Every Geek Need To Know About This Telugu YouTube Channel & Here’s Why

 

“The problem is not the problem. The problem is your attitude about the problem” – Pirates Of Caribbean.

సాయంత్రం ఫణిదీప్, సందీప్ లను కలిసేముందు యాదృచ్చికంగా ఉదయం అడవి బాపిరాజు గారి “వడగళ్ళు కథ” చదివాను. ప్రకృతి వైపరిత్యాల వల్ల జీవితాలు కలుస్తాయి.. అంతా మన ఉన్నతికే అన్న సారాంశంతో కథ పూర్తవుతుంది. ఉదయం కథ చదివితే సాయంత్రానికి రియాలిటి చూడగలిగాను. కథలో వడగళ్ళు రెండు జీవితాలను కలిపితే, ఫణిదీప్ జీవితంలో సంభవించిన ఉపద్రవం లక్షల మందిని బాగుచేస్తున్న “Telugu Geeks” ఛానెల్ పుట్టుకకు కారణం అయ్యింది.


 

“అభినందిస్తూ కొట్టిన క్లాప్స్ సౌండ్ కన్నా, ఒక బాంబ్ సౌండ్ ఇంకా ఎక్కువగా జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో జరుగుతున్నది అదే”.

ఐనా తనలో విలువైన సంపద ఉంది:

నాన్న సత్యనారాయణ గారు Ceramic engineerగా నైజీరియాలో ఉద్యోగం చేసేవారు. (తర్వాత కాలంలో ఫణిదీప్ కోసం ఇంటికి వచ్చేశారు). అమ్మ రమణి గారు ఎందరో రేపటి భారతదేశ పౌరులను తీర్చిదిద్దుతున్న కోట్లాదిమంది గృహిణీలలో తను ఒకరు. ఫణిదీప్ MBBS, సందీప్ MBA పూర్తిచేశారు. చిన్న ఫ్యామిలీ అన్ని ఊహించినట్టుగానే జరుగుతున్నాయి, మా జీవితాలు మా అదుపు ఆజ్ఞ లలోనే ఉన్నాయని అనుకుంటున్న కాలంలోనే కాలం వారి జీవితాలను తన చేతిలోకి తీసుకుంది. పెద్దబ్బాయి ఫణిదీప్ కు భయంకరమైన MND-Motor neuron అనే disease వచ్చింది. వ్యాధి కొంతకాలం తనతో ఉండి మధ్యలోనే ఆడిపోవడం వల్ల ఫణిదీప్ లేచి నడవలేకపోయాడు. ఐతే అతను చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, ఆలోచించ గలుగుతున్నాడు.


 

“అన్నయ్య మీకో విషయం తెలుసా మీ వీడియో చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను ఇప్పుడు నేను క్లాస్ లీడర్ అయ్యాను”
-ఓ 7th క్లాస్ స్టూడెంట్ .

మనం ఎదుగుతూ మరొకరిని ఎదగనివ్వాలి:

అన్నయ్యకు ఇలా జరగడంతో సందీప్ ఇంటికి వచ్చి అన్నయ్యకు తోడుగా ఉన్నాడు. ఇక్కడే రకరకాల విషయాలు చర్చకు వచ్చేవి. “మనం కేవలం మన మీదనే డిపెండ్ అవ్వాలి.. నీళ్లలో పడిపోతే మునిగిపోము, అక్కడే ఉండిపోతే మునిగిపోతాము”. అని కొంతకాలనికి తెలుసుకుని ఇంట్లోనే ఏదైనా స్టార్టప్ మొదలుపెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. “మనం ఎదుగుతూ, మరొకరు ఎదగడానికి ఉపయోగపడదాం” అని 2017 ఫిబ్రవరిలో Telugu Geeks ను స్టార్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప పుస్తకాలు, మహోన్నత వ్యక్తులను తెలుగువారికి పరిచయం చేస్తూ “లే పైకి లే, నీ మీద నువ్వు నిలబడు” లాంటి రొటీన్ బరువైన మోటివేషన్ కాకుండా “Tips, logics” తో కూడిన పద్ధతులను మాత్రమే ఇక్కడ వివరిస్తారు. 

“యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది, నిత్యం డిప్రెషన్ లో మునిగిపోయేవాడిని, మీ వల్ల మారిపోయాను. మీకు ఎన్ని థాంక్సులు చెప్పినా తక్కువే” – ఒక మిత్రుడు

ఒకరు ఎడిటింగ్, మరొకరు వాయిస్ ఓవర్:

సందీప్, ఫణిదీప్ ఇద్దరు చిన్నతనం నుండి పుస్తకాలు ఎక్కువ చదువుతారు. చిన్నతనంలో సందీప్ సూపర్ మాన్, కార్టూన్ లాంటి స్టోరీస్ చదివితే అన్నయ్య జనరల్ నాలెడ్జ్ పెరిగే పుస్తకాలు ఎక్కువ చదివేవారు. ఇప్పుడు ఇద్దరు ఒకే పుస్తకాలు చదివి అందులోని బెస్ట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని, వీడియో ఎలా మొదలయ్యి పూర్తికావాలని డిస్కస్ చేసుకుంటారు. స్క్రిప్ట్ వాయిస్ ఓవర్ సందీప్ చూసుకుంటే, అందుకు తగిన వీడియో ఆడియో ఎడిటింగ్ ఫణిదీప్ చూసుకుంటారు. మోటివేషనల్ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మరో వీడియో చూడాలనే కోరుకుంటారు అందుకోసం ఛానెల్ ప్రారంభించిన కొత్తలో ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఈ స్ట్రాటజీ ఇంకా క్వాలిటీతో కూడిన వీడియో ఎడిటింగ్ వల్ల త్వరగానే లక్షలాదిమందిని చేరుకున్నారు.


 

“ఒక్కోసారి నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడు నేను కూడా Telugu Geeks ఓపెన్ చేసి నా వీడియోలు నేను చూసుకుంటాను”
-సందీప్.


 

మేము సంపాదించిన ఆస్థి:

ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో వారు ఎదుగుతూ మరెందరో ఎదగడానికి ఉపయోగడుతున్న సందీప్ ఫణిదీప్ తమ విలువైన సమయామంతా బెస్ట్ వీడియో ఇవ్వడానికే దృష్టి పెడతారు. యూ ట్యూబ్ లో గాసిప్స్, పొలిటికల్ క్రిటిసిజం వీడియోలు చూడరు. (కింద సజేషన్ వీడియోలో వచ్చినా Not Interested అని తీసేస్తారు). ఫణిదీప్, సందీప్ రూపొందించిన వీడియోలన్ని తమ ఆస్తిగా భావిస్తారు. 

కొన్ని రోజుల క్రితం సందీప్ వాట్సప్ కు అమెరికాలో ఉంటున్న ఫ్రెండ్ “ఈ వీడియో చాలా బాగుంటుంది చూడు సందీప్” అని ఒక వీడియో లింక్ పంపించింది. ఈ లింక్ ఎవరు పంపించారని అడిగితే, నేనే చూశాను నచ్చి నీకు షేర్ చేశానని చెప్పింది. “నువ్వు చూసిన వీడియో చేసింది మేమే” అని సందీప్ చెప్పాడు. ఒకరికి మంచి చేసినా చెడు చేసినా అది ఎక్కడికో ప్రయాణం చేసి తిరిగి మన దగ్గరకే వస్తుందని ఈ ఉదాహరణకు మించిన ఫిలాసఫీ ఇంకేముంటుంది చెప్పండి.

You Can Visit Their Channel Here – LINK

Website – CLICK HERE 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , , ,