This Conversation Between Two Youngsters Will Show You The Exact Reason Why We Need Patriotism Today!

 

ఫ్రెండ్ -1 : అరేయ్ మామ ! “My Experiments With Truth” అనే బుక్ చదివావా ?

ఫ్రెండ్-2 : ఏరా ! కొత్తగా నువ్వు ఏనా రాస్తున్నావా ఏంటి ? ఇదెప్పట్నుంచిరోయ్ !

ఫ్రెండ్ -1 : అరేయ్ ! అది గాంధీగారి ఆటోబయోగ్రఫీ రా !

ఫ్రెండ్-2 : అరేయ్ , నువ్వు మరీ ఇంత పాతకాలపు మనిషివేంట్రా !! ఇప్పుడేమో గాంధీగారు అంటున్నావ్ , మొన్న ఏమో ఎవడో జార్జిబుష్ అన్నావ్ !

ఫ్రెండ్-1 : మామ అతను జార్జిబుష్ కాదురా… నెల్సన్ మండేలా !

ఫ్రెండ్ : అదే ఎవడొకడు ! ఇప్పుడేంటి నా ***** ఎవడికి కావాలి ? నామటుకు నేను Big bang T.V. Series చూస్తుంటే , ఏంటీ నీ గోల ?

 

Cut చేస్తే …….

పైన చెప్పినట్టు ఒక situation తీసుకుంటే, ఒక వందమంది యువత లో మహా ఐతే ఐదుగురు మాత్రమే దేశం పట్ల అవగాహనా , గౌరవం , బాధ్యత తో ఉంటున్నారు . బాధ్యత అనే పేద్ద పదాలు ఎందుకులేండి ! పైన చెప్పిన చిన్న conversation చాలు గా అర్థంచేసుకోడానికి !అవును కాసేపు ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పేసుకుందాం . ఎందుకంటే , మనలో చాలామందికి Justin Bieber , Sunny leone తెలిసినంతగా మన దేశం గురించి కూసింతైనా తెలియదు . ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి . మనలో ఎంతమందికి “A Long Walk To Freedom” అనే Nelson Mandela గారి autobiography తెలుసు ? చాలామంది మొదటిసారి వింటుండచ్చు ఏమోకూడా .

ఈ విషయం లో అసలు మనది ఏ మాత్రం తప్పుకాదు . మనచేత చాలామంది తప్పులు చేయించేశారు . మొదటిది …………. స్కూల్ లో Independence Day నాడు , History లో చదువుకున్న గాంధీ , నెహ్రూ అని తెలిసిన పేర్లు చెప్పి , Flag Hoisting చేసేయడమే తప్ప , దేశం పట్ల మన కర్తవ్యం ఏంటి ?, మనం సమాజం లో ఎలా ఉండాలి అని ఏఒక్క ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పరు

రెండవది …… ……. మన తల్లిదండ్రులు ! అవును వారే ! ఎప్పుడు వీలైతే అప్పుడు “ఎప్పుడూ ఆటలు , సినిమాలు , గాలికి తిరగడాలు …. ….. పుస్తకం తీసి చదువుకోవచ్చు గా ” అని అంటారే తప్ప,
నెలకి ఒకసారైనా వాళ్ళకి చదువు కాకుండా వేరే స్పెషల్ టాలెంట్ కూడా ఉందా అని మాత్రం చూడరు . చదువు ఎంత important ఓ , మనలో దాగున్న talents కూడా అంతే important . 21 ఏళ్ళకి సింధు Gold Medal కొడితే , మనం College లో Class జరుగుతుండగా Cricbuzz లో scores check చేసుకుంటుంటాం . అదీ తేడా అంటే !

మూడవది …….. మీరు చదువుతున్న కాలేజీ . అందులో మీకు తోడైన ఫ్రెండ్స్ . ఇది పైన చెప్పిన లాంటి situation ఏ లేండి . మనం పుట్టడం పుట్టడం ఒక మంచి దేశం లో పుట్టేసాం . ఎదో Social Studies లో History లో చదువుకున్నది తప్ప ఇంకేమైనా తెలుసా ? ఇంకేమైనా మానతరుపున దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా ?

