These Devotional Lines From Tanikella Bharani’s ‘Siva Tatvaalu’ Are Pure Gold!

 

మన తనికెళ్ళ భరణి గారు నటనను ఏంతలా ప్రదర్శించగలరో రచయితగా తన భావాలను అంతే స్థాయిలో వ్రాయగలరు, దర్శకునిగా వెండితెర మీద కథలను ఆవిష్కరించగలరు. చిన్నతనం నుండి భరణి సాధారణ విద్యార్ధి లానే ఉన్నారు కాని ఇంటర్మీడియట్ లో ఆయన స్నేహితుడు దేవరకొండ నరసింహ ప్రోత్సాహంతో ‘అగ్గిపుల్ల ఆత్మహత్య’ ‘కొత్త కలలు’ లాంటి రచనలు రాశారు అవి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలలో ప్రచురితమయ్యేవి.. ఆ తరువాత వివిధ గొప్ప నాటకాలు రచించారు. మొదట ‘కంచు కవచం’ అనే సినిమాకు మాటలు అందించారు వంశి ‘లేడిస్ టైలర్’ కు మాటలు అందించడంతో పాటు నటుడిగా పరిచయం అయ్యారు కెరీర్ తొలిరోజుల్లో రాం గోపాల్ వర్మ శివ సినిమాలోని నానాజి పాత్రకు ఎంతో గుర్తింపు లభించింది. 60 సినిమాలకు పైగా మాటలు అందించి, నటుడిగా 700 పైగా నటించారు, దర్శకునిగా మిథునం లాంటి అచ్చతెలుగు అమ్మ నాన్నల ప్రేమ కథను తెరకెక్కించి ప్రశంశలనందుకున్నారు. ఉత్తమ విలన్ గా(సముద్రం), ఉత్తమ మాటల రచయితగా(శివ), ఉత్తమ సహాయ నటుడు గా (నువ్వు నేను) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నందులను గర్వంగా పొందారు. ఇవన్నీ ఒక ఎత్తు ఆయన ఈ మధ్య కాలంలో రాసిన శివతత్వం మరొక ఎత్తు. భరణి రాసిన శివతత్వాలు నేటి మన యువతకు ఎంతో అవసరం.. భగవంతునికి ఏ ఒక్కరు ఎక్కువ కాదు ఏ ఒక్కరు తక్కువ కాదు, శివరాత్రి రోజు ఉపవాసం చేసే బ్రహ్మణుడిని అనుగ్రహించాడు, మాంసాన్ని నైవేద్యంగా పెట్టిన కన్నప్ప పై కూడా కరుణ చూపించాడు. భగవంతుడుని భక్తితో,భయంతో,గౌరవంగా వర్ణించేవారు సాధారణం.. కాని తెలంగాణ యాసలో ఒక ప్రాణ స్నేహితుడి వలే శివుడిని ప్రేమగా మెచ్చుకుంటు రాసిన శివతత్వ పద్యలు ఒక అద్భుతం.. ఒక్క అక్షరం ముక్క రాని వాడు వర్ణించినంత పచ్చిగా వర్ణించాడు.. శబ్భాష్ రా భరణి..!

 

అందులోని కొన్ని…

పుట్టించేదా బ్రెమ్మసామి
ఇష్ణుమూర్తేమో నడ్పిస్తడా!
నువ్వొకానివెర పండబెట్టెడిది
శబ్బాష్ రా శంకరా!!

బొందల్ గడ్డల పంటవంట
నీ కన్నంత మంటంట!
నీ ఇల్లూ ఇల్లాల్ సల్లగుంటరట
శబ్బాష్ రా శంకరా!

నీ అంతేడనో దెల్సుకోనికి
కిందామీదైన్రు తోటోళ్ళు!
‘అంతా’ నీవని తెల్సుకోరేందిరా
శబ్బాష్ రా శంకరా!

