Meet Sharath, Whose National Level Registered NGO Is Working For The Needy Orphanages & Old-Age Homes

 

ముస్తఫా అనే అబ్బాయికి ఆరోగ్యం బాలేదు. కిడ్నీ Transplantation చెయ్యాలి లేదంటే బ్రతకడం కష్టం. పేదవారు.. బ్రతకడమే కష్టం ఇంకా బ్రతికించుకోవడమా.? ఈ విషయం శరత్ కు తెలిసింది. వెంటనే హాస్పిటల్, ఆపరేషన్ డిటైల్స్, పేషెంట్ కండిషన్ వివరిస్తూ KTRగారికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. వెంటనే రెస్పెండ్ అయ్యి 16,00,000 లక్షలు ఆపరేషన్ కోసం ఏర్పాటు చేశారు. శరత్ తెలియజేసిన సంఘటనలకు వివిధ సందర్బాల నుండి ఇప్పటివరకు వ్యక్తిగతంగా KTR గారు, ఇంకా CMRF తరుపున ఒక కోటి రూపాయల వరకు సహాయం అందింది. KTR గారు, శరత్ 4 సంవత్సరాల నుండి మాట్లాడుకుంటున్నారు. ఒకరిమీద మరొకరికి గౌరవం, నమ్మకం. వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కలిసారేమోనని అనుకుంటున్నారా అబ్బే అదేం లేదండి, కేవలం సోషల్ మీడియా ద్వారానే.. 2015 నుండి ఫేస్ బుక్ ద్వారా పరిచయం, 2017లో నుండి కేవలం వాట్సప్ ద్వారా పరిచయం. 

The Sahruday Foundation ఎలా మొదలైంది.?

శరత్ నాన్నగారికి రిసెషన్ లో జాబ్ పోయింది.. నాన్న నుండి ఇంతకుముందు సహాయం అందుకున్న బంధువులు ఎవ్వరూ అండగా నిలబడలేదు. ఒకసారి నాన్న చాలా దగ్గరి బంధువుల దగ్గరికి వెళ్లి సిగ్గు విడిచి కొంత అప్పు అడిగారు.. సరే!! నీకు ఇప్పుడు ఇస్తాను మరి నువ్వు ఎలా అప్పు తీర్చగలవు.? అని బంధువు నుండి కఠిన ప్రశ్నకు నాన్న తట్టుకోలేక అక్కడి నుండి బయటకు వచ్చేశారు. శరత్ కు అప్పుడు అనిపించింది “మనం ఒకరికి హెల్ప్ చేసే పొజీషన్ లో ఉండాలి తప్పా, హెల్ప్ తీసుకునే పొజీషన్ లో ఉండకూడదు అని“.. అనుకోవడమైతే అనుకున్నాడు కానీ అది అనుకున్నంత సులభం ఐతే కాలేదు. కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే హెల్ప్ చెయ్యాలనే ఆలోచన రావడం శరత్ వ్యక్తిత్వానికి ఉత్తమ ఉదాహరణ. ఆ టైంలో శరత్ చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు. మొదట్లోనే కాదు ఇప్పటికీ శరత్ తను జాబ్ చేసి సంపాదించిన జీతంలో ఎక్కువ శాతం సర్వీస్ కోసమే ఉపయోగిస్తుంటారు.
 

చదువుతూ చదివిస్తూ:

శరత్ చదువుకుంటున్న సమయంలోనే ఒక పాప బాధ్యతను తీసుకున్నాడు. పాప తండ్రి ఎలక్ట్రీషియన్, ఏదో రిపేర్ చేస్తూ కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. ఇంటి దగ్గర పాపను వదిలిపెట్టి తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్ని నెలలు కావస్తున్నా తను తిరిగిరాలేదు. రోజులు గడుస్తున్నాయి.. ఇలాగే కొనసాగితే పాప మానసిక ఎదుగుదలకు ఇబ్బంది కలుగుతుందని పాప బంధువులను అడిగాడు. “మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మేము ఆ పాపను చూసుకోలేమని చేతులెత్తేశారు“. ఆ తర్వాత శరత్ పాపను Adopt చేసుకున్నాడు. పాపను ప్రైవేట్ స్కూల్ లో జాయిన్ చేయించాడు, తనకు అవసరమయ్యే ప్రతి వస్తువును, బాధ్యతలను తనే చూసుకుంటున్నాడు ప్రస్తుతం పాప టెన్త్ క్లాస్ పూర్తిచేసింది. ఇలా చదువు విషయంలో మాత్రమే కాదు, మనిషిని మరో మెట్టుకు ఎక్కించడానికి ఏ సహాయం అవసరం అవుతుందో వాటన్నిటినీ సమకూర్చి పెడుతున్నాడు.
 

16 States, 14 Countries:

హెల్ప్ తీసుకునే పరిస్థితి నుండి హెల్ప్ చేసే పరిస్థితికి చేరిన శరత్ తన The Sahruday Foundation ఇప్పటికి దేశంలోని 16 రాష్ట్రాలు, 14 దేశాలకు విస్తరించాడు. మొత్తం 5వేల వాలంటీర్లలో ఎక్కువశాతం తెలుగువారే.. ఆ ప్రాంతాలలో తెలుగువారికి ఎలాంటి సహాయం అవసరం ఐనా సహృదయ్ ఫౌండేషన్ మిత్రులు చూసుకుంటారు. ప్రతీ వాలంటీర్ వారి సమయాన్ని, మేధస్సును, డబ్బును వెచ్చిస్తారు. ఫలానా కాలేజ్ ఫీజు కట్టాలన్నా, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కు డబ్బుకావలని ఎవరైనా అడిగితే ప్రత్యేకంగా నియమించిన వీరి టీం అక్కడికి చేరుకుని నిజనిర్ధారణ చేసుకుంటారు.

శరత్ కు మనుషులంటే కోపం రావాల్సిన సందర్భంలో ప్రేమ, జాలి కలిగింది. కుటుంబానికి అండగా నిలబడాల్సిన సమయంలో ఏకంగా సమాజానికి అండగా నిలబడ్డాడు.. ఒక వ్యక్తి గురుంచి మనకు ప్రతి ఒక్క విషయం తెలియాల్సిన అవసరం లేదు, అతని వ్యవహార శైలి మాటతీరు తెలిస్తే చాలు సహాయాలు చేస్తామంటూ ఎదురుగా వస్తుంటాయి..

For More Information: https://www.facebook.com/TheSahruday/
Phone: 733 077 4621

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , ,