This Story Will Make You Know The Differences between Choices & Chances

 

Contributed By N.V.Chaitanya Sai

 

సరిగ్గా 651 రోజులు ఈ రోజుకి!
నా అలవాటు ప్రకారం రోజు లేస్తూనే…ఎన్ని రోజులైంది అని లెక్కపెట్టి
ఆఫీసుకి రెడీ అవుతున్నాను.

“అదేంటి అర్జున్, ఆఫీస్ కి రెడీ అవుతున్నావు. మీ ఫ్రెండ్ పెళ్లి ఉందని రాజస్తాన్ కి వెళ్ళాలి అన్నావు…” అని అడిగాడు సూర్య, నా రూమ్మేట్.

ఇంకా లీవ్ కన్ఫర్మ్ అవ్వలేదు సూర్య.

అప్పుడే నా ఫోన్ మోగింది.

“రాకేష్” కాలింగ్…వెంటనే ఫోన్ తీసుకున్నాను.

హల్లో రాకేష్…చెప్పండి!

రాకేష్:- హల్లో అర్జున్, నీ లీవ్ కన్ఫర్మ్ అయింది. కానీ మన మ్యానేజర్ 3 రోజులే అప్రూవ్ చేసాడు. సో ముందే రావాలి నువ్వు.
నువ్వు క్రిటికల్ రిసోర్స్ కాదు…కానీ సపోర్ట్ కి ఉండాలి కదా…సో 3 డేస్లో వచ్చెయ్.

Hmmm
ఎలా అవుతాను…డబ్బు కోసం, సొసైటీ ప్రెషర్స్ వల్ల ఇష్టంలేని పని చేస్తే క్రిటికల్ రిసోర్స్ ఎలా అవుతాను అని నవ్వుకుని…రాజస్థాన్ కి వెళ్ళడానికి సర్ది పెట్టిన బ్యాగ్ తీసుకున్నా!

సూర్య…నా లీవ్ కన్ఫర్మ్ అయింది. వెళ్ళొస్తాను!

సూర్య:- ఫ్లైట్ ఎన్నికి అర్జున్?

ఇంకొone and half hr లో ఉంది సూర్య. అని అబద్ధం చెప్పి వచ్చేశా.

అవును రాజస్తాన్ వెళ్ళాలి అనుకున్న కానీ ఎలాంటి ప్లాన్ చెయ్యలేదు.

రోజు టైమ్ టు టైమ్ పనులు చేసి చాలా అలసిపోయా.
రోజు ఏదో ఒక భయం…ఏదో ఒక డెడ్లైన్…ఇలానే నా ప్రతి రోజూ గడిచేది.

కనీసం నా ఆలోచనలకు కూడా నా బుర్రలో స్థానం లేకుండా పోయింది.

 

————————–

MGBS బస్టాండ్:-

నేరుగా రిజర్వేషన్ కౌంటర్ దెగ్గరికి వెళ్ళాను…
నార్త్ కి వెళ్లే నెక్స్ట్ బస్సు కి ఒక టికెట్ అని అన్నా.

హైదరాబద్ టు ముంబై…700km

నా కోసం నేను ఆలోచించడానికి చాలా టైం దొరుకుతుంది అని అనుకున్న.

10:45కి బస్…ఇప్పుడు టైమ్ 10:30

కొన్నిసార్లు అనిపిస్తుంది…ఈ టైమ్ అనేది లేకుంటే బాగుండేది కదా అని.
ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగేది. ప్రతిదానికీ ఇలా లెక్కలు వేసుకుంటూ బ్రతకడం అలవాటయ్యేది కాదు.

బస్ ప్లాట్ఫారం దగ్గర ఆగింది. టికెట్ కండక్టర్ కి చూపించి వెళ్లి విండో సీట్లో కూర్చున్నా.

ప్రయాణం మొదలైతే…నా ఆలోచనలు కూడా స్వేచ్చగా ఎగరడానికి అన్నట్టుగా ఉన్నాయి.

