Here’s How A Small Question Asked By A Daughter Changed Her Father’s Perspective Towards Celebrations

 

Contributed by Sai Ram Nedunuri

 

“కొత్తదనంలో ఆనందాన్ని పొందడం” అనే స్వభావం మనుషులలో సహజంగా ఉండడం వలన అనుకుంట, కొత్త సంవత్సరాన్ని నేను కూడా ఆనందంగా ఆహ్వానించాలని నిర్ణయించుకుని, ఇంకొక్క పది నిముషాలలో పని ముగించుకుని ఆఫీస్ నుండి బయల్దేరిపోదాం అని టైం చూసుకున్నప్పుడు, సాయంత్రం ఆరు అయ్యింది.
పని ముగించుకుని కంగారుగా లిఫ్ట్ దగ్గరికి చేరుకునే సరికి ఆరున్నర దాటింది.

 

అరవై లక్షలు పెట్టి Car కొని పది రోజులు కూడా కాకపోవడం వలన, Car మీద చిన్న గీత ఆకారంలో మరక కనిపించగానే గుండె ఆగినంత పనైంది. అందుకేనేమో ట్రాఫిక్ లో నాకు తెలియకుండానే వేరే వాహనాలకి చాలా దూరంగా నడుపుతున్నాను. ఇంటికి చేరడానికి ఇంకొక ఐదు నిమిషాలు ఉందనగా సిరి call చేసింది.

 

నేను:
హా సిరి .. చెప్పు.

 

సిరి:
ఎక్కడున్నావ్ ఆకాష్ ? CEO అంటే “Completely Engaged in Office” అనుకుంటున్నావేమో నువ్వు, ఆ పోస్ట్ కి full form అది కాదు తెలుసా నీకు ?

 

నేను:
ఔనా .. Full form అది కాదా .. అరెరే పెద్ద సమస్యే వచ్చి పడిందే.. నాకు తెలియకుండా ఇన్నిరోజులు పని చేసేస్తున్నాను .. పర్లేదంటావా ..? College రోజుల్లో, CEO అంటే సంతకాలు పెడితే చాలు అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది ఈ పోస్ట్ కి ఉండే తలనొప్పులు. ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నాలే ఇంటికి.

 

సిరి:
సర్లే కానీ, Cake తెస్తున్నావా ?

 

నేను:
నేను ఇంటికి రాగానే ముగ్గురం కలిసి వెళ్లి తెచ్చుకుందాంలే.

 

సిరి:
తార పుట్టినప్పటి నుంచీ తనకి ఇష్టమని December 31st కి Cake తెచ్చుకుంటాం. దానికి ఇప్పుడు ఆరేళ్ళు. ప్రతి ఏడాది Cake తీసుకురావడం మాత్రం గుర్తుండదు నీకు.

 

నేను:
గుర్తులేక కాదు సిరి. మనం అందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు వచ్చే ఆనందాన్ని ఆస్వాదిద్దామని.

 

అని చెప్పి, నా మతిమరుపుని నాలోనే తిట్టుకుంటూ, ఇంటి Cellar లో Car Park చేశాను. ఇంటికి వెళ్లగానే రోజూలాగే తార, “నాన్నా” అంటూ ఎత్తుకోమని తన రెండు చేతులు చాచింది. తను చెప్పిన స్కూల్ విషయాలన్నీ విన్నాక, Cake కొనడానికి ముగ్గురం కలిసి బయటకి బయల్దేరాము.

 

తార:
అమ్మా, December 31st తరువాత New Year రావాలని ఎవరు చెప్పారామ్మా ?

 

సిరి:
Old days లో కొంతమంది people చెప్పారమ్మా.

 

తార:
మరి December 31st రోజు ఎందుకు Celebrate చేసుకుంటాం ?

 

సిరి:
అసలు ఇన్ని Doubts ఎక్కడ్నుంచి వస్తాయే నీకు ?

 

నేను:
తారకి Cakes అంటే ఇష్టం కదా, మరి నీకు ఇష్టమైన Cake తినాలంటే Celebrate చేసుకోవాలి కదా మరీ .. !!

 

ఇలా కొంచంసేపు ప్రశ్నల వర్షం కురిపించిన తరువాత, Car అద్దంలో నుంచి బయటకి ఏదో చూస్తూ తార చాలా సేపు మౌనంగా ఉండిపోయింది. కొంచెంసేపటి తరువాత Traffic Signal దగ్గర Car ఆగినప్పుడు,

 

తార:
రేపు అందరికీ Happy New Year ఆ నాన్నా ?

 

నేను:
ఔను తారా, అందరికీ Happy New Year

తార:
అంటే అందరూ Happy గా ఉంటారా ?

నేను:
ఔను తల్లీ, తార లాగే అందరూ Happppy గా ఉంటారు

తార:
అయితే వాళ్ళందరూ కూడా రేపట్నుంచి New House and New Clothes తో Happy గా ఉంటారా ?

 

అని అంటూ, తార తన అమాయకపు చిరునవ్వుతో, రోడ్డు పక్కన చలికి వణుకుతూ పడుకున్న కొంతమందిని చూపించింది.

నేను మౌనంగా తారని చూస్తూ ఉండిపోయాను. Traffic Signal Greenకి మారినా సరే, Car ని వెంటనే ముందుకి కదల్చలేదు నేను. Traffic Signal దగ్గర పక్కనున్న వాహనాలు కొత్త Car కి తగులుతాయి అన్న భయం వలన కాదు. తార చూపించిన వాళ్ళ గురించి నాలో మొదలైన ఆలోచనల వలన.

 

ప్రతి సంవత్సరం లాగే ఆ రోజు కూడా నా ఫోన్ కి Happy New Year అని చాలా మెసేజ్ లు వచ్చాయి. కానీ ఆ మెసేజెస్ లో Happy అని చూసినప్పుడల్లా నాకు తార అడిగిన ప్రశ్న, తార చూపించిన మనుషులే గుర్తుకు వచ్చారు. ఎందుకో ఈ ఆలోచనలు చాలా రోజులు నన్ను వీడలేదు. మా కంపెనీ Board of Directors తో కూడా ఈ ఆలోచనలు పంచుకోలేకుండా ఉండలేకపోయాను.

 

రోజూవారీ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. తారకి పదేళ్లు వచ్చాయి. ఒక రోజు సాయంత్రం, నేను, సిరి, తార ఒక హోటల్ కి వెళ్ళాము. ఆ కార్యక్రమంలో, మా కంపెనీ Board of directors తో కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం, కంపెనీ CSR (Corporate Social Responsibility) లో భాగంగా
“Tara Foundation” ప్రారంభించాము. రోడ్డు మీద ఎవరూ పట్టించుకోని వారి గురించి ఆరా తీసి, వాళ్ళ మానసిక స్థితి గురించి తెలుసుకుని, వాళ్ళని, వాళ్ళ కోసం నిర్మించిన care homes కి తరలించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఆ Care Homes లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు, ఓపిక ఉన్నవాళ్ళకి వివిధ నైపుణ్యాలు నేర్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సహాయం చేస్తుంది ఈ Tara Foundation.

 

కార్యక్రమం లోని వ్యాఖ్యాత:
ఇప్పుడు ఈ సంస్థ CEO, ఆకాష్ గారు మాట్లాడతారు.

నేను:
ఆకాశంలోని కదిలే తారలని చూసి కోరుకునే కోరికలు నిజమౌతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ తార వలన ఎంతో మంది కన్న కలలు, కోరికలు నిజమవ్వడానికి అవకాశం దొరికింది.

 

అని చెప్పి, నాలుగేళ్ల క్రితం December 31st నాడు తార అడిగిన ప్రశ్న అందరితో పంచుకున్నాను.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,