This Story About The Struggles Unemployed Youth Face Today Is Something You Will Surely Relate To!

 
ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు సూర్య
Father Opens the Door
Surya enters home
Father asks Surya – ఏరా … ఇంటర్వ్యూ ఎలా జరిగింది … ఏం అన్నారు ??
సూర్య – హా బానే జరిగింది నాన్నా . మెయిల్ లో respond అవుతాం అన్నారు
నాన్న – హ్మ్మ్ … ప్రతీసారి ఇదే అంటున్నారు …ప్చ్ ….
Mothers Voice from background – అబ్బా,రాగానే అడిగి విసిగిస్తారేంటండి ,… నాని ..త్వరగా స్నానం చేసిరా ….నేను వడ్డించేస్తాను … నాన్న కూడా నీకోసమే ఎదురుచూస్తున్నారు.. వెళ్లి ఫ్రెష్ అయ్యిరా .
(మొహం కడుక్కొని బయటికి వస్తున్న సూర్య హాల్ లో తనకి బంధువు వరుసకు బాబాయి ని చూసి వెంటనే తన రూమ్ లోకి తిరిగివెళుతుండగా ,సూర్య ని గమనించిన బాబాయి)

Relative to Surya – ఏంటి సూర్య ఎలా ఉన్నావ్. ఎం చేస్తున్నావ్.
సూర్య – బానే ఉన్నానండి . ఏం లేదు ,Job trails లోనే ఉన్నాను .
Relative – ఇంకానా , Fast గా ఉండాలమ్మా . బయట చూడరా ఎలా పరిగెడుతున్నారో అందరూ . అంతెందుకు మన సుకుమార్ చూడు నీకంటే మూడేళ్లు చిన్న , ఫైనల్ ఇయర్ లోనే క్యాంపస్ ప్లేసెమెంట్ వచేసింది . నెలకి లక్ష సంపాదించేస్తున్నాడు . ఇప్పటికే నీ గ్రాడ్యుయేషన్ అయిపోయి రెండేళ్లయింది . ఇంకా Job లో జాయిన్ అవకపోతే ఎలా . …ఏమ్మా పీజీ కూడా చేరలేదు కదా … రెండేళ్లు ఖాళీగా ఉన్నావంటే కష్టమే…ఖాళీగా ఉంచకూడదండి పిల్లల్ని , ఎదో ఒక దాంట్లో చేరిపొమ్మనాలి . బద్ధకం ఒచ్చేస్తుందండి , బయట చూస్తున్నాం కదా . కష్టం అంటే ఏంటో తెలియాలండీ . ఇలా ఖాళీగా ఉంటె ఏవేవో అలవాట్లు ఒచ్చేస్తాయ్ , ఎదో ఒకటి చేస్తుండాలి .మీ నాన్నకి నీ గురించేరా కంగారు , త్వరగా ఎదో ఓటి చిన్నదో పెద్దదో చేరిపోవాలి,మా వాడ్ని చూడు ………
సూర్య – సరే బాబాయ్ (Surya tries to leave the hall ) ……..
Relative – రారా కూర్చో .. నీతో మాట్లాడదాం అనే ఉన్నాను . (Surya stays in hall and hesitatingly listens to his relative) ….and Relatives advice continues…..
కాస్త seriousness ఉండాలమ్మ లైఫ్ మీద , పాతికేళ్ళు ఒచ్చేసాయ్ ఇంకా ఇలా ఉంటె ఎలా . అదే మన సుకుమార్ ని చూడు…………
Surya interrupts ……..and starts talking……….