బస్ ఇంకో 2నిమి. బయలేదేరుతుంది అనగా…

 

ట్రాక్ ప్యాంట్స్
స్పోర్ట్స్ టీ షర్ట్
వెనక పెద్ద బ్యాక్ ప్యాక్.

తను కండక్టర్ కి టికెట్ చూపిస్తూ ఉంది.
చూపించి ఇటు వైపు తిరిగింది!

తను…తను…

హాయ్ అర్జున్, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? అని గ్యాప్ లేకుండా చాలా అడిగేసింది.

తను సిరి… స్కూల్లో నా క్లాస్మేట్.

అలా వచ్చి నా ప్రక్కనే కూర్చుంది.

చాలా హ్యాపీగా ఉంది సిరి మళ్ళీ ఇన్ని సం. తరువాత ఇలా కలవడం అని అన్నా.

సిరి:- అవును అర్జున్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.
ఇంకేంటి అర్జున్, ఎం చేస్తున్నావు? హైదరబాద్లోనే ఉంటున్నావా?

అవును సిరి. కూకట్పల్లి లో ఉంటున్నా. ఆల్మోస్ట్ 2 సం. నుండి జాబ్ చేస్తున్నా…(651వ రోజు అని గుర్తు చేసుకుని).

సిరి:- మరి ముంబై… వర్కు కోసం వెళ్తున్నావా?

లేదు సిరి, రాజస్థాన్ లో ఫ్రెండ్ పెళ్లి. ఫ్లైట్ దొరకలేదు.అందుకే ఇలా… హైదరాబాద్ – ముంబై – రాజస్థాన్.

సిరి:-
ohh cool!

సిరి ఇంకా స్కూల్లో లానే చాలా బోల్డ్ గా ఉంది.

 

మేము ఇలా పరిచయం చేసుకునేలోపే…బస్ హైదరాబాద్ దాటేసింది.

సిరి మా చినప్పటి విషయాలన్నీ చెప్పటం మొదలుపెట్టింది.
తనకి ప్రతి చిన్న విషయం చాలా బాగా గుర్తుంది.

అలా మళ్ళీ మా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాము.

——————————

 

సమయం మ 2:45

బస్ అప్పుడే భోజనం కోసం ఆపారు…మళ్ళీ బస్ స్టార్ట్ అయ్యే సమయానికి, సిరి కి ఫోన్…

తీసి చూసా…”సిరి వాళ్ళ నాన్న”

సిరి మీ నాన్న కాల్ చేస్తున్నారు.

ఒక్క నిమిషం అర్జున్ అంటూ…తాగేసిన వాటర్ బాటిల్ డస్ట్ బిన్ లో పడేసి వచ్చి ఫోన్ తీసుకుంది.

“హల్లో…నాన్న నేను already half the way. మీరేమీ భయపడకండి నాన్న నేను మీకు కాల్ చేస్తూ ఉంటాను. అమ్మకి కూడా చెప్పండి. నేను జాగ్రత్తగా ఉంటాను” అని పెట్టేసింది.

 

ఇద్దరమూ బస్ ఎక్కి కూర్చున్నాము.

అప్పుడు అడిగాను సిరిని…

ఎక్కడికి వెళ్తున్నవు సిరి, అమ్మ నాన్న ఎందుకు అంత కంగారు పడుతున్నారు?

సిరి:- సోలో ట్రిప్ కి అర్జున్. ఆల్మోస్ట్ 2 సం. నుండి ట్రావెల్ చేస్తున్నా. ఎప్పుడు ఫ్రెండ్స్ గ్రూపుతో వెల్లేదాన్ని. ఈ సారి ఒక్కదాన్నే వెళ్లి కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని అనుకున్నా.

 

—————

సోలో ట్రావెలింగ్ – నా డ్రీమ్ లైఫ్..నేను 2సం. నుండి ప్లాన్ చేస్తూ…కలలు కంటున్న జీవితం. కానీ సిరి 2సం. నుండి ట్రావెల్ చేస్తుంది.

