేంత మొహమాటం…మా ఇద్దరి మధ్య.

అలా పాస్ చేసుకుంటూ మాథ్స్ పేపర్-1 వరకి క్లోస్ అయ్యాం..

ఆ రోజు సెంటర్ కి వస్తున్న అంటే ఏదో తెలియని సంతోషం , ఆతృత..

అప్పుడంతగా సోషల్ మీడియా మీద దృష్టి లేని రోజులు అవి..నెంబర్ అడగలేకపోయా..

అడిగిన వల్ల అమ్మ నెంబర్ ఇచ్చేదేమో.. ఛా! ఆడిగుండాల్సింది అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం..

సబ్జెక్ట్ గురించి డిస్కషన్ కంటే నవ్వులే ఎక్కువుండేవి..మా మధ్య.

నవ్వుతూ ప్రతి పరీక్ష తనముందు పాస్ అయ్యాను..

ఆ రోజు లాస్ట్ ఎక్సమ్ అయిపోయింది.. అందరి కేరింతలు , సంతోషాల మద్య నేను ఇరుక్కపోయాను..

చూసేసారికి తను మాయం అయింది.. ఫ్లోర్ అంత వెతికను. బహుషా నేను కూడా కనిపించలేదు అనుకుంటా తనకి..

గ్రౌండ్లోకి వచ్చి చూసేసరికి , తను వాళ్ళ నాన్న బండి ఎక్కి కూర్చుంది.. తన చూపులు నన్ను వెతికాయి..

ఇద్దరం అలా చుసుకున్నాం కానీ bye చెప్పడానికి చేతులు రాలేదు..అసలు మనస్సు ఒప్పుకోలేదు తను అప్పుడే వెళ్తోంది అని..కాసేపు తనతో మాట్లాడి పర్ఫెక్ట్ bye చెపుతా అనుకున్న.

పరిగెత్తి తనని అందుకునే వేగం నాలో ఉన్న..అందుకోలేకపోయాను..

బండి గేటు దాటిన నా చూపు తనని దాటలేకపోయింది..

తను లోకల్.. నేను వేరే సిటీ.. తను బండి మీద వచ్చేది, నేను స్కూల్ బస్ లో వచ్చేవాన్ని..

ఎప్పటిలానే బస్ ఎక్కి వెళ్తుంటే, ఏదో ఆశ తను నాకోసం ఎక్కడో అక్కడ ఎదురుచూస్తది అని.. తన ఇల్లు కనిపిస్తదని..

హాస్టల్ నుంచి ఊర్లెళ్లిన నాకు ,ఆమె కలవరం..తనని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది..

పూర్తి పేరు తెలియదు, స్కూల్ పేరు అంతకంటే తెలియదు.. ఎక్కడుంటుందో దేవుడికే ఎరుక..

ఒక సవంత్సరం దాటినా మర్చిపోలేకపోయా..అప్పుడప్పుడు కార్ లో ఆ సిటీ నుంచి వెళ్తే గుర్తొచ్చేది. ఆ ప్రాంతపు మనుషులు కలిసిన అడిగేవాన్ని , పలానా వ్యక్తి తెలుసా అని.

చాలా ఏండ్లకి మళ్ళీ ఆ ఊరు వెళ్ళాను.. నా టెన్త్ క్లాస్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.. ఆ అమ్మాయి కూడా..

లాక్డౌన్ వల ఇంట్లో ఉండి ఉండి , దసరా సెలవులకు వెళ్ళాను.. అక్కడ దసరా బాగా జరుపుతారు అని విన్న.

సమయం : 6.40 pm , 25th అక్టోబర్ 2020

స్థలం. : ఐస్క్రీమ్ షాప్

ఆ రోజు ఊరంతా పండగ వాతావరణం లో ఉంది..నేను మెల్లిగా వెళ్ధంలే అని ఐస్క్రీమ్ షాప్ దగ్గర తింటూ నిల్చున్న

అప్పుడు అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆశ్చర్యం నుంచి ఆనందం..

ఎలా ఐతే చిన్నపుడు సెంటర్ కి వెళ్తుంటే కలిగిన ఆనందం మళ్ళీ తనని చూసిన్నపుడు కలిగింది..

అవును తను వచ్చింది ఈసారి.. అతను ఇక్కడే ఉన్నడు వెళ్లి కలువు అని ఎవరో పంపించినట్టు వచ్చింది..

తను కూడా షాక్ లొనే ఉంది.. తరువాత ఆనందంగా మారింది..

నా దగ్గరికి వచ్చి,నేను ఇన్నాళ్లు గుర్తురాలేద..నన్ను వెతకలనిపించలేద అన్నట్టు తన చూపులు,నన్ను గుచ్చుకున్నాయి.

అక్కడ్నుంచి మా ముచ్చట్లు ఇంకా ఆగలేదు..మా ఆనందానికి అవధుల్లేవ్..ఇద్దరం కలిసి గ్రౌండ్ కి వెళ్ళాం.

చుట్టూ వందలాది జనం, అందులో మేమె స్పెషల్ అనిపించింది.. రావనసూరిడీని కాల్చే వెలుగు లో తను చాలా అందంగా ఉంది..

నా జీవితం లో అది మర్చిపోలేని రోజు..

ఏడేళ్లు పట్టింది..తన టెన్త్ మార్క్స్ తెలుసుకోవడానికి..

ఇదే నాతో విధి ఆడిన ఓపిక నాటకం.కలుస్తాం అని గట్టి సంకల్పంతో ఉన్న నన్ను,విధి గెలిపించింది.

మేము గెలిచాం

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,