The Shiva Tandava Stotram At The End Of iSmart Shankar Climax Has A Great Meaning, Here’s What It Means

 

iSmart Shankar Climax ki vachindi… Appativaraku Kiraak BGM ichina Manisharma, Climax lo elaanti BGM isthaado ani chusthunna, Kaani “Siva Tandava Stotram” popularly known as “Siva Trance” BGM ga vachindi. Cinema mottam Music tho, BGM tho adarakottina Manisharma ki, Climax ki BGM ivvadam oka lekka? kaani enduku Siva Trance ni BGM ga endhuku use chesaaru. Endukante aa BGM ki Devotional songs ante peddaga pattinchukoni oka maamulu youngster ni kuda padhe padhe vinela chesey oka magic undhi kabatti. Aa paata ayyentha varaku oka trance loki vellipotham కాబట్టి. Ive kaakunda ee song ki inka chaala speciality undhi. Let’s See..

 

రావణాసురుడు పరమ శివభక్తుడు, జ్ఞాని. అతను పలికిన స్తోత్రం ఇది. శివుని ఆత్మలింగం కోసం రావణుడు కైలాసాన్ని తన 20 భుజములతో ఎత్తుతూ ఆలపించిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం వింటూ ముగ్ధుడై శివుడు తాండవం చేశారు కనుక ఇది శివతాండవ స్తోత్రం అయ్యింది. ఈ స్తోత్రాన్ని చాలా మంది చాలా రకాలుగా పాడారు కానీ, మనందరికీ బాగా తెలిసింది, వినింది మాత్రం, ఉమా మోహన్ గారు పాడారు. శివునికి సంబంధించిన స్తోత్రాలను ఎన్నింటినో పాడారామె.


 

ఈ పాట ని కొన్ని మార్పులు చేసి ismart shankar movie లో వాడారు. Nani’s Gangleader లో villain, hero ఇంటికి వెళ్ళినప్పుడు, Bahubali – The Beginnning లో కూడా ఈ స్తోత్రం వినిపిస్తుంది. “బాహుబలి” పాట లో అయితే, రావణుడు కైలాసాన్ని ఎత్తడం, శివుడు శివలింగాన్ని ఎత్తడం తో చాలా బాగా అన్వయించారు.


 

స్తోత్రం:

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ

ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరేరతి:ప్రతిక్షణంమమ

 


ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర

స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తునీ

 


జటాభుజంగపింగళ స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫుర త్వగుర్తరీయమేదురే

మనో వినోదమద్భుతంభిభర్తుభూతభర్తరి

 


సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః

శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః

 


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా

నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః

 


కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ

 


నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్

కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః

నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః

 


ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

 


అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతమ్

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

 


జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః

 


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో

ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో

తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్

 


కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్

విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్

విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్

 

అర్థం:
అరణ్యం కాంతి జటాజూటము నుంచి ప్రవహించే గంగ నది వాళ్ళ శుద్ధి చెందిన కంఠమందు మాలవలె అలంకరించిన సర్పము కలిగినవాడు, తన డమరుకము నుండి డమ డమ శబ్దములు వస్తుంటే ఆనంద తాండవం చేసే పరమశివుడు మనకు సమస్త శుభములను కలిగించుగాక.

 

జటాజూటము నందు గంగ ప్రవాహమును కలిగినవాడు, ఆ ప్రవాహము పైకి పారే తీగలవంటి కురులు కలిగిన తల కలిగినవాడు, జ్వాలలతో వెలుగొందు అగ్నిని తన ఫాలప్రదేశమునందున్నవాడు, చంద్రుడి వెలుగుతో ప్రకాశించేవాడు అయిన పరమశివుని యందు నా మనస్సు ప్రతిక్షణమూ నిలిచిఉంది.

 

పార్వతి దేవి కి పతి, ఎవని మనస్సులో ప్రతిక్షణం జనుల గురించే అతని ఆలోచనలు ఉంటాయో, ఎవని కృపాకటాక్షవీక్షణములు సోకితే సమస్త ఆపదలు నశించునో, అట్టి దిక్కులే అంబరములుగా ఉన్నవానిపైన నా మనస్సు రంజించుచున్నది.

 

జటాజూటమును అలంకరించిన పచ్చని సర్పముయొక్క ఫణి మణికాంతులతో విరాజిల్లుచూ, దిక్కులను కదంబకుంకుమ కాంతులతో నింపుచుండగా, పైని గజచర్మముతో చేయబడిన ఉత్తరీయము ఎగసి మదపుటేనుగును పోలగా సమస్త భూతపతిగా శోభించుచున్న వాడు నా మనస్సును ఆనందముతో నింపుగాక.

 

అశేషమైన ఇంద్రాది దేవతలు మొక్కడం వల్ల ప్రభవించిన ధూళిచేత కప్పబడిన పాదపీఠముకలిగి, వాసుకి అనే సర్పరాజముచేత బంధింపబడిన జటాజూటము కలిగి, చకోర పక్షులకు ప్రియుడైన చంద్రుని శిరస్సున ధరించినవాడు మాకు సిరులు ఇవ్వు గాక.

 

హోమాగ్నివలె ప్రజ్వరిల్లుచున్న లలాటాగ్ని కలిగి, ఆ అగ్నిలో పంచబాణుడైన మన్మథుని మసి చేసినవాడు, లోకనాయకుడు, మహాకపాలమును ధరించువాడు అయిన పరమేశ్వరునికి మ్రొక్కి మేము ఆయన సంపదలకు ప్రాప్తులు కాగలము.

 

భీకరమైన ఫాలప్రదేశమున ధగద్ధగాయమాన జ్వాలలతో వెలుగొందు అగ్నిచేత మన్మథుని దహించినవాడు, ఆమె యందు అనురక్తి కలవాడు, మాహాశిల్పి (లోకసృష్టియందు) అయిన త్రినేత్రముల నందు నా మనస్సున్నది.

 

క్రొత్త మేఘముల సమూహము వంటిది, దురాపదలను నిర్మూలింపదగినదయి స్ఫురించునది, రాత్రియందు చీకటి లాగ అనిపించే నల్లని కంఠము కలిగినవాడు, గంగానదిని ధరించువాడు, గజచర్మాంబరధారీ, చంద్రకళాధరుడు, జగత్కళ్యాణకర్త మాకు మంచి చేయుగాక

 

వికసించిన కమలముల సమూహమువలె నల్లని ప్రభ తోచు కంఠసీమను అవలంబించినది అను భ్రాంతి కలిగించువిధముగా సర్పాలన్కృత కంఠముచేత భాసిల్లువాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అయిన తనని స్మరించెదను.

 

సమస్త మంగళములనూ కలింగేచేటి వాడు, కదిమిపూల తేనెయందు అనురక్తి కలిగినవాడు, మన్మథారి, త్రిపురారి, భావారి, మఖారి, గజారి, అంధకారి, యమారి అగువానిని భజించెదను.

 

మెడలో ఉన్న పాము ఊపిరి ఆకాశముచేయు జయజయధ్వానములు కాగా, బయటికి వెల్వడు ఫాలప్రదేశ విస్ఫులింగములు క్రమముగా చేకూర, ధిమిధిమి నాదములతో ఢమరుకము ఉచ్చమంగళరీతి మ్రోగగా వాటికి అనుగుణముగా ప్రచండతాండవము చేయు పరమశివుని …

 

చూడగా, విచిత్రములైన లోకరీతులు – భుజంగహారము కానీ, ముత్యపు సరం కానీ, అమూల్యరత్నము కానీ, లేక మట్టి గానీ, తనవాడు కానీ లేక వేరవాడు కానీ, గడ్డివంటి కనులుండనీ, లేక అరవిందలోచనుడు కానీ, సామాన్యుడు కానీ మహారాజు కానీ, నేను సమముగా తలచి ఎప్పుడు మహేశ్వరున్ని సేవించగలను.

 

ఎప్పుడు నేను సురనదీతీరమున గల సుందరవనములయందు ఉండి దుర్మతిని వీడి, సదా శిరస్సుపైన అంజలి చేర్చి, చెడు చూపు లేక, ఫాలలలామునియందు మనస్సు చేర్చి, “శివ” అను మంత్రము జపించుచూ సుఖించెదను?

 

In English:

 


Jata tavi galajjala pravaha pavitasthale
Galea valambya lambitam bhujanga tungamalikam ||
Damad damad damad dama ninada vadda marvayam
Chakara chand tandavam tanotu nah shivah shivam ||1||

 


Jata kata hasam bhrama bhrama nilimpa nirjhari
Vilolavi chivalarai viraja mana murdhani ||
Dhagadhagadha gajjvala lalata patta pavake
Kishora chandra shekhare ratih pratikshanam mama ||2||

 


Dhara dharendra nandini vilasa bandhu bandhura
Sphuradi ganta santati pramoda mana manase ||
Krupa kataksha dhorani nirudhadurdha rapadi
Kvachit digambare mano vinodametu vastuni ||3||

 


Jata bhujanga pingala sphurat phana mani prabha
Kadamba kunkuma drava pralipta digva dhumukhe ||
Madandha sindhura sphura tvaguttari ya medure
Mano vinoda madbhutam bibhartu bhuta bhartari ||4||

 


Sahasra lochana prabhritya shesha lekha shekhara
Prasuna dhulidhorani vidhu saranghri pithabhuh ||
Bhujanga raja malaya nibaddha jata jutaka
Shriyai chiraya jayatam chakora bandhu shekharah ||5||

 


Lalata chatva rajvala dhanajn jaya sphu lingabha
Nipita pancha sayakam naman nilimpa nayakam ||
Sudha mayukha lekhaya viraja mana shekharam
Maha kapali sampade shiro jata lamastu nah ||6||

 


Karala bhala pattika dhagad dhagad dhagaj jvaltt
Ddhanajn jaya huti kruta prachanda pancha sayake ||
Dhara dharendra nandini kuchagra chitra patraka
Prakalpa naika shilpini trilochane ratir mama ||7||

 


Navina megha mandali niruddha durdha rasphurat
Kuhunishithi nitamah prabandha baddha kandharah ||
Nilimpa nirjhari dhara stanotu krutti sindhurah
Kala nidhana bandhurah shriyam jagad dhurandharah ||8||

 


Prafulla nila pankaja prapancha kali maprabha
Valambi kantha kandali ruchi prabaddha kandharam ||
Smarachchhidam purachchhidam bhavachchhidam makhachchhidam
Gajachchhidandha kachhidam tamanta kachchhidam bhaje ||9||

 


Akharva sarva mangala kala kadamba manjari
Rasa pravaha madhuri vijrum bhanama dhuvratam ||
Smarantakam purantakam bhavantakam makhantakam
Gajanta kandha kantakam tamanta kantakam bhaje ||10||

 


Jayatvada bhravibhrama bhramad bhujanga mashvasa
Dvi nirgamatkrama sphurat karala bhala havyavat ||
Dhimid dhimid dhimidhvanan mrudanga tunga mangala
Dhvani karma pravartita prachanda tandavah shivah ||11||

 


Shrushadvi chitra talpayor bhujanga maukti kasrajo
Garishtha ratna loshthayoh suhrudvi paksha pakshayoh ||
Trunara vinda chakshushoh praja mahi mahendrayoh
Sama pravrutikah samam pravartayan manah
kada sada shivam bhajamyaham ||12||

 


Kada nilimpa nirjhari nikunja kotare vasanh
Vimukta durmatihs sada shirah stha manjalim vahan ||
Vimukta lola lochano lalama bhala lagnakah
Shiveti mantra muncharan sada sukhi bhavamyaham ||13||

 


Idam hi nityameva mukta mukta mottamam stavam
Pathan smaran bruvannaro vishuddhi meti santatam ||
Hare gurav subhakti mashu yati nanyatha gatim
Vimohanam hi dehinam sushankarasya chintanam ||14||

 

Meaning:

 

With his neck, consecrated by the flow of water flowing from the thick forest-like locks of hair, and on the neck, where the lofty snake is hanging like a garland, and the Damaru drum making the sound of Damat Damat Damat Damat, Lord Śiva did the auspicious dance of Tandava and may He shower prosperity on us all.

I have a very deep interest in Lord Śiva, whose head is glorified by the rows of moving waves of the celestial river Gaṅgā, agitating in the deep well of his hair-locks, and who has the brilliant fire flaming on the surface of his forehead, and who has the crescent moon as a jewel on his head.

May my mind seek happiness in the Lord Śiva, in whose mind all the living beings of the glorious universe exist, who is the sportive companion of Parvati (daughter of the mountain king), who controls invincible hardships with the flow of his compassionate look, who is all-pervasive (the directions are his clothes)

May I seek wonderful pleasure in Lord Śiva, who is supporter of all life, who with his creeping snake with reddish brown hood and with the luster of his gem on it spreading out variegated colors on the beautiful faces of the maidens of directions, who is covered with a glittering upper garment made of the skin of a huge intoxicated elephant.

May Lord Śiva give us prosperity, who has the moon (relative of the Cakora bird) as his head-jewel, whose hair is tied by the red snake-garland, whose foot-stool is grayed by the flow of dust from the flowers from the rows of heads of all the Gods, Indra/Vishnu and others.

May we get the wealth of Siddhis from Śiva’s locks of hair, of him who devoured the God of Love with the sparks of the fire flaming in His forehead, who is bowed by all the celestial leaders, who is beautiful with a crescent moon.

My interest is in Lord Śiva, who has three eyes, who has offered the powerful God of Love into the fire, flaming Dhagad Dhagad on the flat surface of his forehead, and who is the one expert artist of creation accompanied by Parvati, the daughter of the mountain king.

May Lord Śiva give us prosperity, who bears the burden of this universe, who is lovely with the moon, who is red wearing the skin, who has the celestial river Ganga, whose neck is dark as midnight of new moon night covered by many layers of clouds.

I pray to Lord Śiva, whose neck is tied with the luster of the temples hanging on the neck with the glory of the fully bloomed blue lotuses which looked like the blackness (sins) of the universe, who is the killer of Manmatha, who destroyed Tripuras, who destroyed the bonds of worldly life, who destroyed the sacrifice, who destroyed the demon Andhaka, the destroyer of the elephants, and who controlled the God of death, Yama.

I pray to Lord Śiva, who has bees flying all over because of the sweet honey from the beautiful bunch of auspicious Kadamba flowers, who is the killer of Manmatha, who destroyed Tripuras, who destroyed the bonds of worldly life, who destroyed the sacrifice, who destroyed the demon Andhaka, the killer of the elephants, and who controlled the God of death, Yama.

Lord Śiva, whose dance of Tāṇḍava is in tune with the series of loud sounds of drum making Dhimid Dhimid sounds, who has the fire on the great forehead, the fire that is spreading out because of the breath of the snake wandering in whirling motion in the glorious sky.

When will I worship Lord SadāŚiva (eternally auspicious) God, with equal vision towards the people and an emperor, and a blade of grass and lotus-like eye, towards both friends and enemies, towards the valuable gem and some lump of dirt, towards a snake and a garland and towards varied ways of the world.

When will I be happy, living in the hollow place near the celestial river, Ganga, carrying the folded hands on my head all the time, with my bad thinking washed away, and uttering the mantra of Lord Śiva and devoted in the God with glorious forehead with vibrating eyes.

Divine beauty of different parts of Lord Śiva which are enlightened by fragrance of the flowers decorating the twisted hair locks of angels may always bless us with happiness and pleasure.

The Shakti (energy) which is capable of burning all the sins and spreading welfare of all and the pleasant sound produced by angels during enchanting the pious Shiv mantra at the time of Shiv-Parvati Vivah may win over & destroy all the sufferings of the world.

 

ఈ స్తోత్రం లో ఉన్న ప్రతి ఒక్క శ్లోకంలోని భావం, వర్ణన చాలా బాగుంటుంది. వీలైతే స్తోత్రాన్ని చదవడానికి ట్రై చేయండి పలుకుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాలా సినిమాల్లో ఈ స్తోత్రాన్ని కచ్చితంగా వింటాం. ఈ స్తోత్రం అలాంటిది మరి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,