Obama , Mandela లాంటి Global Leaders ని పక్కనపెడితే , కనీసం మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ , టంగుటూరి ప్రకాశం పంతులు , శ్రీశ్రీ …. ఇలాంటి వారి గురించి ఎప్పుడైనా విన్నామా ?
మనం job చేసేటప్పుడు company గురించి ఎలా కచ్చితం గా తెలుసుకుంటామో , అలా మన దేశం గురించి తెలుసా ?గట్టిగా మాట్లాడితే Martin Luther King ఎవరో తెలీదు సరికదా …. మనం రిపబ్లిక్ డే అసలు ఎందుకు సెలెబ్రేట్ చేస్కుంటున్నామో చాలా మందికి తెలియనే తెలీదు .

జీవితం అంటే , Graduation -Enjoyment , Job-Enjoyment , Family-Enjoyment తప్ప ఇంకేముంది ? మొత్తం enjoyment ఏ గా . సరే కాలం ఇలాంటిది అని పక్కనపెడదాం . మనం ఇలా బ్రతికేస్తున్న దేశం లో స్వాతంత్య్రం కోసం ఎంతమంది 15 నుంచి 20 ఏళ్ల యువతీయువకులు ప్రాణాలు విడిచారో మనకి తెలుసా ? ఒక ఆడపిల్లల చదువు కోసం Malala Yousafzai ప్రాణాలు పణం గా పెట్టి పోరాడినందుకే Nobel Peace Prize ఇవ్వడం కరెక్ట్ ఏ అయితే , మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొదిలిన వందలమంది యువత కి ఎన్ని Nobels ఇవ్వాలి ? అదే వయస్సు లో ఉన్న మనం ,, దేశం లో అత్యాచారాలు , బ్లాక్ మనీ కనిపిస్తుంటే , చూస్తూ కూర్చుంటున్నాం . డబ్బు సంపాదించి family ని పోషించాలి . కానీ డబ్బు అక్రమం గా ఎందుకు లాక్కోవాలి ? నీ చెల్లెలిని నువ్వు ఇంట్లో ఆటపట్టించచ్చు , కానీ నువ్వు…. బయట ఉన్న ప్రతీ అమ్మాయి ఒకడికి చెల్లి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావ్ ?

దేశం అంటే , కులం కాదు , మతం కాదు , ప్రాంతం కాదు . దేశం అంటే కలిసి కట్టుగా ఉండే ఒక జన సమూహం . దేశం మారాలి అంటున్నాం ,, మారాలి అంటే ??
మనలో మార్పు , ప్రజలలో మార్పు , Standard of Living లో మార్పు . చాలా మంది foreign వెళ్లే ఎందుకు చదువుకుని , అక్కడే settle అవుతారు ? ఎందుకంటే అక్కడ Standard of Living బావుంటుంది అని .. మరి మన దేశం లో ఎందుకు బాగోదు ? ఆ వచ్చింది Pin -Point question !!!

ఎందుకంటే ….. మన దేశం లో స్త్రీ కి రక్షణ సరిగ్గా లేనే లేదు . ఒక వయసొచ్చిన parents ని చూసుకోవడానికి , వాళ్ళ పిల్లలకి ప్రేమ లేదు . ఒక చిన్న పిల్లవాడి Passion ని అర్థంచేసుకొనే మనసు తల్లిదండ్రులకి లేదు . ఒక మనిషిని మరమనిషి గా మార్చేస్తున్న Colleges కి ఆలోచనా విధానం లేదు .. ఇవన్నీ మారినప్పుడే , మనిషి మారాడని గుర్తు . అలా ఒక్కోమనిషి మారినప్పుడే , మనుషులున్న ఈ సమాజం దేశాన్ని నిర్మిస్తుంది .

ఇలా అవ్వాలంటే నరనరాల్లో Patriotism ( దేశ భక్తి ) ఉండాలి ….. ఉండి తీరాలి . లేదంటే ఇంకా ఏ Big Bang T.V సీరీస్ చూసి టైంపాస్ చేస్తే , రేప్పొద్దున్న ఒక పదేళ్ళయ్యాకా కూడా మన పిల్లలు “India is STILL a developing country ” అని చదువుకోవాల్సొస్తుంది .

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , ,