This Mother’s Day, Do Your Bit To Tell Your Mother How Much You Love Her!

 

Mother’s Day వచ్చిందంటే చాలు అందరికి అమ్మ ఒక దేవతలా కనిపిస్తుంది. నిస్వార్ధంగా సంవత్సరం అంతా చేసే సేవకు మనం కేవలం ఒకరోజు మాత్రమె సంతోష పెట్టి, సేవ చేస్తే సరిపోతుందా? ఈ భూమి మీద మనం బ్రతికేందుకు అవకాశం ఇచ్చి.. మన బాధలో ఆనందంలో మనకంటు ఎప్పటికి ఒక తోడు ఉండే కన్నతల్లిని సంవత్సరం అంతా ఎలా మన ప్రేమను చూపించాలి అన్నదే ఈ ప్రయత్నం…
 

పనిలో Help: మనకు ఒక్క పనే కావచ్చు కాని అమ్మకు అందరి పనులు తన పనులె.. ప్రతిరోజు మన అనవసర పనులు తగ్గించుకొని కనీసం ఒక 1Hour అమ్మ పనులకు సాయం అందించిన లేదా మన Clothes గాని మనం తిన్న Plates గాని Clean చేసిన కూడా అమ్మకు ఎంతో కొంత పనితగ్గుద్ది.
 
6
 

మనసారా నవ్వించుదాం:
నిన్న మొన్న వచ్చిన పాప కోసం Impress చేయడానికి రకరకాల జోక్స్ చెబుతుంటాం కాని మన నవ్వు కోసం తన జీవితాన్నే త్యాగం చేసే అమ్మకు తన Daily Tensions నుండి Relief కోసం ఆరోగ్యం కోసం ఇక నుండి ప్రతిరోజు అమ్మను మనసారా నవ్వించుదాం..
 
5
 
Surprise Gift :
Mother’s Day ఒక్కరోజే Gifts లాంటి Cake Cuttings, Restaurant లో Treat లాంటి One day Programs కాకుండా Every Week కాని కనీసం Every Month అయినా ఒక మంచి సినిమాకో, మంచి హోటల్ లో భోజనానికో ఇలాంటి ఆహ్లాదాన్ని ఇచ్చే Programsలను అమ్మకు అందించుదాం.
 
4
 
అమ్మ ఆరోగ్యం:
అమ్మకు B.P, Sugar లాంటి ఆరోగ్య సమస్యలు కాని ఉంటే ఆ Tablets Name తో పాటు ఎంత డోస్ అనే విషయాలు తెలుసుకోవాలి. మనం కడుపులో ఎలా ఉంటామో తెలియని నాటినుండే మన ఆరోగ్యం గురుంచి ప్రాణంలా తపన పడుతుంది అలాంటి అమ్మ ఆరోగ్యం గురుంచి జాగ్రత్త వహించడం మన కనీస భాద్యత అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మన ఎదుగుదలను పరిపూర్ణంగా ఆనందించగలరు..
 
3
 
ఫోన్ లిఫ్ట్ చేయడం, కాల్ చేయడం మనోద్దు:
మనకు సవాలక్ష పనులు కావచ్చు, మనకు మన లక్ష్యమే లోకం కావచ్చు కాని అమ్మకు మనమే లోకం. మనం ఎక్కడ ఉన్నా ఎంతటి బిజి పనులలో ఉన్నా కనీసం రోజుకు రెండు సార్లు అయినా కాల్ చేసి మనస్పూర్తిగా మాట్లాడుదాం..
 
2
 
అమ్మనే ముందు:
Friends పోతే Friends వస్తారు Girl Friend/Boy Friend ఐనా అంతే కాని అమ్మ పోతే ఇంకో అమ్మ రాదు.. మనం ఏదైనా తెలియక తప్పుచేస్తే అపార్ధం చేసుకొని మనల్ని ఎవ్వరు అయినా ఒదిలేస్తారు కాని అమ్మ మాత్రం మనల్ని మంచి మనిషిగా మార్చడానికే శ్రమిస్తుంది.. మనకు ఇంతటి జ్ఞాణం తెలివితేటలు ఉండటానికి మెదటి కారణం అమ్మ.. అలాంటి అమ్మ మాటకే ముందు Priority ఇచ్చి గౌరవిద్దాం..
 
1
 
ఒక్క జన్మకు ఒక్కతే తల్లి ఒక్కడే తండ్రి మన చిరునవ్వు వెనుక ఉన్న బాధను, మన కోపం వెనుక ఉన్న ప్రేమను, మన మౌనం వెనుక దాగున్న సంద్రపు అలల హోరును మొదటిసారి అర్ధం చేసుకొని మనలను మంచి పౌరులుగా తీర్చిదితుంది అమ్మ.. లక్షరకాల చిత్రహింసలు పెట్టినా మన కంట్లో చిన్న నలక కూడా పడొద్దు అని కోరుకుంటుంది అమ్మ.. అలాంటి అమ్మను సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలా ఒకరోజు దేవతను చేయకూండా అమ్మ మనకు చేసే సేవలో కనీసం కొంతయినా సేవచేసి తన మీదున్న ప్రేమను తెలుపుదాం..
 

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,