పాలసముద్రము సిల్కెయాల
నిను పాగల్ గానిగ జేస్తిరయ్య!
అమృత మిడిసిపెట్టి ఇసమా..?
శబ్బాష్ రా శంకరా!

నాకా రావయ ఓనమాలు
బిల్ కుల్ రాదు ఛందస్సు!
నువ్వే యతివి – గణాలు సుట్టుముట్టు
శబ్బాష్ రా శంకరా!

అమ్మని జూస్తే ఆకలి
గంగమ్మని జూస్తేనె దూప!
అయ్యను జూస్తే – భేఫికరు
శబ్బాష్ రా శంకరా!

నువ్వే దిక్కని జెప్పినన్నడిగితే
నేనేదో దిక్కు జూపిచ్చినా..!
నేనే దిక్కని నువ్వెజెప్పినవులే
శబ్బాష్ రా శంకరా!

పచ్చని చెట్లు గొడ్తె
భూమాతకు.. గుండెల పొక్కబెడ్తె!
మాతోనే మా బొంద తవ్విపిస్తవా?
శబ్బాష్ రా శంకరా!

అడ్డం గీతలు – నిలువు గీతలు
పెయ్యంత నీ వాతలు!
ఇయి మారుస్తయ బ్రహ్మరాతలు
శబ్బాష్ రా శంకరా!

మంత్రాలేమో నాకురావు
తంత్రాలు నీకెర్కలే..!
మౌనంగుంటవు… మాటలాడతవు
శబ్బాష్ రా శంకరా!

కవితల్ రావయ కాళిదాసోలె
తిన్నని లెక్క కన్నీయలే!
బేకారోనికి భక్తినిస్తవయ్యా
శబ్బాష్ రా శంకరా!

నిచ్చెనలెక్కిపిస్తవు
దెబ్బకు పాముతో దించిపిస్తవు!
వైకుంఠమె – కైలాసమంటవుర
శబ్బాష్ రా శంకరా!

అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడు
అయ్యకు బుడ్డ పైసీయడు!
కొడుకులు ఏమ్టికి – కొరివి బెట్టనీకా?
శబ్బాష్ రా శంకరా!

నువు తోల్ బొమ్మల నాడిపిస్తవు
నడిమిట్లాపి ఏడ్పిస్తవూ!
ఏ దినమెవ్వరి భేల్ ఖతమైతదో..
శబ్బాష్ రా శంకరా!

ఉపాసం ఉంటను నిన్ను దింటను
జాగారంల ‘నేను’ పంటను!
శివరాతిరి ‘పండే’ పండుగంటను
శబ్బాష్ రా శంకరా!

కోట్లకు కోట్లు నోట్లు
పెట్టెల్నిండ బంగారమూ!
ఎకరాలెన్నుంటేంది – ఆరడుగులే
శబ్బాష్ రా శంకరా!

ఇల్లాలంటడు పిల్లలంటడు
ఎన్నెన్నో ఇండ్లు బండ్లంటడూ!
నువ్వు బిల్వంగనే కాట్ల బంటడు
శబ్బాష్ రా శంకరా!

అన్నపూర్ణమ్మ
పీనేకో గంగమ్మ
సోనా యాడైతేంది సోనానె
శబ్భాష్ రా శంకరా!

ఖానాకైతే
శంకర అంటేనే నాకు
శక్కర లెక్కన ఉంటదయ్య
శివునాగ్నైతది సీమనైత
శబ్బాష్ రా శంకరా!

కుత్కెలు గోసుకుంటరు
కులాల మతాల పేరుజెప్పి
పెద్ద కులపోనికి పెద్ద సావొస్తదా
శబ్బాష్ రా శంకరా!

ఉయ్యాల్లేస్తరు… ఊపుతుంటరు
పెండ్లిల పల్లకి మోస్తరు..!
పాడెను గడ్తరు.. పట్కపోతరు
శబ్బాష్ రా శంకరా!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,