ఏమండోయ్! మీకు మా Village Special Food, నోరూరించే ‘తాటి రొట్టె’ గురించి తెలుసా?

 

ఎలా ఉన్నారండి అందరూ.. బాగున్నరా…? నేనండి మీ గోదారోడ్ని.. గుర్తుపట్టారుగా… ఆయ్!! చాలా రోజులైందండి మీతో మాట్లాడి. ఏమైపోయావ్ బాబు అని అనుకుంటున్నారా…! ఎమ్లేదండీ పనిలోపడి… అవును వచ్చిన, నేను తెచ్చిన సంగతి ఏంటంటే.. మీకు చుట్టాలున్నారా? ( మనిషి అన్నాకా చుట్టాలు లేకుండా ఎలా ఉంటారండి అని అంటారా! ఆయ్ ) ఆ చుట్టాలు పల్లెటూరిలో ఉన్నారా…? అయితే మీకు కచ్చితంగా నేను చెప్పే ఈ నోరూరించే వంటకం గురించి తెలిసే వుంటుంది.


 

” తాటి రొట్టె ” గుర్తొచిందిగా.. ఆయ్ గుర్తు రాకపోతే ఎలా అండీ.. మాములుగా గల్లీలో దొరికే సిల్లీ స్వీటా అదీ…! ఒక మంచి తీపి జ్ఞాపకమది. ఇక నాకెందుకు దీని గురించి చెప్పాలి అనిపించింది అంటే ఈ వర్షాకాలంలో తాటి కాయలు దిగుబడి బాగా వుంటుంది. What is the తాటి కాయ అంటారా? యునో తాటి చెట్లు అదెనండీ మన బాహుబలి 2 సినిమా పతాక సన్నివేశంలో వుంటాయిగ.. హా ! ఆ చెట్లు అన్నమాట.. ఇందా ఈ ఫొటోలో ఉంది చూడండి…


 

ఇవి వచ్చేసి తాటి పండ్లు…


 

మాకు తెలుసులెవోయ్ అని అనుకోకండి తెలవని వల్ల కోసం చూపించా…

ఈ తాటి చెట్ల నుంచి వచ్చే తాటి పండ్లని (బాగా పండిన వాటిని) తీసుకుని, వాటి నుంచి గుజ్జు తీసుకుని, ఆ గుజ్జుకి బియ్యం రవ్వ, బెల్లం మరియు కొబ్బరి తురుము కలిపి నిప్పుల పొయ్యి మీద, పెనములో ఉంచి ఈ తాటి రొట్టెని తయ్యరూ చేస్తారు… ఇక రుచి సంగతయితే ఎంత చెప్పినా తక్కువే… ఇక మీరు కూడ ట్రై చేస్తానంటే ఇదిగో ఈ వీడియోలు చూసి, చేసుకుని మీ నోటిని ఈ తాటి రొట్టె రుచి తీపితో నింపుకోండి…


 

లేదండి మాకు తయ్యారీ చేసుకునేటంత టైమూ, తాటికాయలు రెండు లెవన్టారా! ఐతే ఊళ్లో ఉన్న మీ స్నేహితులకో, చుట్టాలకో ఫోన్ కలపండి.ఉంటా మరి! టా టా…!!


 

Deenne English lo ee madhya Palm Plum Cake ani kuda antunnaru..:


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,