‘చదువుల్లో బెస్ట్, ఆటల్లో బెస్ట్’: Meet Tejaswini, A Gold Medalist In Both Academics & Karate

 

ఒక పని చేస్తున్నప్పుడు 100% చేస్తున్న పని మీదే దృష్టి కేంద్రీకరించడం వల్ల అద్భుతాలు సృష్టించబడతాయి.. ఇందుకు రీసెంట్ ఉదాహరణ తేజస్విని జర్నీ. తేజస్విని స్కూల్ లో ఫస్ట్, యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్ షిప్(55 కేజీల విభాగంలో) గోల్డ్ మెడల్ సాధించింది. గేమ్స్ లో బెస్ట్ గా ఉన్నవారు ఎడ్యుకేషన్ లో బెస్ట్ అవ్వలేరు, ఎడ్యుకేషన్ లో బెస్ట్ గా ఉన్నవాళ్లు గేమ్స్ లో రాణించలేరు. ఇకఈ లైన్ తేజస్విని వంటివారితో కనుమరుగు కాబోతుంది.


అన్నయ్య ట్రైనింగ్:

తేజస్వినిది నల్గొండ. అమ్మ టీచర్, నాన్న మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తారు, అన్నయ్య వివేక్ తేజ 6 రకాల మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతుడు. సాధారణంగా ప్రతి పురుషుడి విజయం వెనున ఒక మహిళ ఉంటుందనంటారు, ఈ మహిళ విజయం వెనుక మాత్రం వివేక్ ఉన్నాడు. చదువు, ఉద్యోగం నుండి కరాటే కు రావాలనుకున్నప్పుడు, వచ్చిన తర్వాత అన్నయ్య వివేక్ సహకారం, ట్రైనింగ్ ఎనలేనిది.యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్:

తేజస్విని చురుకుగా ఉంటుంది, టీచర్లకు రెండు మూడు సార్లు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. చిన్నతనం నుండి బాగా చదివేవారు అలాగే బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవారు, ఎంతంటే స్టేట్ ఛాంపియన్ కూడా తనే. కరాటేలోనూ, ఎడ్యుకేషన్ లోనూ తనకు రికార్డులున్నాయి. తేజస్విని ఇంటర్మీడియట్ లో స్టేట్ థర్డ్ ర్యాంకర్, బీకాం డిగ్రీలో అత్యధిక మార్కులు రావడం వల్ల మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకున్నారు.బ్యాంక్ జాబ్ వదులుకుని:

తేజస్విని శ్రమకు తగ్గట్టుగానే యాక్సిస్ బ్యాంక్ లో మంచి ఉద్యోగం వచ్చింది. గౌరవంతో కూడిన ఉద్యోగం, అవసరాలకు సరిపడే జీతం. ఐతే కొంతకాలానికే తేజస్విని ఎదో కోల్పోతున్నట్టుగా భావించారు. సెక్యూర్ లైఫ్ కోసం వెంపర్లాడితే బ్రతుకుతున్నామనే భావన తప్ప జీవించడం లేదనే ఆలోచన మొదలయ్యింది. ఇలాంటి మథనంలో ఉన్నప్పుడు అన్నయ్య వివేక్ వచ్చి కాసేపు అలా నాతో వర్కౌట్స్ చెయ్యి స్టేబుల్ అవుతావని సలహా ఇచ్చాడు. అప్పుడే కరాటేలోని బేసిక్స్ చెప్పాడు. వివేక్ కరాటే లో ఎంతో అనుభవం ఉంది. ఇలాంటి వర్కౌట్స్ ఇంత త్వరగా చెయ్యడం నీలోని గొప్పతనం, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యి మంచి స్థాయికి ఎదుగుతావని ప్రాత్సాహించాడు. కొంతకాలం ఉదయం జాబ్ సాయంత్రం కరాటే ప్రాక్టీస్ చేసేవారు, జాబ్ చేస్తే కొన్ని సంవత్సరాలలో ప్రమోషన్స్ ద్వారా మేనేజర్ అవ్వొచ్చామో ఒక పరిధి ఉంది. కరాటే లో ఇది లేదు, కరాటే లో ఎన్ని గెలుచుకున్న నిరంతరం ప్రాక్టీస్ ఉంటుంది ప్రతిరోజు ఓ యుద్దంలా ఉంటుంది. అందుకే కెరీర్ కి బౌండరీ ఉన్న జాబ్ ను వదులుకొని బౌండరీలు లేని కరాటేనే ఎంచుకున్నారు.అన్నయ్య వివేక్ నుండి రోజుకు 7 నుండి 10 గంటల ప్రాక్టీస్ లో అన్నిరకాల మెళకువలను నేర్చుకున్నారు. బహుశా ఈ ప్రకృతి కూడా తేజస్విని ప్రతిభను ముందుగానే అంచనా వేసినట్టు ఉంది మొదటి మ్యాచ్ యే ఇంటర్నేషనల్ స్థాయిలో అవకాశం ఇచ్చింది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న మొదటిసారే మెడల్స్ గెలుచుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక కటా లో జరిగిన ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుని “చదువుల్లో బెస్ట్, ఆటల్లో బెస్ట్” అని తన గెలుపు ద్వారా తనని గమనిస్తున్న వారికి ఒక సమాధానమిచ్చింది. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,