This Fan’s Heartfelt Note On SSRajamouli Explains Why He’s An Inspiration

 

జీవితం అందరికి పాఠాలు నేర్పిస్తుంది. వాటిని ఎంత నేర్చుకుని ఆచరణ లో పెట్టమన్నా దాని మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. జీవితం లో  ప్రతి క్షణాన్ని పాఠంలా నేర్చుకుంటూ వెళ్తే ఆ వ్యక్తి ప్రయాణం ఎలా ఉంటుంది అని అడిగితే నాకు తట్టే మొదటి వ్యక్తి రాజమౌళి గారు.

 

రాజమౌళి తీసిన సినిమాలలో ఒక్కటి flop కాలేదు ఎందుకు?
రాజమౌళి సినిమాలలో అన్ని perfect గా ఉంటాయి ఎందుకు?
రాజమౌళి తీసిన సినిమాలలో emotion కి ఎందుకు అంతలా connect అవుతాం?
రాజమౌళి combination లో మన హీరో సినిమా రావాలని ఎందుకంత ఆశపడతాం?

 

ఇలా “కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?” కన్నా మించిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.  వాటన్నిటికీ సమాధానం ఆయన చేసిన ప్రయాణం.

 

ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి, సీరియల్ డైరెక్టర్ అయ్యి, రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణ లో మొదటి సినిమా తీసి, ఇలా ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ,  సింహాద్రి సినిమాకి “ఏముందిరా సినిమా! ఎవరు డైరెక్టర్?” అని మొదటి సారి తన పేరు అందరి నోట్లో నాణేలా చేసుకున్నారు. అక్కడనుండి మొదలైంది “రాజమౌళి –  The Beginning” అనే ప్రయాణం. 

 

ఈ ప్రయాణం వెనుక తను సాక్షి గా చుసిన వైఫల్యాలు, పంచుకున్న కష్టాలు, నేర్చుకున్న పాఠాలు  ఎన్నో. తన పెద్దనాన్న, నాన్న, సినిమా రంగంలో నిలబడటానికి పడిన కష్టం, అన్నయ్య సంగీత దర్శకుడిగా ఎదిగిన క్రమం. రాజమౌళి నేర్చుకున్న అతిముఖ్యమైన పాఠాలు.  వీటన్నిటి గురించి, రాజమౌళి గారి పెద్దనాన్న శివశక్తి దత్త గారు ఒక interview లో చెప్పారు. 


 

విజయం నేర్పే పాఠం కన్నా, వైఫల్యం నేర్పే పాఠమే విలువైంది. రాజమౌళి గారిని తన సినిమాలని శిల్పం లా చెక్కుతారని “జక్కన్న” అంటారు. కానీ రాజమౌళి గారి ప్రయాణం ఎన్నో ఉలి దెబ్బలని తట్టుకున్న శిల్పం. అందుకనే అంత అద్భుతంగా ఉంది. మనకు అంత ప్రత్యేకంగా నిలిచింది.  

 

నేర్చుకోవడం, అనుకున్నది సాధించడం ఇవి ఒక ఎత్తైతే, నేర్చుకున్న వాటిని ఇంకొంతమందికి నేర్పించడం ఇంకో ఎత్తు. స్టూడెంట్స్ తో వీలైనంత వరకు interact అవుతూ, సినిమా వల్ల తను నేర్చుకుంది వివరిస్తూ.. He is proving cinema is beyond the heroism, It is the best way to explore the knowledge & present our thoughts. 

 


 


 

 

 

ఇంత ఎత్తు కి ప్రయాణించిన ఆయనలో గర్వం కన్నా ఇంకా నేర్చుకోవాలనే తపన, నేర్చుకుంది పంచుకోవాలనే తాపత్రయమే ఉంది. అది చాలు ఇలాంటి విజయాలెన్నిటికో ఆయన్నీ అర్హుడని చేయటానికి.  

 

మనలో చాలా మంది మన అమ్మ నాన్నలు పడే కష్టాన్ని చూసి, ఏదైనా సాధించాలనుకునే వాళ్ళమే.
ఏదైనా సినిమా చూసి “ఈ scene ఇలా తీస్తే బాగుండేది” అని మన friend తో discuss చేసిన వాళ్ళమే.ఏదైనా hollywood సినిమా చూసి, “ఇలాంటి సినిమా మనమెందుకు తీయలేము?” అనుకునే వాళ్ళమే.  

 

ఆలోచన కి ఆచరణ కి మధ్య ఒక సన్నటి గీత ఉంది. ఇటువైపు ఉంటే మనలో ఒక్కరిగా ఉంటాం అటువైపు ఉంటే రాజమౌళి అవుతాం. సార్ మీరు అలా సినిమా చేస్తుండాలా.. మేము ఇలా చూస్తుండాలా.. 

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , ,