Even After 7 Years, Here’s Why ‘SVSC’ Is The Best Family Film

 

Contributed by Krishna Prasad

రేయ్..

ఏరా..

రేయ్…

ఏరా రేయ్….

నువ్వు..

నువ్వు…పూల కుండినీ ఎందుకు తన్నావ్ రా…?

గత ఆరేళ్ల నుంచి ఈ మాటలను, పెద్ద తెర నుంచి చిన్న తెర వరకు… మన మాటలలో, మన రోజువారీ జీవితంలో.. సరదాకో, సందర్భానికో పలుకుతూనే ఉన్నామ్. ఈ ఒక్కటనే కాదు ఎన్నో… ఈలాంటి ఎన్నో మంచి సుగంధాలు వెదజల్లే పూలు ఉన్న చెట్టు, మన తెలుగువారు మర్చిపోలేని, మన మొహం పై అందమైన నవ్వును విరగబూయించిన చెట్టు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”… అసలు ఏముంది ఈ సినిమాలో అని అనుకుంటున్నారా…(నాకు తెలిసి మీరు అనుకోరు) అయితే చూడండి…

ఈ చిత్రంలో ఉన్నవి:

1. అచ్చ తెలుగు పేరు

” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” బహుశా ఇద్దరు పెద్ద కథానాయకులు నటించే చిత్రానికి ఇలాంటి పేరు పెడతారని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే ఎదో కొత్తగా ఉంటుంది కదా! అని పెట్టకుండా.., ఒక అర్థం, ఒక భావం, చిత్రానికి తగ్గట్టు పెట్టారు ఈ చిత్రానికి ఈ పేరు.


 

2. పాత్రలు

రేలంగి మావయ్య, పెద్దోడు, చిన్నోడు, సీత, గీత, విజయ వాడోల్లు, గూడు రాజు, కొండలరావు ఇవి ఈ చిత్రం లో పేరుతో కనిపించే పాత్రలు. కొన్ని పాత్రలకు పేర్లు కూడా ఉండవు, ఉన్న పాత్రల పేర్లు కూడా చాలా తేలికగా ఉంటాయి. ఇవన్నీ మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. మనం రోజూ చూసే మనుషుల లాగే ఉంటాయి…


 

3. మాటలు

ఎదో పేజీలకు, పేజీలు మాటలు లేకుండా.. అవసరమైనంత వరకు అర్థవంతమైన, ఆలోచింప చేసే, ప్రతి పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, వారు పడే మదనని ఈ మాటలు తెలియజేశాయి. ఒక మాటకు ఉన్న విలువ ఎంటో తెలియ జేస్తాయి ఈ చిత్రంలోని మాటలు. అంతేకాదండోయ్ సరదా మాటలు కూడా ఉంటాయి.


 

4. వినసొంపైన సంగీతం

సంగీతం వినసొంపుగా, ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా, ఎటువంటి వింత పోకడలకు పోకుండా చక్కగా హాయి గొలిపే ల వుండటం, నేపథ్య సంగీతం కూడా సన్నివేశానికి తగ్గట్టు వుండటం అనేది గొప్ప విషయం. ఈ చిత్రంలోనీ మొదటి సన్నివేశం నుంచి చివరి పతాక సన్నివేశాల వరకు అడుగు అడుగునా ఆకట్టుకునే సంగీతం, నేపథ్యసంగీతం సన్నివేశాలను తగ్గట్టు ఉంటూ, మనకు మరింత మంచి అనుభూతిని కలగచేస్తాయి…


 

5. మంచి సాహిత్యం

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు అందించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే… సన్నివేశాన్ని వివరిస్తూనే, నేటి మనిషి జీవితాన్ని, మనం పడుతున్న ఆరాటాలను, అర్థంలేని ఆలోచనలను తెలియజేస్తూ…, మనసారా నవ్వమంటు నవ్వు విలువను, గొప్పతనాన్ని చెప్పారు వీరు… ఇక సిరివెన్నెల గారు రాసిన మరి అంతగా పాట లోని సాహిత్యం అయితే అద్భుతమనే చెప్పాలి.. ఆ పాటలోని కొన్ని చరణాలు :

ఎండలను దండిస్తామ.. వానలను నిందిస్తామ.. చలి నేటో తరిమేస్తమా.. ఛీ పొమ్మని
కస్సుమని కలహిస్తామ.. ఉస్సురని విలపిస్తామ.. రోజులతో రాజీ పడమ, సర్లేమ్మని…
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం..
పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెబుతాం..?
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా..? కదా! మరెందుకు గోల…
అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల…

చెమట లెం చిందించాలా, శ్రమపడెమ్ పండించాలా పెదవి పై చిగురించెల చిరునవ్వులు..
కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల
సుఖశాంతులు
మనుషులని పించే రుజువు
మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు
వందెళ్ళయిన వాడని చిరునవ్వు
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల

మరొకటి:

“బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే బ్రతుకెల వుండాలో నువ్వే నేర్చుకో అనుకున్న వన్ని అవవు అడుగడుగునా ఎదో కరువు అందుకే కమ్మని కలలు సరి చూసుకో…”

ఇక “మేఘాల్లో” పాట విన్నప్పుడు అయితే మన ఇంట్లో పెళ్లి జరుగుతుందా అన్నట్టు వుంటుంది ఆ సాహిత్యం, ఆ సంగీతం…
చిత్ర గారు, శ్రీరామ్ గారి లాంటి గాయకులు తమ తియ్యని స్వరం తో ప్రతి పాటని ఒక సుమదర గీతంగా మలిచారు.

7. సహజ నటన

అందరూ మంచోల్లే, అసలు మనిషి అంటేనే మంచోడు అని నమ్మే ఒక మధ్య తరగతి తండ్రి , నిరుద్యోగి అయిన, తనకు నచ్చినట్టు ఉంటు..ముక్కుసూటిగా ఉండే పెద్ద కొడుకు, సరదా, సరదాగా ఉండే నేటి యువకుడి లా చిన్నోడు, ప్రతి ఇంట్లో వుండే నిండైన ఒక బామ్మ, ప్రేమగా చూసుకునే తల్లి, ఆప్యాయతలను పంచే చెల్లి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధిమేర చాలా సహజంగా ఎటువంటి అతికి పోకుండా, ఎబ్బెట్టుగా కాకుండా పాత్రలలో పరకాయ ప్రవేశము చేశారు.


 

8. అన్నదమ్ముల అనుబంధం

ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల లాగే సరదా మాటలు, కోపాలు, అలకలు, ప్రేమలు ఈ చిత్రంలో నీ పెద్దోడు చిన్నోడు కి ఉంటాయి. స్పర్ధలతో విడిపోయిన మళ్లీ తన అహాన్ని పక్కన పెట్టేసి మళ్లీ మాట్లాడుకునే సన్నివేశాలు అయితే బాగున్నాయి..అని చెప్పటం కూడా తక్కువే..

లేనివి

8. ద్వందార్ధ సంభాషణలు

అక్కరలేని, అవసరం లేని సంభాషణలు, ద్వందార్ధ మాటలు లేకుండా… సాఫీగా చెవులకి ఇంపుగా, ఆహ్లాదకరంగా ఉండే సంభాషణ లు మాత్రమే ఉన్నాయి ఈ చిత్రంలో…

9. కధానాయికల అనవసరమైన అందాల ఆరబోత

ఇద్దరు కథా నాయికలు ఉన్నా సరే ఎటువంటి అందాల ఆరబోతకు తావు ఇవ్వకుండా.. సంప్రదాయాలకు విలువనిస్తు, కనిపించే ప్రతి స్త్రీ పాత్రను, వారి కట్టు బొట్టును గొప్పగా తీర్చిదిద్దారు శ్రీకాంత్ అడ్డాల గారు.

10. మితిమీరిన హింస

భారీ పోరాటాలు, మిగిలిన పాత్రల ఆరాటాలు, శత్రువుల అరుపులు లాంటి ప్రతి సినిమాలో ఉండే విసుగు తెప్పించే రొట్టలు లేవు దీనిలో….

11. వెగటు పుట్టించే హాస్యం

ఈ చిత్రం విడుదల అయ్యే సమయానికి హాస్యం అంటే “చెంప దెబ్బలు”. కధానాయకుడు హాస్య నటుడునీ ఎన్ని చెంప దెబ్బలు కొడితే సినిమా దానిలోని హాస్యం అంత పెద్ద విజయం సాధించినట్టు,అంతా బాగా పండినట్టు… అయినప్పటికీ ఎటువంటి గొప్పలకు పోకుండా, ఉన్నవాళ్ళతోనే సందర్భానికి తగ్గట్టు హాస్యాన్ని పండించారు ఈ చిత్రంలో…

12. ప్రత్యేక నృత్యాలు

ఇది లేకుండా సినిమా అంటే చాలా సాహసమేనండి. పెద్ద కధానాయకుడు వుంటేనే తప్పకుండా ఉండాలి. . పైగా ఇద్దరు పెద్ద కథానాయకులు అయినప్పటికీ కథను నిజాయితీగా చెబుతూ, ఎటువంటి అశ్లీలత లేకుండా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిపారు.

ఇంతే కాకుండా ఇంకా ఎన్నో మరెన్నో ఉన్నాయి, లేవు ఈ చిత్రంలో…

అలకలు, అనుబంధం ఆప్యాయతలు, అల్లరులు, ప్రేమలు, విలువలు ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, అలా ఉన్నపుడే, ఇలాంటి కుటుంబాలు ఉన్నపుడే, ఇలాంటి కుటుంబాలు ఉన్న ఊర్లు, రాష్ట్రాలు, దేశాలు అన్ని ప్రేమమయమే అని చాటిచెప్పింది, అలాగే అచ్చమైన కుటుంబకథా చిత్రంగా నిలిచింది ఈ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం. మనకి ఎప్పటికీ మరవలేని ఒక అందమైన జ్ఞాపకమై…


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,