20 Songs That Prove Ramajogayya Sastry Garu Is One Of The Finest Lyricist We Have

 

సినీ గేయ రచయితలకి తమలోని ప్రతిభని పూర్తి స్థాయి లో ఆవిష్కరించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది . ఆలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయే సాహిత్యాన్ని అందించిన గేయ రచయితలు ఎందరో . ఆ కోవకే చెందినవారు రామజోగయ్య శాస్త్రి గారు . కేవలం ఒక రకమైన పాటలకి మాత్రమే ఆనేముద్ర పడిపోకుండా భక్తి గీతాల నుండి ఐటెం సాంగ్స్ వరకు . ప్రణయ గీతాల నుండి విరహ వేదనల వరకు ఆయన రాయని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు . సిరివెన్నల సీతారామశాస్త్రి గారి శిష్యుడిగా తన ప్రయాణం మొదలెట్టి ఈ రోజు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు . రామజోగయ్య శాస్త్రి గారి రాసిన ఎన్నో పాటల్లోంచి ఎప్పటికి మన మనస్సులో నిలిచిపోయే కొన్నిటిని ఇక్కడ జత పరుస్తున్నాం . మీరు కూడా నచ్చిన పాటను కామెంట్ల ద్వారా పంచుకోవచ్చు..

 

1. శివతత్వాలను సులభంగా తెలిపే గీతం – సదాశివా సన్యాసి – ఖలేజా
ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ
చుట్టుపక్కల చీకటి పెల్లగించగా అడుగేసాడంటా కాచే దొరలాగా


 

2. జీవిత పరమార్థం స్మూక్షంగా – ఒకే ఒక్క జీవితం – Mr. నూకయ్య
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే , బ్రతుకు అనే మార్గములో తనతోడెవరూ నడవరులే
చీకటిలో నిశిరాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే నీవారు అనువారెవరూ లేరంటు నమ్మితే మంచిదిలే


 

3. కృష్ణావతార వైభవం తెలిపే పాట /కీర్తన – తప్పట్లోయ్ తాళాలోయ్ – శుభప్రదం
నలుదిక్కుల చీకటినంతా తన మేనిలో దాచిన వింత
తగు విందుగ వెలుగులు చిందెను మా కన్నుల్లో


 

4. ఎవరూ లేని వ్యక్తి జీవితాన్ని వివరిస్తూ . – అమ్మా లేదు నాన్నా లేడు – ఏక్ నిరంజన్
రోజంతా నాతో నేనే కల్లోనూ నేనే లే
తెల్లారితే మళ్ళీ నేనే తేడా లేనే లేదసలే


 

5. ఓ అమ్మాయి విరహ వేదన – అటు నువ్వే ఇటు నువ్వే – కరెంట్
అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపినినాకు రుచిచూపావులే
పరిచయమంతా గతమేనా గుర్తుకురానా క్షణమైనా ఎదురుగ ఉన్నా నిజమే కానీ కలవైనావులే


 

6. ప్రేమికుల ప్రేమ గీతం – నువ్వక్కడుండి నేనిక్కడుంటే – గోపి గోపిక గోదావరి
సరిగమలే వర్ణాలుగా కలగలిసే కంటి పరదా నీ బొమ్మగా కలలొలికే
వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా తెనుగులా జానా వెలుగులా


 

7. ప్రియురాలి ని గురించి ప్రియుడి ఊసులు – ఎవ్వరి నువ్వు – రాజుభాయ్
ఎటు చూసినా ఎం చేసినా ఏ దారిలో అడుగేసినా నలువైపులా నాకెదురేఉందా మై
ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్న


 

8. ప్రయత్నిస్తే నీది కానిదేది లేదని స్ఫూర్తి నింపే పాట – పకడో పకడో – జులాయి
నిన్న నువ్వు మిస్సయింది పకడో రేపు నీకు ప్లస్సయ్యేది పకడో
గెలుపును మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూటు పకడో


 

9. అమ్మాయి ప్రేమ కోసం ప్రియుడి ఎదురుచూపులు – నీ చూపులే నా ఊపిరి – ఎందుకంటే ప్రేమంట
తదుపరి జన్మకైనా జాలి చూపే వీలుందంటే ఈ క్షణాన్నే ఊపిరాపానా


 

10. తండ్రికి కొడుకు వచ్చినందుకు , ఊరికి పండగ తీసుకొచ్చినందుకు ఆ ఆనందాన్ని ఇలా వర్ణించారు – పండగలా దిగివచ్చావు – మిర్చి
జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడూ ఈ ఊరి ఉయ్యాలా
నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేలా ఇయ్యాల


 

11. 27 ఏళ్ల ఓ నిరుద్యోగి భాద – Anthem of Unemployers – లక్కన్న మాటే నిల్లు నిల్లు -రఘువరన్ బి.టెక్
సిగ్గు శరమంతా గాల్లో గిరావేటేశా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా
నాలా నేనుంటే ఎవరికీ నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా


 

12. మనలోని మనిషిని మనకి పరిచయం చేసే పాట – ఇదేరా గెలుపంటే – ఎవడే సుబ్రహ్మణ్యం
ఎద సడిలో నిజముంది కను తడిలో నిజముంది అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో
నివేదించు ప్రాణం దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం


 

13. ప్రియురాలి జాడ కోసం శిఖరాలు సైతం అధిరోహించి ప్రియుడు చేసే సాహసాల నేపథ్యంలో వచ్చే పాట . తెలుగు సంస్కృత పదాలతో రామజోగయ్య గారు రాసిన చక్కని పాట – ధీవర – బాహుబలి
పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా
సిగముని విడిచిన శిఖరపు జలసిరి ధారాల్ని ఝాటాజూటంలా ఢీకొని
సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న


 

14. తనని కలుసుకోడానికి బయలుదేరిన కథానాయకుడిని గురించి అతని గమ్యం గురించి వివరిస్తూ – పోరా శ్రీమంతుడా – శ్రీమంతుడు
విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా
లేనిదేదో పనిలేనిదేదో విడమర్చి చూడగల ఋషిగణమా


 

15. కింద పడినా పోరాడాలి ప్రయాణం సాగించాలంటూ స్ఫూర్తి నింపే గీతం – Motivational Mantra For Many of Us – చల్ చలో చలో – సన్నాఫ్ సత్యమూర్తి
కన్నీలెందుకు ఉప్పుగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవు గనక
కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవ్ గనక


 

16. ప్రియుడి లోని గొప్పదనాలని గురించి ప్రేయసి వర్ణన – ఎందరో మహానుభావులు – భలే భలే మగాడివోయ్
స్వంతము స్వార్ధమే లేక తన వల్ల అందరూ సుఖించగా చూచి
బ్రహ్మానందము అనుభవించువాడు వాడందుకే నా ప్రేమ పాత్రుడు


 

17 . అప్పుడే ప్రేమలో పడిన యువకుడి భావాలు – క్రేజీ క్రేజీ ఫీలింగ్ – నేను శైలజ
నిన్న మొన్న దాకా సూపర్ ఉన్న ఫిగరే నిన్ను చేసినాక సో సో ఉందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయ్యేనట్టుందే

18 . మనసులు కలిసిన ఇద్దరు మనుషుల ఎదలోని భావేద్వేగాలు – ఓ మనసా రా ఇలా – ఒక మనసు
అవునంటూ కోరుతుంది వద్దంటూ ఆపుతుంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా
నువ్వెంత దూరముంటే నా శ్వాసే గింజుకుంది ఆ వేదనే నువ్వు పోల్చలేనిదా


 

19. ప్రకృతి అందాలని అందరూ వర్ణిస్తే ప్రకృతిలోని గొప్పదనాన్ని వివరించారు రామజోగయ్య గారు – ప్రణామం – జనతా గ్యారేజ్
నువ్వెంత నేనెంత రవ్వంతా ఎన్ని ఏళ్ళదీ సృష్టి చరితా
అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళ్దాం జన్మంతా

20. దేవదేవుని కల్యాణాన్ని అత్యద్భుతంగా వర్ణించారు రామజోగయ్య గారు
శతమానం భవతి – శతమానం భవతి

తను తన తాలిబొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యం ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ
ఇరుమనసులకొక తలపుగా కలగలిసిన ఒక తునువుకు శతమానం భవతి

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,