ఎక్కడికి ఈ సోలో ట్రిప్ సిరి?

సిరి:- హిమాచల్ ప్రదేశ్ లో హిక్కిం కి అర్జున్. వరల్డ్ లోనే highest Altitudeలో ఉన్న పోస్ట్ ఆఫీసు కి!
అక్కడికి వెళ్లి అంతా ఎక్స్ప్లోర్ చేసి…నేను ప్రేమించే వాళ్ళందరికీ అక్కడి నుండి పోస్ట్స్ పంపించాలి అని ప్లాన్. నా ఫస్ట్ సోలో ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకున్నా.

తను అలా చెప్తుంటే…

బహుశా…నేను ఛాయిస్ లతో బ్రతికి ఉంటే…అచ్చం తనలా ఉండేవాడినేమో!
సిరి నాకు…నేను కలలు కన్న లైఫ్ ని లీడ్ చేస్తున్న నా లేడీ వెర్షన్ లా అనిపించింది.

అందుకేనేమో…ఇన్ని సం. తరువాత కలిసినా తనకి చాలా దగ్గరయ్యా.

సిరి:- ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు…?

సిరి అలా అడగగానే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.

ఎం లేదు సిరి నాకు నీలాగే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్ లో ఇలానే ట్రావెల్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్న.
ఎప్పటికైనా…జాబ్ మానేసి ట్రావెల్ చేయ్యాలి అని ప్లాన్.

 

సిరి:- ఎప్పటికైనా…అంటే?

సిరి అలా అడిగేలోపు మొత్తం బ్లాంక్ అయిపోయా.

సిరి:- చెప్పు అర్జున్…!

తెలియదు సిరి.

 

——————————–

సిరి:-

ఫ్యూచర్ ప్లాన్ అని అన్నావు కదా ట్రావెల్ చెయ్యడం. ఇంకో 10సం. పోతే నువ్వు ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనుకున్న ఏ ప్లేస్ ఇలా ఉండదు అర్జున్. చాలా మారిపోతుంది.
అంత సెక్యూర్ అనుకుంటున్నావా మన ఫ్యూచర్…ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అర్జున్.

మన క్లైమాటిక్ కండీషన్స్, పొల్యూషన్ వల్ల వాటి అందం అంతా పోతుంది. అప్పుడు చూసి ఎం చేస్తావు అర్జున్.

ముందు నేను నీలనే ఆలోచించే దాన్ని అర్జున్…

ఇది చేస్తే ఏమవుతుంది…అధు చేస్తే ఏమవుతుంది అని.
మెల్లిగా నాకే అర్థమైంది…ఈ ఆలోచనలే నన్ను ఏది చెయ్యనివ్వకుండా ఆపేస్తున్నాయి అని.

మనం అనుకున్నవి అన్ని జరగవు అని అనుకుంటాము అర్జున్…అది చాలా తప్పు. నిజం ఏంటంటే మనం చెయ్యము.

చెయ్యడం మానేసి…చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తాము. అక్కడే
ఆగిపోతాము.

———————————

 

సమయం సా 6:30

ముంబైలో లాస్ట్ స్టాప్…
Chhatrapati Shivaji Maharaj International Airport

సిరి చెప్పిన ప్రతిమాట నా ఆలోచనలలో ఆగిపోయాయి. నాకేం చెయ్యాలో అర్ధం కాక బస్ దిగి అలాగే మౌనంగా ఉండిపోయా..!

సిరి:- నీ ఫ్లైట్ ఎంతకు అర్జున్?

8:45కి సిరి, మరి నీ ఫ్లైట్?

సిరి:- నా ఫ్లైట్ 7:15కి అర్జున్.

I’m very happy to meet you .
నీ ఫ్యూచర్ ప్లాన్స్ ని ఫ్యూచర్ లో కాకుండా…ఇప్పటి నుండే చెయ్యడం మొదలుపెట్టు.
All the best Arjun for your career and journey.

బై అర్జున్!

సిరి ఒక్క 10నిం!

 

సిరి:- హా….ఓకే అర్జున్!

సిరి నీకో విషయం చెప్పాలి.

సిరి:- చెప్పు అర్జున్…!

నాకు నీతో రావాలి అను ఉంది సిరి. చాలా ఆలోచించాను నీ సోలో ట్రిప్ స్పాయిల్ చెయ్యకూడదు అని. But I really want to come with you siri.

 

సిరి:- మరి మీ ఫ్రెండ్ పెళ్లి?

అక్కడికి వెళ్ళినా నేను నీతో రాలేదు అనే రిగ్రెట్ ఉంటుంది సిరి. ఐ డోంట్ వాంట్ థట్.

సిరి:- మరి నీ ఆఫీస్ ఎలా?

ప్రాబ్లెమ్ లేదు మెయిల్ చేశాను.

సిరి: ఓ అందుకేనా 10నిమి….ఎన్ని రోజులు లీవ్ పెట్టావ్ ఏంటి??

పర్మనెంట్ గా..!

 

సిరి:- వాట్…???

అవును సిరి రెసిగ్నషన్ మెయిల్ పంపాను.
నువ్వు చెప్పింది నిజమే సిరి నేను ఏదో పెద్దగా ప్లాన్ చెయ్యాలి అని ఇప్పుడు అంతా బాధపడుతున్నా…
ఎప్పుడో హ్యాపీగా ఉండాలని ఇప్పుడు హ్యాపీనెస్ ని వదిలేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనిపించింది.
వస్తుందో లేదో తెలియని ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఐ కాంట్ టేక్ ఛాన్స్ సిరి.

సిరి:- wow అర్జున్…చాలా మార్పు, అదీ చాలా ఫాస్టుగా!
ఛలో మరి…ట్రిప్ కి ఎన్ని రోజులు పడుతుందో తెలుసు గా ఆల్మోస్ట్ వన్ మంత్. ఓకే గా నీకు?

” ఇక నువ్వు నడిచే దారే నా ప్రయాణం”
అని చెప్పాలి అనుకుని….చెప్పలేక….

 

Yeah సిరి. Absolutely fine అని అన్నా!

వెంటనే సిరి ఫ్లైట్ కే టికెట్ తీసుకున్నా.
తనతో ఏర్పోర్ట్ లో నేను గడిపిన ఆ రెండు గంటలే…నా జీవితంలో నేను నాలా ఆనందంగా ఉన్న క్షణాలు.
అదేంటో తనతో మాట్లాడుతుంటే…నాకు నేనే నచేస్తున్నా.

——————————-

ఇద్దరము మనాలి కి ఫ్లైట్ ఎక్కాము…

సిరితో చాలా మాట్లాడాలి అని ఉంది…చాలా అడగాలి అని ఉంది కానీ ఎందుకో ఆగిపోతున్నా.

ఇంతలో….

 

సిరి:- అర్జున్…జాబ్ వదిలేసావు. మరి ప్లాన్ ఏంటి?

అదే అడుగుదాం అని అనుకుంటున్నా సిరి.
అసలు ఎలా మ్యానేజ్ చేస్తున్నావు ఇదంతా నువ్వు. ప్యాషన్ + వర్క్
నిజం చెప్పనా…చాలా జలస్ గా ఉంది నిన్ను చూస్తుంటే…ఏ భయం లేకుండా యు ఆర్ లివింగ్ యువర్ డ్రీమ్ లైఫ్ ఎలా సిరి??

సిరి:- నేను కూడా స్టడీస్ అవ్వగానే జాబ్ చేద్దాం అనుకున్న అర్జున్. కానీ నేను జాబ్ చేస్తే నా ప్యాషన్ ని ఫాల్లో అవ్వలేను అని తెలుసు నాకు.
అందుకే “వర్క్ ఫ్రమ్ హోమ్” చేసే జాబ్స్ కోసం చాలా రిసెర్చ్ చేసా.

