నాకు మాట్లాడడం రాదు వసు. Start Expressing Your LOVE – A Short Story

 

10 అంతస్థుల గాజు బిల్డింగ్ లో, ఏడవ అంతస్తులో, గాజు కిటికీలకు దగ్గరగా రెండో వరసలో ఉన్న మూడు క్యూబికల్స్ లో, క్యూబికల్ నెంబర్ 14 లో head phones పెట్టుకొని, lappy లో తల దూర్చి, పక్కనే ఉన్న ఫోన్ లో బ్లింక్ అవుతున్న message notification ని పట్టించుకోకుండా సీరియస్ గా పనిచేసుకుంటున్నాడు చూసారా అదే నేను, నా పేరు వీర వెంకట సత్య నారాయణ వర్మ(ఇదంతా నా ఒక్కడి పేరే, ఇన్ని పేర్లేంటి అని కంగారుపడకండి) షార్ట్ గా వెంకీ/వీరు/సత్య/నరేన్ (ఎవరికి నచ్చినట్టు వాళ్ళు). నాకు కొద్దిగా దగ్గరకి వచ్చారనుకో ‘చూడండి సారూ, మన సూపర్ స్టారూ…’ పాట high volume లో head phones లో నుండి కొంచెం బయటకు వినపడడం మీరు గమనించవచ్చు. అదిగో కంగారుగా వచ్చి క్యూబికల్ నెంబర్ 11 లో కూర్చుంటుంది చూసారా… నా వైపు కాదు బాసు, నా కుర్చీకి diagonal గా చూడు, బాగ్ పక్కన పెట్టి బాటిల్ తీసుకొని వెళ్తుంది చూసావా… ఆ… ఆ బక్కపలచటి అమ్మాయే వసుంధర short గా వసు. ఇప్పుడు మా ఆఫీస్ లోకి మీకు unauthorized access ఇచ్చి మరీ ఎందుకు తీసుకొచ్చానంటే దానికో కారణం ఉంది బాస్, ఈ లైన్ గుర్తుంచుకోండి కథ చివర్లో కారణం చెప్తా. నా కథ మొదలెట్టేముందు ఈ లాస్ట్ సీన్ చూడు… అదిగో cafeteria డోర్ open అవుతుంది, అంటే తానొస్తుంది. ఇప్పుడు నేను busy గా వర్క్ చేస్తూ, ఏదో serious ఇష్యూ గురించి ఆలోచిస్తున్నట్టు ఆ డోర్ వైపు చూస్తుంటాను, తాను అందులోనుండి బయటకు వస్తు నా వైపు చూస్తుంది… చూడు చూడు వచ్చేసింది… చూసింది… నేనో స్మైల్ ఇచ్చానా… తను ఓ స్మైల్ ఇచ్చిందనుకో, తన సీట్ లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది, నేను నా వర్క్ లో పడిపోయా.

ఇక కథలోకి వస్తే… తన పేరు వసుంధర, నా కంటే రెండేళ్లు జూనియర్, చూసారుగా ఎంత నాజూగ్గా ఉందొ. తను మా ఆఫీస్ లో చేరి ఆరు నెలలు అవుతుంది. మా పక్క క్యూబికల్ కు వచ్చి కొన్ని వారాలు అవుతుంది. తాను మా పక్క క్యూబికల్ కు వచ్చిన దగ్గరి నుండి ఇంచుమించు ప్రతీ రోజు ఓ రెండు మూడు సార్లు స్మైల్ exchange జరుగుతుంటుంది మా మధ్య. అంతే, అంతకు మించి మా emotions program lo single line of code కూడా extra execute అవ్వదు. అప్పుడప్పుడు warning messages లా తను ఏదైనా హెల్ప్ కావాలంటే వచ్చి అడుగుతుంటుంది, పక్కా professional. ఎందుకో తెలీదు, ఎలా మొదలైందో తెలీదు, అసలు ఇదేంటో తెలీదు కానీ తను మా క్యూబికల్ పక్కకి, నాకు diagonal గా కూర్చున్న దగ్గరినుండి, నాకు వర్క్ లో ఏ కొంచెం ఖాళీ దొరికినా కళ్ళు scheduled program లా తనవైపుకి execute అయిపోతున్నాయి. అప్పుడప్పుడు తను suddenగా వెనక్కి తిరిగేది, కొన్ని సార్లు నన్ను చూసి స్మైల్ ఇచ్చేది, కొన్నిసార్లు పట్టించుకునేది కాదు.

