What If Swami Vivekananda’s Statue Spoke to You!
నేను నీకు ఆదర్శం అనుకుంటే
నేను ఒక మట్టి విగ్రహాన్ని మాత్రమే.
నేను నీకు ఉత్తేజం అనుకుంటే
నేను ఒక ఉత్ప్రేకం మాత్రమే.
నా మాటలని నా జీవితాన్ని మత్తులో ముంచే మలినం స్తాయి కి దించినట్టే.
నేనే నువ్వు,
నా నుంచి వచ్చినవి నీ భావాలే!
అందుకే అవి నీకు అర్ధం అవుతున్నాయి.
అది గుర్తు పెట్టుకో
గొంతుక మాత్రమే నాది.
”arise! awake! stop not till your goal is reached”
‘ivi’ నా మాటలు కావు.
అదంతా నీ కసి మాత్రమే.
”వంద మందిని ఇవ్వండి మన భారత దేశాన్ని మార్చేస్తా ”
అని నేను అని వందేళ్ళు అవుతున్నా
మన దేశం ఇంకా ఇలా ఉండడానికి కారణం ఇదే.
ఒక్కడివే లెవ్వు
ఒంటరి గా లేవడం, పడడం, మళ్లీ లేవడం లోనే ఉంది ధైర్యం అంతా.
ఒక్కో ఇటుకని పేర్చే అప్పుడు మేస్త్రి
”ఒకే ఇటుక కదా” అని చులకన గా చూసి ఏనాడు నవ్వడు.
అలా ప్రతి ఇటుకకు ఇచ్చే సమాన గౌరవం నుంచే కట్టడాలు వచ్చేవి. అవి గొప్పగా మారేవి.
ఇటుకకి ఇచ్చిన గౌరవం నీ జీవితం లో ఈ రోజుకి ఇవ్వవా?
ఇది గుర్తు పెట్టుకొని లెవ్వు ఈ పొద్దునే, ఉదయించే సూర్యుడి లాగా.
If you wish to contribute, mail us at admin@chaibisket.com