ఇప్పుడు ఉన్న కొన్ని డిజిటల్ టెక్నాలజీస్ లో కోర్సెస్ చేశా అందులోనే ఫ్రీలన్సెర్ జాబ్ సెర్చ్ చేసుకున్న. అలా ఒకేసారి ఒక 3-4 ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తాను 2-3 నెలలు. తరువాత ఇదిగో…ఇలా…

మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా ఇలా….నువ్వు ఓన్లీ daughter కదా?

 

సిరి:- నేను ఎలా చెయ్యాలి అని అనుకుంటున్నా…నా ప్లాన్ ఏంటి అని వాళ్ళకి క్లియర్ గా చెప్పాను అర్జున్.
అండ్ నా ఫ్యాషన్ వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడటం కరక్ట్ కాదు కదా…అందుకే మొదట్లో ఒక సం. అంతా ఎలాంటి ప్లాన్స్ లేకుండా కొన్ని ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేశాను. ఇప్పుడు ఇలా..
.

సూపర్ సిరి.

>సిరి:- నేను ఎప్పుడు అమ్మా నాన్న ముందే ఉంటు…వాళ్ళని బాగా చుస్కుంటు ఉంటే…వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ.

సిరి అలా చెప్తుంటే…తనపై ఉన్న ప్రేమ గౌరవం అన్ని మేము ఎగురుతునన్నంత ఎత్తుకు చేరుకున్నాయి.
బహుశా…ఇంతకంటే ఎత్తులో ఉంటే అక్కడికి కూడా చేరుకునేవేమో….!

అప్పుడు మా మ్యానేజర్ అన్న మాట గుర్తొచ్చింది…

” నువ్వేమీ critical resource” కాదు

ఎవరి కోసం అవ్వాలి…తొక్కలో ప్రాజెక్ట్…బోంగులో క్రిటికల్ రిసోర్స్…

అప్పుడే ఫిక్స్ అయ్యా…

సిరినే నా లైఫ్ ప్రాజెక్ట్…తనకి వన్ అండ్ ఓన్లీ క్రిటికల్ రిసోర్స్ నేనే అవ్వాలి అని.

 

——————————

ఫ్లైట్ మనాలిలో లాండ్ అయింది…

అక్కడి నుండి స్పిటి వ్యాలి – హీక్కిం కి క్యాబ్ తీసుకున్నాము.
తనేమో…మంచు కొండల్ని చూస్తుంది.
నేనేమో…తనని.

ఆ మంచు కొండల్ని తనని కలిపి చూస్తుంటే…”డివైన్” అనే ఒక పదం ఉందని గుర్తొచ్చింది.

వరల్డ్ లోనే highest Altitude లో ఉన్న పోస్ట్ ఆఫీసు ను చేరుకున్నాము…

నేను – మంచు కొండలు – చలి – సిరి…
ఇంతకంటే ఇంకేం కావాలి లైఫ్ కి అని అనిపించింది.

 

సిరి తను అనుకుననట్టుగానే తను ప్రేమించే వాళ్ళందరికీ పోస్టు కార్డ్స్ పంపుతుంది.

తన వెంటే వెళ్లి నేను కొన్ని తీసుకున్నా….

సిరి:- ఏంటోయ్….నువ్వు ఎవరికి పంపుతున్నావు.
నిన్ను ప్రేమించే వాళ్ళకా…నువ్వు ప్రేమించే వాళ్ళకా???

తను అలా అడగగానే నాకేం అర్థంకాలేదు… చాలాసేపు ఆలోచించా.
అప్పుడు డిసైడ్ అయ్యా!

 

నన్ను ప్రేమించే వాళ్ళకే పంపుతున్నా…సిరి. అమ్మా నాన్నకి పంపుతున్నా!

ఎందుకంటే,
నేను ప్రేమించే మనిషి నా పక్కనే ఉంది కదా….!

అలా… గమ్యం లేని ప్రయాణం చేస్తున్న నాకు, తనే గమ్యం అయింది.

THE END

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,