సూర్య – బాబాయ్ సుకుమార్ చదువు వేరు ,నా చదువు వేరు . వాడు వేరు ,నేను వేరు . వాడ్ని హీరోగా project చేయడానికి నన్ను జీరో లా తీసిపారేయాల్సిన అవసరం లేదు . పనిలేనోడంటే పనికి రానొడని కాదు , పైకి రాలేనోడనీ కాదు . . బాబాయ్ నేను ప్రపంచంతో పరిగెత్తకపోవొచ్చు కానీ నా ప్రయత్నాలని ఎప్పుడూ ఆపలేదు .
లక్షలు సంపాదించాలంటే ఎన్నో దారులున్నాయి ..కానీ
లక్ష్యాన్ని సాధించాలంటే ఒకే దారుంది .
Single తీయాలంటే ఏ బాల్కైనా తీయొచ్చు కానీ Sixer కొట్టాలంటే మాత్రం కరెక్ట్ షాట్ కనెక్ట్ అయ్యేదాకా ఆగాలి ..
బాబాయ్ మీకు బయట competition గురించి అంతగా తెలీదేమో . మా situation గురించి అసలు తెలీదు .
Private Jobs కి Reference ,Recommendation కావాలి
Government Job కొట్టాలంటే Reservations తో పోటీపడాలి
అసలు మా పరిస్థితి మీకు అర్ధం అవుతుందో అవ్వదో నాకు తెలీదు . కానీ మేమేమి దర్జాగా తిని తిరగట్లేదు , హాయిగా ఇంట్లో కూర్చొని టైంపాస్ చెయ్యట్లేదు .

కన్నతండ్రిని పది రూపాయిలు అడగడానికి కూడా మొహమాటం …..
బాధ్యత తీసుకోవాల్సిన వయసులో ఇంకా బరువుగా మిగిలున్నా అనే ఆందోళన,
పాతికేళ్ళొచ్చినా ఇంకా అమ్మా నాన్నని కష్టపెడుతన్నాననే భాద …….
ఓడిపోతున్నాననే వేదనకి సాధించాలనే తపనకి ఓ మధ్య చేసే సంఘర్షణ,
సర్దుకుపొమ్మని చెప్పే అవసరం … సాధించితీరాలనే ఆశయం,
చేతకాదు చేయలేమంటూ మీలాంటి వాళ్ల పెదవివిరుపులు,
రోజుకోసారి కన్నీటి చుక్కల పలరింపులు,
బయటికెళ్తే మీలా మాట్లాడేవాళ్ళ వల్ల negativity . ఎప్పుడూ ఇంట్లోనే ఉంటె ఎదో inferiority….
చెప్పుకునేంత కష్టాలు లేకపోవొచ్చు కానీ చెప్పలేని భాదలు ఉంటాయి బాబాయ్ మాక్కూడా.
కష్టపడి చదివి రాసిన ప్రతీ exam లో ఒకటి అరా మార్కుతో మిస్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు . వెళ్లిన ప్రతీ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వకపోతే ఎంత భాద ఉంటుందో నాకు తెలుసు , ఎలా ఉన్నా లేని ధైర్యం కూడబెట్టుకొని ముందుకు అడుగేస్తుంటే మీరు ఇలా మాట్లాడుతూ ఎందుకు బాబాయ్ వెనక్కి లాగేస్తారు.

మీ అనుభవం నుండి చెప్పండి నేర్చుకుంటాం …నాకు తెలియంది చెప్పండి తెలుసుకుంటా encourage చేయండి energy ఇచ్చినవాడివి అవుతావు ….motivate చేయండి ధైర్యం చెప్పిన వాడివవుతావ్. అంతే కానీ అస్తమానం దెప్పిపొడవకు . నేను చేసేది నీకు నచ్చితే పట్టుదల అంటావు ,నచ్చకపోతే మూర్కత్వం అంటావ్ ,
బాబాయ్ నువ్వేదో అన్నావని,ఇంకేదో అనుకుంటావని ఇదంతా చెప్పలేదు.
నేను అంటే నీకు కనిపించే నేను మాత్రమే కాదు.
నాలాంటి ప్రతి వాడి మనసులో ఓ నిప్పు ఉంటుంది .పడిపోయిన ప్రతీసారి ఓడిపోయిన ప్రతీ క్షణం లేచి పోరాడాలని రక్తాన్ని మరిగిస్తుంది ఆ నిప్పు .ప్రతీ రోజూ నీ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలతో వచ్చే భయాన్ని కాల్చేస్తుంది ఆ నిప్పు .ఎక్కడ ఎలా అడుగేయాలో దారి చూపిస్తుంది ఆ నిప్పే …. నాలో ఆ ఫైర్ ఉన్నంత కాలం నీ మాటలు పెద్దగా నా చెవిలో పడవు ….. అందుకే ఇదంతా చెప్పాల్సొచ్చింది
ఉంటా మరి………….

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,