అప్పుడప్పుడు వాటర్ కోసం వెళ్లి వచ్చేప్పుడు తాను నా వైపు చూసేది, చూసేదని నేను ఆనందపడేవాడ్ని. అప్పుడప్పుడు వాళ్ళ టీం వాళ్ళు ఏదైనా గేమ్ ఆడుతుంటే నన్ను జాయిన్ అవ్వమనేవాళ్ళు, గేమ్ ఆడుతున్నంతసేపు దొంగచాటుగా/direct గా కొన్నిసార్లు తనని చూస్తూండేవాడిని. నాకు తన పేరు, తన రూపం తెలుసు కానీ తన గురించి తెలీదు. తనకి నా పేరైన గుర్తుందో లేదో నాకు తెలీదు. లంచ్ టైం లో తను వాళ్ళ టీం కంటే త్వరగా తినేసి వచ్చి కూర్చునేది, అప్పుడు నేను చూస్తే ఓ స్మైల్. అప్పుడప్పుడు వాళ్ళ టీం టీ బ్రేక్ కి వెళ్ళినప్పుడు తను ఒంటరిగా వర్క్ చేస్తూ కూర్చునేది, అప్పుడు నేను చూస్తే ఓ స్మైల్. తానెప్పుడూ ఒంటరిగా ఉన్న, నేను obvious గా తననే చూస్తుంటాను కాబట్టి, తాను నా వైపు చూసినప్పుడు అప్పుడప్పుడు ఓ స్మైల్ ఇస్తుంటుంది. తను ఆఫీస్ నుండి వెళ్లేప్పుడు కాబ్ కోసం బయట ఓ 10 నిమిషాలు వెయిట్ చేసేది, ఆ టైం లో వాకింగ్ అంటూ నేను అప్పుడప్పుడు తనని చూస్తూ వెళ్ళేవాడిని, అప్పుడూ ఓ స్మైల్. తను లిఫ్ట్ లో ఎప్పుడైనా నాకు ఎదురైతే, అప్పుడో స్మైల్. సింపుల్ గా మా ఇద్దరి మధ్య అరవై స్మైల్స్, మూడు technical discussions జరుగుతూ ఉండేవి.

నాకు తనంటే ఇష్టమా ? ప్రేమా ? అంటే చెప్పలేను. కోరికా అంటే ఔను. తనతో పడుకోవాలనే కోరిక కాదు నాకు, తనతో మాట్లాడాలని, తన గురించి తెలుసుకోవాలని, తనతో సమయం గడపాలని నా ఆరాటం. ఆఫీస్ లో అంతమంది అమ్మాయిలు, తనకంటే అందమైన వాళ్ళు, నాతొ క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు ఉండగా తనే ఎందుకూ అంటే అదీ తెలీదు. నువ్వు చూసినప్పుడు చూస్తుంది, పలకరిస్తే పలకరిస్తుంది, నవ్వితే నవ్వుతుంది, మాట్లాడితే మాట్లాడుతుంది గా, అసలు ఇక్కడ సమస్యేంటి …? చూడడం, నవ్వడం, పలకరించడం, పరిష్కరించడం వరకు నా వలన అవుతుంది. మాట్లాడడం ఉంది చూసావా అదే నాకు L1 Critical priority సమస్య. Basic గా నేనో introvert ని. పైన చెప్పిన అన్ని సందర్భాల్లో బహుశా నోటి నుండి ఒక్క మాట బయటకు రాకపోవచ్చు కానీ, మనసులో ఎన్నో ఆలోచనలు end condition లేని loop లా popup అవుతూ ఉంటాయి. వాటిలో ఒక్కటి output గా బయటకి వచ్చినా ఎంత బావుంటుందో.

తనతో మామూలుగా మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తను మా project కాదు. మా ఆఫీస్ లో చాలా మంది టైం దొరికితే రచ్చబండ, బతుకు జట్కా బండి చూస్తుంటారు. అలాంటి వాళ్లకు ఏ reason లేకుండా నేను, తను మాట్లాడుకోవడం కనిపిస్తే ఇంకేమైనా ఉందా ? అస్సలు ఏ అడ్డంకులు లేకుండానే మనకి మాట అంత త్వరగా బయటకు రాదు, ఇంకా అలాంటి వాళ్ళ మధ్యలో గొంతు ఎండిపోయేది. ఆఫీస్ లో ఉన్నంతసేపు నవ్వు, చూడడం తప్పించి వేరే step వేయకూడదని fix అయ్యా. ఇక తనతో నేను మాట్లాడడానికి దొరికే సమయం, cab కోసం తను బయట వెయిట్ చేసే 10 నిమిషాలు. అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మొదలెట్టాలి, ఆఫీస్ లో మాట్లాడకుండా ఇక్కడ ఎందుకు మాట్లాడుతుండు వీడు అనుకోకుండా ఎలా conversation స్టార్ట్ చేయాలో తెలీక ‘How to start conversation with your crush/with strangers/with anyone…’ అంటూ బోలెడు search terms తో గూగుల్ ని, youtube ని, wikihow ని, quoraa ని జల్లెడ పెట్టేసాను. Zero Compilation Errors ఉన్నప్పటికీ output మట్టుకు రాలేదు. కానీ, రోజు రోజుకూ తనతో మాట్లాడాలి అనే కోరిక project deadline కన్నా ఎక్కువ కలవరపెడుతుండేది.

కొన్ని రోజులకు ఇక face to face కష్టం కానీ, phone లో chat చేద్దాం అని తట్టి, office directory లో తన నెంబర్ తీసి, save చేసుకున్నా. అప్పటివరకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే తనతో మాట్లాడి, తనని అడిగి నెంబర్ తీసుకుందాం అనుకునేవాడిని. అది అసాధ్యం అని తెలిసి, ఈ process కి shift అయ్యా. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లి, వాట్సాప్ లో తన ప్రొఫైల్ ని చూసా, మెసేజ్ చేద్దాం అని హాయ్ టైపు చేసి సెండ్ చేయకుండా, నా ప్రొఫైల్ లో నా పిక్ తీసేసా, ఒకవేళ తను నా మెసేజ్ చూసినా నా నెంబర్ ఎలాగో తన దగ్గర ఉండదు కాబట్టి, నా ఫోటో చూసి గుర్తుపట్టకుండా ఉండాలని. 9:15 కి డిన్నర్ చేసి తనకి హాయ్ చెపుదాం అని వాట్సాప్ ఓపెన్ చేశా, 11.53 అయ్యింది మెసేజ్ టైపు చేయడం ఇంకా పూర్తవ్వలేదు. అప్పటివరకు హాయ్…delete , hello…delete, hey, this is satya from intel project…delete, namasthe vasundhara gaaru, naa peru satya, mee pakka cubical lo koorchuntanu…delete, hi, i am satya, emp# 12345, cube# 14…delete, hi vasu…delete, hi vasundhara…delete, hello, i am veera venkata satya narayana varma…delete, hi vasundhara garu, nenu veeru ni…delete… ఇలా ప్రతీ పదం టైపు చేసాక తాను ఎలా తీసుకుంటుందో అని permutations and combinations ఆలోచించడం, వేరేలా start చేయాలని delete చేయడం ఇదే సరిపోయింది రెండున్నర గంటలు. ఇదే ప్రహసనం ఓ మూడు రోజులు జరిగింది, ఆ మూడు రోజులు ఆఫీస్ లో తన వైపు చూడాలన్నా భయంగా ఉండేది. చివరికి ధైర్యం చేసి friday రోజు రాత్రి 9.15 కి Hai vasu, this is…అని టైపు చేస్తుండగా మా అక్క వాళ్ళ చిన్న పాప sudden గా ఫోన్ లాక్కుంది. ఆ తొందరలో మెసేజ్ send అయిపోయింది. నేను message డిలీట్ చేద్దాం అనుకుండగా టైపింగ్ అని కనిపించింది. ఆ వెంటనే… hi వర్మ అని రిప్లై. 1000 lines code execute చేసిన first attempt లోనే errors రాకుండా perfect output వచ్చినట్టు ఒక్కసారిగా నాకు మైండ్ బ్లాంక్ అయిపొయింది.

నేను అమితాశ్చర్యంలో తేలిపోతుండగా మరో మెసేజ్. ‘నేనే మెసేజ్ చేద్దాం అనుకున్నా, but నువ్ ఆఫీస్ లోనే మాట్లాడవ్, ఇలా మెసేజ్ చేస్తే ఏం అనుకుంటావో అని మెసేజ్ చేయలేదు. Thank god finally నువ్వే చేసావ్.’ నాకేం రిప్లై ఇవ్వాలో అర్ధం అవ్వలేదు, కాదు అస్సలు ఆలోచించకుండా May i ask you something ? అని పంపగానే, Yup అని రిప్లై. Boy friend ?. ‘No…Kinda yes’. ?. ‘ఉన్నా లేనట్టే’. I think i like you. ‘I know’. What…నిజంగానా. ‘నిజంగా నిజం అబ్బా’. ఎలా ?.’అమ్మాయిలం ఆ మాత్రం తెలుసుకోలేమా!’. మెసేజ్ చేసింది నేనే అని నీకెలా తెలిసింది ?. ‘నాకు ఆఫీస్ టెలిఫోన్ డైరెక్టరీ కి access ఉంటుందోయ్!’. నేను నీ నెంబర్ వెతికినట్టు నీకు notification వచ్చిందా ? అలా ఏం రాదు కదా. ‘రాదు బాబు’. మరి నా నంబర్ నీ దగ్గర ఎలా ?. ‘ఎక్కడ నుండి వచ్చావ్ రా నాయనా, పాండోరా నుండి లాండ్ అయ్యావా ఏంటి. నీకు అర్ధం అవ్వడం లేదా’. ఏంటి ?. ‘నా బొంద, నిన్ను లవ్ చేస్తున్నా చూడు’. ఎవర్ని లవ్ చేస్తున్నావ్ ?. ‘ హ్మ్… నీ కుడిపక్క రాజేష్ ఉన్నడా ?’ రాజేష్ కాదు, రమేష్. ‘ఆ రమేష్… అతని ఎడం పక్కన కూర్చునే వాడ్ని కర్మ కాలి లవ్ చేస్తున్నా’. రమేష్ కి ఎడం పక్క అంటే… నన్నే. నిజంగా ?. ‘నిజంగా నిజం అబ్బా’. హోయ్! ఎప్పటినుండి. ‘టైం నోట్ చేసిపెట్టుకోలేదోయ్. ఇంతకీ సర్ చెప్పరా ?’. ఏంటి ?. ‘ ఆ…Collections framework లో set కి, list కి difference గురించి…’. హయ్యో వసుగారు, అది బేసిక్ interview question అది తెలీదా మీకు. ‘నా బొందరా, నా బొంద. ఆ మాత్రం కూడా అర్ధం చేసుకోలేవా వర్మ ?’. అర్ధం అయ్యింది వసు, కానీ ఇదంతా కలేమో…చెప్పేస్తే ఎక్కడ మెలుకువ వచ్చేస్తుందో అని భయం. ‘ఎన్ని సార్లు నా ముందు నుండి వాకింగ్ చేస్తూ వెళ్ళావ్,ఒక్కసారైనా మాట్లాడాలి అనిపించలేదా ?’ లక్ష సంభాషణలు నీతో జరిపివుంటాను నా మనసులో, నాకు బయట మాట్లాడడం రాదు వసు. ‘హ్మ్…సరే ఇది కల కాదు కానీ ఇప్పుడు చెప్పు’ ఏంటి ? ‘చంపుతా…చెప్పు’….ఆ తర్వాత చాలా పెద్ద చాటయ్యింది.

ఇంతకీ ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, x% of అబ్బాయిలు, లవ్ గురించి చెప్పలేక, అసలు అమ్మాయిలతో మాట్లాడలేక ఎన్నో మల్లగుల్లాలు పడుతుంటారు. పైన చెప్పిన కథలోలా ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలిగా అనుకోవచ్చు, ఏమో ఎవరికి తెలుసు ? మీరు ఓ అడుగు ముందుకేసి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తేనే కదా ఏముందో తెలిసేది. మాట్లాడితే మిమ్మల్నేమి కొట్టి చంపరు కదా. ఒకవేళ కీడెంచి మేలెంచమనట్టు, కీడెంచి ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం లేదు అనుకుందాం… అదీ మీ మంచికే కదా. అప్పుడు మీ టైం, energy, feelings అన్నీ save అయినట్టే కదా. వేరే అమ్మాయి పైకి మీ attention షిఫ్ట్ చేయోచ్చు. అదే మేలెంచితే… ఆ అమ్మాయికి మీరంటే మంచి అభిప్రాయం ఉందనుకోండి… అప్పటివరకు one side లవ్ పేరుతొ మీరు తయారుచేసిన బుక్ లో మీ లవ్ స్టోరీ printing start చేయొచ్చు. Experience తో చెప్తున్నాను…టైం గడిచిపోతుంటే appraisals, late night work, meetings… ఇవేం గుర్తురావు బాబాయ్. మనకి నచ్చి, చెప్పే ధైర్యం లేక ఆగిపోయిన లవ్ స్టోరీ ఎప్పటికీ వెంటొస్తూనే ఉంటుంది. చెప్పి చూడండి, ఏమవుతుంది మహా అయితే మీకు పడిపోతుంది అంతేగా. Start Expressing Your LOVE.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,