A Peek into The Heartbreaking State of Affairs in Our Villages!

ఇల్లు వాకిలి సర్వస్వాన్ని తాకట్టు పెట్టి కన్నకొడుకును చదివిస్తే ఆ కొడుకు పరీక్షలలో ఫేయిల్ అయినందుకు భాదపడి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ తండ్రి పరిస్థితి ఎంత దయనీయంగ ఉంటుందో… ఇప్పుడు మన తెలంగాణ రైతు పరిస్థితి అలాగే ఉంది. వర్షాలు పడక బావులు ఎండిపొయి తెలంగాణ రైతులను, పంట పొలాలను దుర్భిక్షం అలుముకుంది. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే సరైన స్థాయిలో నీటి వసతిలేక 14,00,000 హెక్టార్లలో లక్షల ఎకరాలలో పంట నష్టపోయింది. పెట్టుబడి పెట్టి సాగుచేసిన ధర కన్నా దాదాపు సగానికి ధర పడిపోయింది. తెలంగాణాలో పండించిన మొక్కజొన్న, సోయాబీన్, కంది, వరి, పత్తి సహా అన్ని పంటలు నష్టాలే మిగిల్చాయి. దామస్తపూర్ అనే రంగారెడ్డి జిల్లా గ్రామంలో 200 బోరు బావులలో కేవలం 10 బావులలో మాత్రమే నీటిని అందిస్తుంటే పంట పొలాల పరిస్థితి పక్కన పెడితే కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేని దుస్థితి… సాక్షాత్తు రైతులు ఒక ఊరు ఊరే పట్నం నుండి కూరగాయలు, బియ్యం, నీళ్ళు తెచ్చుకుంటున్న హృదయ విధారకమైన సంఘటనలు మన తెలంగాణాలో చోటు చేసుకుంటున్నాయి.

ఒక్కో జిల్లాల్లో ఒక్క హృదయ విదారకమైన గాధ… తెలంగాణ లోని పది జిల్లాలలో 6 జిల్లాలు సాదరణంగా కన్న చాలా తక్కువ వర్షపాతం నమొదయ్యింది…
ఆదిలాబాద్ లోని 5.76 లక్షల హెక్టార్లలో 5.30 లక్షల హెక్టార్ల పంట సరైన దిగుబడికి నోచుకోలేదు…

నిజామాబాద్ లోని ఒక్క అంక్సాపూర్ లోనే రైతులు వేసిన పసుపు పంటను కాపాడటం కోసం 1,000 బోర్లు వేశారంటే నీటికోసం రైతుల అగచాట్లు ఎంతలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.మొత్తం 36 మండలాలో కరువు విలయతాండవంతో మనకు బతుకునిచ్చే రైతులు బ్రతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు…
ముఖ్యమంత్రి KCR నియోజకవర్గం (గజ్వేల్) మెదక్ జిల్లాలో… మంజీర నది పూర్తిగా ఎండిపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో వ్యవసాయాన్ని కొలుకోలేని దెబ్బతీశాయి… ఖరీఫ్ లో వేసిన 2.72 లక్షల హెక్టార్ల పంట పూర్తిగా నష్టపోయింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1.76 లక్షల హెక్టార్లు ఉంటుందని అంచనా కాని తీవ్రవర్షాభావంతో కేవలం 39,251 హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలోని 46 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది… ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండే నల్గొండ జిల్లాలో వరి ప్రధానంగా పండిస్తారు. భూగర్భజలాలు పాతళానికి పడిపోవడం,బోరు బావులు వట్టిపోవడంతో 40,000 హెక్టార్లకు పైగా పంటలు ఎండిపోయాయి. వేల సంఖ్యలో పాలు ఇచ్చె ఆవులు, గేదెలు కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి దాపురించింది… భారతదేశంలోనే వరి ధాన్యగారంగా పెరొందిన కరీంనగర్ లో రబీసాగుకు 4 లక్షల హెక్టార్లు సాగుచేసే కరీంనగర్ రైతులు నీటి అగచాట్ల వల్ల ఈసారి కేవలం 50,000 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు.

రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పెరొందిన మహబూబ్ నగర్ లోని 2.25 లక్షల హెక్టార్లు వ్యవసాయ బోర్లలో సగానికి పైగా ఒక్క నీటి చుక్కను కూడా ఇవ్వలేకుండా ఎండిపోయాయి…

అసలే ప్రకృతి కనికరించక వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఎంతోకొంత చేయుతనందించే ఉపాధి హమీ పధకం కూలీ డబ్బులు కూడా సకాలంలో అందించడం లేదు. ఇప్పటికి చాల గ్రామాలలో ఫిబ్రవరి నాటి చెల్లింపులు ఇంతవరకు రాకపోవడంతో గత్యంతరం లేనీ పరిస్థితులలో వ్యవసాయాన్ని ఒదిలేసి కూలీలుగా మారి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. నిజమే వర్షాలు పడకపోవడానికి ప్రభుత్వానికి ఏ సంబందం లేదు కాని గాలి వానకు పడిపోయిన ఒక చిన్న గులాబి మెక్కకు కర్రను కట్టి ఎలా సపోర్ట్ చేస్తామో అలాగే ప్రభుత్వం వారు కూడా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి.

(Data Source: Eenadu)

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: ,