This Man Captures Rare Species Of Animals That Are Present All Across Telugu States

 

జనరల్ గా చాలామంది వైల్డ్ లైఫ్ చూడాలి, జంతువులను పక్షులను చూడాలి, వాటిని ఫోటో తీసుకోవాలని జంతువులు పక్షుల కోసం రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు. “టైగర్స్ కోసం జిమ్ కార్పెట్ కు వెళ్తారు, హార్న్ బిల్ కోసం కర్ణాటక వెళ్తుంటారు, కింగ్ కోబ్రాను చూడాలంటే అగుంబె(కర్ణాటక) వెళ్తుంటారు, ప్రపంచంలోనే అతిపెద్ద వేల్ షార్క్ ను చూడాలన్న వేరే దేశానికి వెళ్తుంటారు.. వీటన్నిటి కోసం ఇన్ని దేశాలు రాష్ట్రాలు తిరగాల్సిన అవసరం లేదు.. తరచి చూస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే చాలా రకాల పక్షులు, జంతువులు, చేపలు ఉన్నాయి. రాబందులు, వేల్ షార్క్(కాకినాడ తీరానికి వస్తుంటాయి), పులులు, వందల రకాల పక్షులు, ప్రపంచంలో అతి చిన్ని పిల్లి రస్టీ దగ్గరి నుండి అతిపెద్ద పిల్లి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కనిపిస్తుంటాయి.. హుఫ్!! ఇంత సమాచారం నాకెలా తెలుసనుకుంటున్నారా.? అన్నట్టు డైరెక్ట్ గా మాటల్లో పడి నా గురుంచి చెప్పలేదుగా.. హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ మన్నెపూరి.. నేను wildlife conservationist. అంటే ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఉందో వాటిని గుర్తించి రీసెర్చ్ చేసి, వాటికెమైనా అపాయం ఉందా.? తెలుసుకుని ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఈ సమస్త ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు సర్వ జీవరాసులదనే కాన్సెప్ట్ తో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ద్వారా జనాలలో అవేర్నెస్ తీసుకొస్తుంటాను..

 

అడవిలోకి నా ప్రయాణం:
జంతువులన్నా, అడవి మీద నాలో ఇంత ప్రేమ పెరగడానికి గల కారణం చిన్నప్పుడు మా నాన్న బెడ్ రూమ్ గోడమీద ఒక పెద్ద పోస్టర్ ను అంటించారు. ఆ పోస్టర్ మంచి క్వాలిటితో ఉండేది “చుట్టూ పొడవాటి చెట్లు వాటి ముందు ఒక సింహం రాజసంతో నిల్చుని ఉండేది”. నేను ఎప్పుడు బెడ్ రూమ్ లోకి వెళ్లినా ఆ పోస్టర్ ను తదేకంగా చూసేవాడిని. ఇంట్లో అమ్మానాన్నలు కూడా కుక్కలు, పిల్లులు, ఇతర పక్షుల పట్ల కూడా ప్రేమగా ప్రవర్తించేవారు, ఇంట్లో డిస్కవరీ ఛానెల్ ను కూడా ఎక్కువగా పెట్టేవారు.. అలాగే నేను కాకినాడలో చదువుకునే రోజులలో బయట చాలా NGO లు ఉండేవి.. పక్షులు, తాబేలు గుడ్లు పెడితే వాటిని ప్రొటెక్ట్ చేసేవారు, సముద్రం నది తీరాలలోని చెత్తను తీసివేయడం లాంటి కార్యక్రమాలు చేస్తుండేవారు.. నేను కూడా వారితో కలిసి పనిచేయడం వల్ల ప్రకృతికి ఇంకాస్త ఎక్కువగా దగ్గరయ్యాను.

 

అమ్మ సపోర్ట్:
2004లో నాన్న చనిపోయాక కొంతకాలం భయం వెంటాడింది ఐతే అమ్మ స్ట్రాంగ్ గా నిలబడడం వల్ల నాది ఇంకా ఇద్దరి తమ్ముళ్ల కెరీర్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సింగిల్ మదర్ గా ఇప్పుడున్న పరిస్థితులలో నెట్టుకురావడం మాములు విషయం కాదు, అమ్మమ్మ తాతయ్య సపోర్ట్ కూడా తనకు తొడయ్యింది. నేను డాక్టరవ్వడం అమ్మ కోరిక. కానీ నేను చెయ్యవలసిన పని వేరే ఉందని మొదట నేను, తర్వాత అమ్మ గుర్తించగలిగింది. తమ్ముడు భరత్ మాత్రం ఎంబీబీఎస్ చదివేసి అమ్మ కోరికను నెరవేర్చాడు. ఇంకో తమ్ముడు ప్రశాంత్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్లాలని తపన. సరైన గైడెన్స్ ఇస్తూ మా ముగ్గురి ఇష్టాలను అమ్మ ఏనాడు కాదనలేదు. వైల్డ్ ఫోటోగ్రఫీ కోసం అవసరమయ్యే కెమెరా లక్షల్లో ఉంటుంది, ఐనా కానీ అమ్మ నా అభీష్టానికి అండగా నిలబడింది..

 

మీరు కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్:
వైల్డ్ లైఫ్ అంటే ఎదో అడవిలో జంతువులవి అని అనుకుంటుంటారు.. కానీ అది నిజం కాదు “మనిషి సహాయం లేకుండా బ్రతికే ప్రతీ జీవిది వైల్డ్ లైఫ్ యె”. మనలో చాలామందికి కూడా చేస్తున్న జాబ్ కు రిజైన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అవ్వాలని, లక్షల్లో కెమెరా కొనాలని ఆశిస్తారు. అసలు ఇటువైపుకు రావాలంటే మిరెవ్వరు జాబ్ కు రిజైన్ చెయ్యాల్సిన పనిలేదు, లక్షల్లో కెమెరా కొనాల్సిన అవసరం కూడా లేదు. మీ జాబ్ మీరు చేసుకుంటూనే శని, ఆదివారాలు ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, దానికి కూడా 25,000 లో బేసిక్ కెమెరా లేదంటే మొబైల్ తో కూడా తీసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టుగా ఇండియా అంతటా ఉన్న జంతువులు, పక్షులు (కొన్ని తప్ప) మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి, వేరే రాష్ట్రలకు కూడా పోవాల్సిన పని కూడా లేదు.

 

ఇవన్నీ మన రాష్ట్రల్లోనే తీసినవి..

 


 


 

Black buck, Godavari island, Rajamahendravaram


 

Mugger crocodile hatchlings, East Godavari district


 

Olive Ridley sea turtle, S yanam beach, East Godavari District


 

Pora fishermen village, East Godavari District


 

Sandpipers, S yanam beach


 

Malabar pied hornbills, Eastren Ghats, East Godavari District


 

Golden jackal, Godavari mangrove forest


 

Polluru water falls, East Godavari District


 

Pied kingfisher


 

Smooth coated otter, Krishna river


 

Asian palm civet


 

Fishing cat, Godavari mangroves


 

For additional information, follow me: https://instagram.com/srikanthwildlife?igshid=1j3ktkpu3koce

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,