What If Theatre Lover Kowshick Gave A Monologue To OTT Lover Kaushik

మొత్తానికి థియేటర్లు  స్టార్ట్  అయ్యాయి , కొత్త  సినిమాలు , నిజమైన  FDFS షోలు  , మళ్లీ సంబరాలు  స్టార్ట్  అయిపోతున్నాయ్ . వెండితెర ప్రేమికులకు పండగ అనుకునే లోపు , ఈ ప్రైమ్ ఇంకా నెట్ఫ్లిక్  బ్యాచ్ అతి తెలివితో నోటికొచ్చిన విమర్శలు సలహాలు మొదలుపెట్టేసారు.బ్యాచిలర్  రూమ్ అన్నాక చర్చలకు కరువే లేదు.ఒకడు వెండితెర అభిమాని అయితే ఇంకొకడు ఈ OTT ప్రియుడు. కానీ అహకారం తో ఎగిరిన OTT అన్నగారికి తప్పలేదు బారి మూల్యం.ఒక సినిమా ప్రేమికుడిగా సాటి వెండితెర అభిమాన బాధ కి కనెక్ట్ అవ్వక తప్పదు , అసలా ఆ చర్చ , వాడి బాధ ఏంటో తెలిపే చిన్ని సంభాషణ.

OTT  ప్రియుడిగా పెళ్లి చూపులు కౌషిక్ (Kaushik)

వెండితెర ప్రేమికుడిగా ఈ నగరానికి ఏమైంది కౌషిక్ (Kowshick)

Kaushik: సిగ్గు  లేదు , బాధ్యత లేదు, అసలా అలా ఎలా వెళ్తావ్ రా థియేటర్ కి అన్ని సార్లు మీడియా , ప్రభుత్వాలు మొత్తుకుంటుంటే ? ఓపెన్ చేసిన వాళ్ళకి బుద్ధి లేకపోయినా , వెళ్దాం అనుకునే నీకు ఉండాల్సిన పని లేదా?

Kowshick: నువ్వు  ఆర్డర్ చేసుకున్న  బిర్యానీ ఎక్కడిదిరా  ?

Kaushik: బావార్చి రా , నీకు కూడా తెప్పియమంటావా ?

Kowshick: నిన్న  నీ పోరి  నువ్వు  ఊపుకుంటూ  వెళ్ళింది  కేబుల్  బ్రిడ్జి కేనా  ?

Kaushik: అవును అయితే ఏంది వెళ్లదా నేను అక్కడికి  ?

Kowshick: అవును  నిన్న  మీ బాబాయ్ ఎలక్షన్  ర్యాలీ కదా ,  వెళ్లావా ?

Kaushik: వెళ్లకపోతే  ఎలా మామ , బాబాయ్ కదా  ?

Kowshick: మరి సినిమాకి  ఏమైంది  రా ?

Kaushik: ఏయ్  ఉకో మచ్చా! అది  ఇది  ఒకటేనా  చెప్పు  ? తొక్కలో  సినిమా  కోసం  థియేటర్  దాకా వెళ్లాలా ? మంచిగా  ఇంట్లో  కూర్చుని  ప్రైమ్ లో  చూసేదానికి , సుబ్స్క్రిప్షన్  లేదా ? मैं हूँ ना , అసలా  ఆ  గోల ,చిరాకు,టికెట్ ,చీకటి  మన  వల్ల కాదురా  బాబు .

Kowshick: ఏమన్నావ్ రా  తొక్కలో  సినిమా  నా? 70mm ఫీల్  చిరాకా ? ప్రశాంతంగా  ఇంట్లో  కూర్చుని , అప్పుడపుడు అక్కడికి ,ఇక్కడికి  కదులుతూ  సినిమాలు  చూసే  నువ్వు  మాట్లాడుతున్నవారా? బారెడు  పొట్ట  ఏస్కోని  సబ్స్క్రిప్షన్ ఉందనే  అహంకారం  తో  నువ్వు  మాట్లాడుతున్నవారా?ఈరోజు  70mm బొమ్మ  లో  ఉండే ఆనందం , దానికి మేము పడే ఇష్టమైన కష్టాలు చెప్తా, నువ్వు విను , విను

ఏళ్ళు ,ఏళ్ళు  మా  హీరో  సినిమా  లుక్స్ , టీజర్స్ , ట్రైలర్స్  కోసం  ఎదురుచూస్తూ , వచ్చినపుడల్లా  షేర్లు  కొట్టుకుంటూ  సంవత్సరానికి ఒక  సినిమా  కూడా  రిలీజ్  కాకా ,ఆఖరికి  రిలీజ్  అయినపుడు  మేము చేస్కునే  పండగ  ఎలా  ఉంటదో తెలుసా ?

ఆఖరికి  వచ్చే  టైం  కి  థియేటర్లు  మూసేస్తే  కలిగె బాధ  నీకు  తెలుసా ? నాకు తెలుసు.ఒక  మంచి  సినిమా  థియేటర్  లో  రిలీజ్  అయ్యే  అవకాశం  లేక  OTT లో  రిలీజ్  అయ్యి , ఆ  బొంగు  మామ  అని  జనాలు  తీసిపారేస్తుంటే  కలిగె  బాధ  ఎలా  ఉంటదో తెలుసా ? నాకు తెలుసు.

మొత్తం  వారమంతా  టెన్షన్ లో  ఉండి ,  మనకి  నచ్చిన  సినిమాకి  వెళ్లి ఆ  టెన్షన్స్ అన్ని  మర్చిపోయి సినిమా  ఎంజాయ్  చేస్తే బుర్ర  ఎంత  తేలికగా  ఉంటదో  నీకు  తెలుసా? నాకు తెలుసు.

మెగాస్టార్  రిఫరెన్స్  సినిమాలో  ఉండి OTT లో  చూస్తూ  ఒక  ఈల వేయలేకపోడం , ఒక  డాన్స్  చేయలేకపోడం  ఎంత  బాధో  నీకు  తెలుసా? నాకు తెలుసు

ఎప్పుడైనా FDFS టిక్కెట్లు  చేతిలో  ఉంటె ఆ గర్వం ఎలా ఉంటాడో తెలుసా ? అసలా అప్పుడు కలిగె ఆనందం ఎలా ఉంటదో తెలుసా ? సంధ్యాలో బెనిఫిట్  షో  కి  పడే  కాగితాల బస్తాల  విలువ  తెలుసా  నీకు ?

ఇంటర్వెల్ లో  50 రూపాయల  పెట్టి  ఒక  కోక్ , 20 రూపాయల  సమోసా  తింటూ సినిమా  ఎంజాయ్  చేయడం  నీకు  తెలుసా ? నాకు  తెలుసు ,సినిమా  అయినాక  నలుగురితో  కలిసి  నవ్వుతు  మాట్లాడుకోడం తెలుసా ?

మనం  సినిమా  కి  పని  చేసిన  , మనకి  తెలిసిన  వాళ్ళు  ఆ  సినిమా  వెనక  ఉన్నా,వాళ్ల పేరు తెర  మీద  చూస్తున్నప్పుడు వచ్చే  గర్వం  తెలుసా ? అది  ఇచ్చే  ఆనందం తెలుసా ? నాకు  తెలుసు.

కాలు చాపుకుని  ఎప్పుడంటే  అప్పుడు లేచి  నీకు  వీలు  కుదిరిన  టైం  లో  టి.వి  లోనో  మొబైల్  లోనో  సినిమా  చూసే  నీకు  థియేటర్  గురించి  మాట్లాడే  అర్హత  లేదు.

సినిమా  చూడాలంటే  ప్రైమ్  వైపో  నెట్ఫ్లిక్  వైపో  మాత్రమే  చూడాలి , 70mm ఎక్స్పీరియన్స్  కోసం  ఇంకెన్నాళ్లు   ఎదురుచూడాలనే  ఆలోచన  ఎంత  బరువైనదో  తెలుసా ?

థియేటర్  కోసమే  తీసే  కొన్ని  సినిమాలు  ఉంటాయని ,  అవి  OTT లో  పెట్టి  ఆ  అనుభవం  కళ్లారా  నాశనం అవుతుంటే , కనపడని  కోపం , అరవలేని ఆవేశం  ఎవడి  మీద  చూపించాలో  తెలీదు.

ఒకడు  పార్టీ  అంటాడు  , ఇంకొకడు  పబ్  అంటాడు, ఒక  ఇంట్రోవ్ర్ట్ కి  సినిమా  ఇచ్చే  కౌగిలి  బలం  నీకు తెలుసా ? నాకు  తెలుసు.

థియేటర్  లోకి  వెళ్ళాక  మేనేజర్  ఉండడు , జీవితం లో ఉన్న  అప్పులు  ,EMI  లు  గుర్తురావు  , గర్ల్/బాయ్  ఫ్రెండ్  తో  అయిన  గొడవలు  ఉండవు ,  అసలు  ఎవరికి తెలుసు , చూసే  సినిమా దానితో కనెక్ట్ అయ్యి వచ్చే ఆలోచనల వల్ల ఎన్ని గొడవలకి సమాధానాలు దొరికాయో. అలాంటి  థియేటర్ ని విమర్శించే అర్హత  ఉందారా  నీకు ?

ఇన్ని సంతోషాలు ఉన్నా కానీ , ప్రైమ్  లో  ఒచ్చేస్తది మామ  నెలలో  చూసేయచ్చు  , ఇప్పుడు వెళ్లి  పైసల్  బొక్క  అని  చెప్పి నిరుత్సాహపరుస్తున్న , ఎదవ  సలహాల ఇచ్చిన వాటి  మధ్య  బ్రతకడం  అలవాటు అయిపొయింది.చాలా రోజుల తరువాత  థియేటర్లు  ఓపెన్  అవుతున్నాయి  అని  ఆనందపడాలో  , నీలాంటి  వాళ్ళు  ఇలా  మాట్లాడుతున్నారు  అని  ఏడ్వాలో   ఎప్పటికి అర్థంకాదు.

కానీ ఒకటి గుర్తుపెట్టుకో , ఎప్పటికైనా  నువ్వు  నీ  దోస్తులతో  కలిసి  వెళ్లిన  సినిమా నే ఎక్కువ  ఆనందాన్ని ఇస్తుంది , అలానే అదే ఎప్పటికి ఒక బెస్ట్ జ్ఞాపకంగా గుర్తుంటుంది, అదే ఒక్కడివే  రూమ్ లో  సినిమా చూసేసి , పిచ్చ లైట్  మామ  పర్లే ఒకసారి చూడచ్చు  అని తేలికగా చెప్పేసిన , ఆ అనుభవం ఆ రాత్రి వరకే పరిమితం.

మన  దేశంలో  కుల,మత,ప్రాంతీయ  బేధాలు  లేకుండా  స్వచ్చంగా  ప్రేమించేది  రెండే.ఒకటి  సినిమా ,రెండు  క్రికెట్  దయ  చేసి  కలిసి  వెళ్దాం, కలిసి చూద్దాం, ఆ అనుభవం,ఆ జ్ఞాపకాలు 70mm కె ఉంచుకుందాం.పైసలు  ఇస్తున్నారు  కదా  అని  సినిమాలని  అమ్మిపడి దొబ్బితే  రేపు  అంబానీ  అనుకుంటేనే  సినిమా  హిట్ అయితది  , కార్పొరేట్ తో  కలిసి  కల్మషం  కానీ   ఇండస్ట్రీ  ఏదిరా ?ఇన్ని  రోజులు  మనకి సినిమా  మీదున్న  పిచ్చి  తెలిసేది ,  కానీ ఇన్ని రోజుల గ్యాప్ తరువాత  దాని  వెనకున్న  స్వచ్ఛమైన  ప్రేమ కనిపించింది.

కొత్త రకం సినిమాలు ,  ప్రపంచ సినిమా చూసి నేర్చుకోడానికి  OTT  ని  వాడదాం  తప్పు  లేదు  కానీ  దయచేసి  మనం వెళ్లే సినిమాలని దాంట్లో చూడడం అలవాటు చేసుకుని వెండితెర ని  చంపద్దు, సమూహంగా చూస్తూ ఆనందించగల మిగిలిన ఏకైక మాధ్యమం సినిమా మాత్రమే.దాన్ని కాపాడుకోడం మనందరి బాధ్యత.

Kaushik: సరే కానీ.. చివరగా ఏమంటావ్ ఇంతకీ

Kowshick: నీ ఫేమస్ డైలాగ్ ఉంది గా అదే…

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,