This Interpretation Of Sri Sri Gari Poem Is A Tribute To All The Frontline Workers Out There

 

Contributed By Pradeesh Bairisetty

 

May 1st కార్మిక దినోత్సవం జరిగింది.. కానీ ఇప్పుడు ఈ దేశం ఉన్న పరిస్థితి లో, ఫ్రంట్ లైన్ లో ఉంటూ, మన సౌకర్యాల కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వఖంగా ధన్యవాదాలు చెప్పులోవాలి. ప్రతి క్షణం వాళ్లకి మనం రుణపడి ఉన్నాం..
ఈ సందర్భంగా మనకు మాటలు చాలకపోతే అవి అరువు ఇవ్వడానికి నన్నయ దెగ్గరనుంది సీత రామ శాస్త్రి గారి దాక తెలుగు లో చాల మంది కవులే ఉన్నారు. కార్మికుల గురించి చెప్పుకునేప్పుడు మనకు ప్రప్రధమంగా గుర్తొచ్చే పేరు మహా కవి శ్రీ శ్రీ . ఆయన ‘ప్రతిజ్ఞ’ కవిత లో కార్మిక జీవుల ఔన్నత్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. ఒక తరానికి సరిపడా జ్ఞానాన్ని, భావాల్ని ఆయన కవితలో కూర్చారు.

 

కృతజ్ఞత తెలపాలని మనం కొత్తగా పదాలు వెతకవలసిన అవసరం లేదు. ఇలాంటి గొప్ప కవులు రాసిన కవితలను, వాటిలోని భావాలని అర్థం చేసుకుని, అభినందించి, ఎంతో కొంత అనుకరించగలిగితే అదే చాలు.
శ్రీ శ్రీ గారు అభ్యుదయ కవి. ఆయన కవితలు వాడుక బాషా లో ఉంటాయి. వాటిని సెపరేట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఆణిముత్యాలు ఎవరూ మిస్ కాకూడదు అనే ఉద్దేశం తో ఈ చిన్న ప్రయత్నం, తాపత్రయం.

 

ప్రతిజ్ఞ
STANZA 1 :

పొలాల నన్నీ ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ-
జగానికంతా సౌఖ్యం నిండగ-
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!

 

My Interpretation : This is a tribute to Farmers. కష్టపడి పని చేసి పొలాలలో పంట పండించి, తన బలాన్ని ఈ భూమాతకి అంకితమిచ్చి, ఈ సమాజానికి సౌఖ్యం కలిగించే రైతు ఒంట్లో పారుతున్న ఆ వేడి నెత్తురికి ఏ ఖరీదు లేదు, ఆ నిజాయితీ కి ఖరీదు లేదు!

 

STANZA : 2
నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని-
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ
ధనికస్వామికి దాస్యంచేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే,
గలగల తొణికే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!

 

My Interpretation : This is a tribute to laborers and worker class. వాళ్ళ ఒంట్లో ని శక్తి మొత్తం ఉపయోగించుకుని ఈ ప్రపంచం ముందుకు సాగాలని, పారిశ్రామిక అభివృద్ధి జరగాలని, యజమానులకు ఊడిగం చేస్తారు కార్మికులు. టెక్నాలజీ పెరిగే కొద్దీ, పరిశ్రమలు అభివృద్ధి చెందేకొద్దీ, ఆటోమేషన్ పెరుగుతుంది, Manual labor తగ్గుతుంది అని తెలుసు. ఈ ఫ్యాక్టరీస్ కోసం వారు పడే కష్టం తిరిగి వారినే కాటేస్తుంది అని తెల్సిన కూడా వాళ్ళు పని చెయ్యడం మానరు. వారు పడుతున్న కష్టానికి, వారి కన్నుల్లో మండే ఆ కన్నీళ్లకు ఖరీదో కట్టేంత వ్యాపారరావేత్త ఎవడూ లేడు

 

STANZA 3 :
నిరపరాధులై దురద్రుష్టంచే
చెరసాలలలో చిక్కేవాళ్ళూ-
లోహ రాక్షసుల పదఘట్టనచే
కొనప్రాణంతో కనలేవాళ్ళూ-
కష్టం చాలక కడుపుమంటచే
తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ-
శ్రమ నిష్పలమై, జని నిష్ఠురమై,
నూతిని గోతిని వెదికేవాళ్ళూ-
అనేకులింకా అభాగ్యులంతా,
అనాధులంతా,
అశాంతులంతా
దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో
విప్లవశంఖం వినిపిస్తారోయ్!

 

My Interpretation: This is his take on who become rebels and why they revolt against the wrong when they fall victim to the immoral forces in the society
తప్పు లేకుండా జైలు లో శిక్ష అనిభవించే వారు ఎందరో, అవినీతిపరుల దురాశ కి దెబ్బతిని కృంగిపోయిన వారు ఎందరో, చేసిన కష్టం ఫలించక బ్రతుకు మీద ఆశ కోల్పోయిన వాళ్ళెందరో. ఈ అభాగ్యులు, అనాధల అందరూ ఒక్కసారిగా ఎదురు తిరిగి పెద్ద ఎత్తున మార్పు వైపు విప్లవం వైపు అడుగేస్తారు

 

STANZA 4 :
కావున-లోకపుటన్యాయాలూ,
కాల్చేఆకలి, కూల్చే వేదన,
దారిద్యాలు , దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ,
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి,
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా-
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ-
వ్యధార్త జీవిత యధార్ధ ద్రుశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్!

 

My Interpretation : Sri Sri gaaru trying to explain what he wants to communicate through this poem, తన ఈ నూతన కవితా శైలి ద్వారా ఈ లోకం లో శ్రామికులపై కార్మికులపై జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగడుతూ, వారి ఔన్నత్యాన్ని తనదైన శైలి లో వర్ణిస్తూ, వారి బాధలను భయాలను, వారు చూస్తున్న అక్రమాలను తన గేయాల ద్వారా రాబోయే కాలాలకు ప్రమాద ఘంటిక లాగ, ప్రభాత వేకువ లాగా ప్రచురించాలని ప్రయత్నిస్తున్నారు

 

STANZA 5 :
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వ్రుత్తుల సమస్త చిహ్నాలు-
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ్యం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం.

 

My Interpretation : These are my favorite lines. Sri Sri garu’s tribute to all blue collar labor who work endlessly to keep this society functioning.
పనిముట్లు చేసేందుకు వాడే కొలిమి, కుండలు చేసేందుకు వాడే చక్రం, చేపలు పట్టుకునే పగ్గం, బట్టలు నేసె మగ్గం, రంపం, గొడ్డలి, నాగలి ఇలా మనం ఒకరోజు పొద్దున్న లేచినప్పట్నుండి రాత్రి పడుకునేదాకా ఏ లోటు రాకుండా జీవితం సజావుగా నడిచేలా చేసేందుకు ఉన్న వేల వృత్తులకు ఎన్నో చిహ్నాలు, ఇవన్నీ నేను పాడే ఈ గేయానికి, నేను రాయాలనుకునే ఈ నూతన బాటకి భావం, ప్రాణం, ఆరంభం, అంతం!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , , , ,