Watched ‘Sye Raa..’ ? I Bet You Wouldn’t Have Noticed This Deeper Meaning In The Lyrics Of BGM

 

రెండేళ్లు ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నటీ నటుల కృషి, మెగాస్టార్ ని తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అభిమానుల ఆశల నడుమ సైరా విడుదలయ్యింది. చిరంజీవి నటనా నైపుణ్యం ఇంకోసారి తెరపై వీర విహారం చేస్తోంది. ఈ మూవీ లో సైరా నరసింహ రెడ్డి గా చిరంజీవి రౌద్రం ప్రదర్శిస్తున్న ప్రతీసారి వెనక ఒక శ్లోకం రావడం మీరు గమనించే ఉంటారు (ఒకవేళ గమనించకపోతే, ఈ సారి గమనించండి). ఆ శ్లోకం ఏంటో దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

 

ఈ శ్లోకాన్ని “రుద్రాష్టకం” నుంచి తీసుకున్నారు. “హనుమాన్ చాలీసా” రాసిన పంత్ తులసి దాస్ “రామ చరిత మానస్” లో భాగంగా ఈ శ్లోకాన్ని రాసారు. రామ చరిత మానస్ లో “ఉత్తర కాండం” లో ఉంటుంది ఈ శ్లోకం. 8 శ్లోకాలు కాబట్టి అష్టకం అంటారు. శివుడు రుద్ర రూపం లో ఉన్నప్పుడు అతనిని వర్ణించిన అష్టకం కాబట్టి రుద్రాష్టకం.

 

శ్లోకం:
నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం

 

Meaning:
I bow to the Ruler of the Universe, whose very form is Liberation,
the omnipotent and all pervading Brahma, manifest as the Vedas.
I worship Shiva, shining in his own glory, without physical qualities,
Undifferentiated, desire less, all pervading sky of consciousness
and wearing the sky itself as His garment.

 

అర్ధం:
ఈ లోకానికి అధిపతి అయినటువంటి స్వేచ్ఛకి రూపమైన శివునికి నమస్కరిస్తున్నాను. శివుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మవేదాలను తనలో పొందుపరుచుకుని ఉన్నాడు. తనే ఈ సమస్తం. తను ఆశలకు అతీతుడు. ఆకాశం అంతటి జ్ఞానం కలవాడు అతను. ఆకాశాన్ని వస్త్రంగా ధరించింది తనే.

 

శ్లోకం:
నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం

 

Meaning:
I bow to the supreme Lord who is the formless source of “OM”
The Self of All, transcending all conditions and states,
Beyond speech, understanding and sense perception,
Awe-full, but gracious, the ruler of Kailash,
Devouter of Death, the immortal abode of all virtues.

 

అర్ధం:
ఓంకారానికి మూలమైన శివునికి ఎప్పుడూ తలొంచి నమస్సులు తెలియజేస్తాను. అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో అతనే నిండి ఉన్నాడు. అతను మన ఊహలకి, మాటలకి అందడు. అతనిని అర్ధం చేస్కోవడం అసాధ్యం. అతని చర్యలు ఊహాతీతం. అతని కృప ని వర్ణించలేము.చావుకి అధిపతి తను, చావుకి అతీతం తను.

 

శ్లోకం:
ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ

 

Meaning:
I worship Shankara, whose form is white as the Himalyan snow,
Radiant with the beauty of countless Cupids,
Whose head sparkles with the Ganga
With crescent moon adorning his brow and snakes coiling his neck,

 

అర్థం:
హిమాలయ మంచులా తానే ఉన్నాడు. ఎంతోమంది మన్మథులకి సమం అతను. గంగ వల్ల మెరుస్తున్న శిరస్సు అతనిది. ఆ శిరస్సుకి అలంకారంగా చంద్రుణ్ణి, మెడకి హారంగా పాముని ధరించి ఉన్న సుమానోహర రూపం అతనిది.

 

శ్లోకం:
జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం

 

Meaning:
The beloved Lord of All,
with shimmering pendants hanging from his ears,
Beautiful eyebrows and large eyes,
Full of Mercy with a cheerful countenance and a blue speck on his throat.

 

అర్థం:
సురులకి, అసురులకి ప్రేమ పాత్రుడైన దేవుడతడు. మృగపు చర్మం అతని వస్త్రం. పెద్ద కళ్ళు, అందమైన కనుబొమ్మలు, దయతో నిండిన హృదయం, విషాన్ని దాచిన గొంతు శివునిది.

 

శ్లోకం:
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం

 

Meaning:
I worship Shankara, Bhavani’s husband,
The fierce, exalted, luminous supreme Lord.
Indivisible, unborn and radiant with the glory of a million suns;
Who, holding a trident, tears out the root of the three-fold suffering,
And who is reached only through Love.

 

అర్థం:
అతను, శతృ భయంకరుడు, లోక నాయకుడు, కోటి సూర్యులు సమమైన ప్రకాశవంతుడు. అతనిని విభజించలేము. త్రిశులాన్ని ధరించిన తనే మనల్ని నడిపించాలి.

 

శ్లోకం:
కాలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః
చిదానంద సందోహ మోహాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః

 

Meaning:
You who are without parts, ever blessed,
The cause of universal destruction at the end of each round of creation,
A source of perpetual delight to the pure of heart,
Slayer of the demon, Tripura, consciousness and bliss personified,
Dispeller of delusion…
Have mercy on me, foe of Lust.

 

అర్థం:
జనన మరణాలకు కారణం తనే, నిర్మలమైన ఆనందానికి, స్వచ్ఛమైన హృదయానికి ప్రతీక తనే. చెడుని సంహరించి, మాలోని చెడుని అణిచి వేసి మమ్మల్ని రక్షించు.

 

శ్లోకం:
నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా

 

Meaning:
Oh Lord of Uma, so long as you are not worshipped
There is no happiness, peace or freedom from suffering
in this world or the next.
You who dwell in the hearts of all living beings,
and in whom all beings have their existence,
Have mercy on me, Lord.

 

అర్థం:
నిన్ను పూజించకపోతే, అక్కడ ఆనందం ఉండదు, స్వతంత్రం ఉండదు. అందరి హృదయాల్లో స్థానం నీకుంది. మా అందరి ఉనికి లో నీవున్నావు. అందరికి నీ దయ అవసరం.

 

శ్లోకం:
నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో

 

Meaning:
I don’t know yoga, prayer or rituals,
But everywhere and at every moment, I bow to you, Shambhu!
Protect me my Lord, miserable and afflicted as I am
with the sufferings of birth, old-age and death.

 

అర్థం:
నాకు పూజలు, యాగాలు తెలియవు. కానీ ప్రతి చోట, ప్రతి క్షణం నిన్నే స్మరిస్తుంటాను. నన్ను అన్నివేళలా, నేను పడే అన్ని బాధల నుండి నన్ను రక్షించాల్సినది నువ్వే..

 

హీరో పాత్రని లేదా సన్నివేశాన్ని elevate చేయడానికి ఈ మధ్య ఇలా శ్లోకాలను compose చేస్తున్నారు. దీనివల్ల తరువాతి తరాలకి మనదైన రచనలు, విలువలు తెలుస్తాయి. ఒకప్పుడు ఇతిహాసాలను గ్రంథాలుగా రాసేవారు, తరువాత నాటకాలుగా ప్రదర్శించేవాళ్ళు, తరువాత సినిమాలు గా తీస్తున్నారు. పద్దతి వేరైనా విషయం మాత్రం ఎప్పటికి ఒకటే. సైరా లో రుద్రాష్టకం లో శివుని వర్ణించిన ప్రతి ఒక్క గుణాన్ని కథానాయకుడికి చక్కగా అన్వయించారు. శివుని లోని రౌద్రం, వీరత్వం, దయా గుణం, తెలివి, చాతుర్యం, ఈ గుణాలన్ని, సైరా పాత్ర లో ఇమిడిఉంటాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎందరో స్వతంత్ర సమరయోధులు వారు ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికి చావులేనిది. వాళ్ళందరు శివుని రూపాలే, వాళ్లందరికీ ఇవే మా నమ్మస్సులు.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , ,