Surabhi – The Group Which Is Keeping Telugu Theatre Tradition Alive Since Years!

 

ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది, ప్రతి కళ వెనుక ఒక కథ ఉంటుంది. ఫ్రతి కథ లోను వ్యధ ఉంటుంది.కూటి కోసం కోటి విద్యలు అన్నారు అలాంటిది డబ్బు ముసుగు లో కోట్లు సంపాదించాలని ఆ కూడు పెట్టిన కళను వదిలెయ్యకుండా ఎన్నో సంవత్సరాలుగా నాటకాలను ఆడుతూనె ఉన్నారు.రంగస్థలమే ఆధారంగా బ్రతుకుతున్నారు, రంగస్థలాన్ని బ్రతికిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర నాట్యమండలి.


సురభి అనే పేరుతో మనందరికీ సుపరిచితం. సురభి నాటకం అంటేనే ఎన్నో మ్యాజిక్కులు, జిమ్మిక్కులు, పెద్ద పెద్ద సెట్లు, ఒక తెలియని కొత్త ప్రపంచంలోకి మనల్ని తీస్కువెళ్తారు. ఆ రంగుల లోకం వెనుక ఎంతో కష్టాలు, ఇంకెందరివో కన్నీరు దాగున్నాయి.


సినిమాలు, సీరియల్ లు ఇపుడు యూట్యూబ్… ఇప్పటి ఈ ఇంటర్నెట్ కాలంలో నాటకాలు ఎవరు చూస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ నాలుగు సంపాదించితినికో , నలుగురి చప్పట్లు వినటానికో వారు ఇది చెయ్యట్లేదు. ఒక కళని బ్రతికిస్తున్నారు, తమకు అన్నం పెట్టిన కళను ఆదరిస్తున్నాం అనే ఒక ఆత్మ సంతృప్తి తో బ్రతుకుతున్నారు


సురభి నాటకమండలి ఒక కుటుంబం. పిల్లా , పెద్దా, పిల్ల- జల్లా అందరూ ఇందులో భాగమే . ఉదయాన్నే కాలేజీకి వెళ్లి రాత్రికి స్టేజి మీద నాటకాలు వేసేవారు. పల్లెకే పరిమితమయిన ఈ నాటకాలకు, ఇపుడు హైదరాబాద్ మహానగరం ఆస్థానం అయ్యింది. ప్రతి శని, ఆది వారాలు పబ్లిక్ గార్డెన్స్ లో వీరి నాటక ప్రదర్శనలు ఉంటాయి. సురభి నాటక మండలి వారి గురించి, వారి రంగు రంగుల set వెనకాల జరిగే కన్నీటి యుద్ధాల గురించి, కళకి కష్టాలకి మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి, మరెన్నో సురభి విశేషాలతో Chai Bisket మీకోసం exclusiveగా వారి జీవితాలను మీకు దగ్గరగా తీసుకువచ్చింది.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,