Meet Team Sambhava: Who Are Doing Social Service In Their Free Time With Their Own Money

Contributed By N.V. Chaitanya Sai
జీవితంలో కొందరికి డబ్బు ఆనందాన్ని ఇస్తుంది , ఇంకొందరికి పేరు ప్రతిష్టలు ఆనందాన్ని ఇస్తాయి…కానీ వీళ్ళు ఈ ప్రపంచంలో ప్రేమను పంచడంలో …మంచిని పెంచడంలో వాళ్ళ ఆనందాన్ని వెతుకుంటున్నారు . తను చదువుకునే వయసులో పొందిన సహాయం తన ఎదుగుదలకే కాకుండా తనలాంటి ఏంతో మందికి సహాయం అందాలనే ఆలోచనతో మొదలైంది “టీం సంభవ “.

NGO అనగానే మనకు విరాళాలు గుర్తుకువస్తాయి. కానీ “టీం సంభవ “లో విరాళం అనే మాట కూడా వినపడదు. టీంలో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు అందరూ ౩౦ సం. లోపు వారే. అందుకే చేసే ప్రతి పనిలో రేట్టింపు ఉత్సాహం ఉంటుంది . టీంలో ప్రతి ఒక్కరు దీని కోసం వెచ్చించేది వాళ్ళ ఖాళీ సమయం మాత్రమే, అయితే ఏంటి ఆ కొద్ధి సమయంలోనే కొందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు, వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు.

వారాంతంలో వీరి అడుగులు ఏ అనాధ ఆశ్రమం వైపో, వృద్ధాశ్రమం వైపు లేదా సమాజాన్ని వేదిస్తున్న సమస్యపై పోరాడటం వైపో పడుతాయి. ఇప్పటివరకూ ఎన్నో అనాధ ఆశ్రమాలకు వెళ్లి పిల్లలుతూ ఆడుకొని, వారి సినిమాకి తీసుకెళ్లి, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వారి ఆనందానికి, భవిష్యత్తుకు ఎంతో భరోసా ఇస్తున్నారు.

వృద్ధాశ్రమం అయితే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి మేమున్నాం అనే భరోసా ఇస్తూ…వారి నుంచి ఎన్నో జీవిత పాఠాలను కూడా నేర్చుకుంటున్నారు.పర్యావరణాన్ని పీడిస్తున్న ప్లాస్టీక్ సమస్యపై కూడ పోరాడారు.

ఇంకా ఎన్నోసార్లు రహదారి ప్రమాదాల పై అవగాహన కార్యక్రమాలు, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పించడం, ఇంకా ఏంతో మంది కళాశాల విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం చేశారు.

టీం సంభవ – బోధ, విద్య అనే క్రొత్త ప్రోగ్రాములతో గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకి శని, ఆది వారాల్లో పాఠాలు చెప్తూ వారి బంగారు భవిష్యత్తుకు దారి చూపిస్తున్నారు.

ఏ సమస్య అయినా, ఏ సహాయమైనా…మంచిని పెంచడం కోసం, ప్రేమను పంచడం “టీం సంభవ” ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది.
“మాతో కలిసి పని చెయ్యడానికి ఏ అర్హతలు అవసరం లేదు…కొంచెం బాధ్యతగా, మరింత ప్రేమగా ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలు.” ఇది టీం సంభవ Motto.

Website:- https://www.teamsambhava.in/
Gmail:- teamsambhava@gmail.com
If you wish to contribute, mail us at admin@chaibisket.com